హౌజింగ్ డాట్ కామ్ ఆలోచనకు ఎలా బీజం పడింది ?

అద్వితీయ శర్మ బిహైండ్ సీన్స్ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా అయ్యారు ?ఏ కుటుంబ పరిస్థితులు అద్వితీయంగా మార్చాయ్ ?ఆ మెయిల్ చూస్తే శర్మకు ఎందుకంత సంతృప్తి ? యువర్ స్టోరీ సిఈఓ శ్రద్ధా శర్మకు ప్రత్యేక ఇంటర్వ్యూ

0

ఏ వ్యక్తి అయినా సరే ఒక రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారంటే... దాని వెనుక మహత్తరమైన కృషి, పట్టుదల ఉంటాయి. కుటుంబ సభ్యులు, పరిసరాలు, మిత్రులు, ఇలా రకరకాల ప్రభావం ఒక వ్యక్తి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. హౌసింగ్‌.కామ్‌ అధినేత అద్వితీయశర్మ ఇందుకు ఒక ఉదాహరణ. ముంబయికి చెందిన హౌసింగ్‌.కామ్‌ అనేది రియల్‌ ఎస్టేట్‌ సంబంధిత వెబ్‌సైట్‌. సొంతానికి ఇళ్లు కొనుగోలు చేయాలన్నా లేదా అద్దెకు ఉండాలన్నా ఈ సైట్‌లో వెళితే చాలు సమస్త సమాచారం మన కళ్లముందు ఉంటుంది. హౌసింగ్‌. కామ్‌కు అంతపేరు సంపాదించడంలో అద్వితీయ శర్మ సంపాదించిన అనుభవాలు తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పట్టుదల, సేవా దృక్పథం, ఇతరులకు సహాయపడాలన్న గుణంతో పాటు అత్యంత ప్రధానమైన అంకితభావం తనకు అలవడటానికి తన చిన్ననాటి సంఘటనలే కారణమని ఆయన చెబుతారు. ఆ సంఘటనలు ఏంటని ఆయన్ని ప్రశ్నిస్తే తన్మయత్వం పొందుతారు. ఎదగాలనుకున్న ప్రతిఒక్క వ్యక్తీ ముఖ్యంగా ప్రతీ వ్యాపారవేత్తకు ఆయన అనుభవాలు మార్గదర్శకాలు అవుతాయనడంలో అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. వాటిపై ఒక్కసారి దృష్టి సారిస్తే...

జమ్మూ, అద్వితీయ తాతయ్య


అద్వితీయ శర్మ తాతయ్య
అద్వితీయ శర్మ తాతయ్య

'ఈ రోజు నేను నిర్వహిస్తున్న హౌసింగ్‌.కామ్‌కు ప్రేరణగా చాలా విషయాలు నిలిచాయి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రధానపాత్ర పోషించేది జమ్మూ. అక్కడే నేను పెరిగాను. జమ్మూలో నేను పెరుగుతున్న సమయానికి ఇళ్లు అద్దెకిచ్చే సాంప్రదాయం అంతగా వ్యాప్తి చెందలేదు. చిన్నతనంలో ఇద్దరు వ్యక్తుల ప్రభావం నాపై తీవ్రంగా ఉండేది. మా తాత, తండ్రి. మాది ఉమ్మడి కుటుంబం. మా తాతయ్య ప్రముఖ రచయిత, కవి. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభిం చింది. ఆయన కవితలు, నాటకాలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యేవి. మా తాతయ్యకు కొంచెం పిచ్చి అని నేను అనుకుడేవాడిని. ఎందుకంటే ఆయనలో ఆయనే నవ్వుకుంటూ ఉండేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గది కూడా కట్టించుకున్నాడు. ఆ గదిలో కూర్చుని కవితలు, రచనలు చేసే వారు.ఆయన అనుకున్నది రాసే వరకు బయటకు వచ్చే వారు కాదు. ఎన్ని రోజులు అయినా సరే అనుకున్నది పూర్తయిన తర్వాతే బయటకు అడుగుపెట్టేవారు. ఈలోగా ఎవరైనా ఆయన్ని కదిలిస్తే పెద్దగా కేకలు వేసేవాడు. ఆయన చేసిన ప్రతి రచన రేడియోలోనో, దూరదర్శన్‌లోనో ప్రసారమయ్యేది. అనుకున్నది పూర్తి చేయడం కోసం ఇంతగా కష్టపడటం నన్ను బాగా ఆకర్షించింది. జమ్మూ కా రాజా అని నన్ను ఆయన పిలుస్తుండేవారు. నేనంటే ఆయనకు ఎంతో ప్రేమ.౎

నా తండ్రి అంకితభావం


తండ్రిలో అద్వితీయ
తండ్రిలో అద్వితీయ

నా తండ్రి న్యూరోసర్జన్‌. జమ్మూలో మొట్టమొదటి న్యూరోసర్జన్‌ ఆయనే. న్యూరోసర్జరీ యూనిట్‌ని ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. నిరంతరం ఆయన పనిలో మునిగితేలుతూ ఉండేవారు. అలసట అన్నది నాన్నకు తెలియదు. ఆయన స్టాఫ్‌కు, జూనియర్‌ డాక్టర్లకు నిరంతర శిక్షణ ఉండేది. ప్రజలకు తన వైద్య సేవలు అందించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. ఆయనలో మరో ఆకర్షించే విషయం ఏమిటంటే పఠనం. రాత్రి సమయంలో ఆయనకు సంబంధించిన వైద్య పుస్తకాలను చదువుతుండేవారు. 25 ఏళ్లుగా ఈ అలవాటు కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఎందుకంటే బెస్ట్ న్యూరోసర్జన్‌గా ఉండాలన్నదే ఆయన తపన. ఒకసారి 18 గంటల పాటు ఆపరేషన్‌ చేసి వచ్చిన నా తండ్రితో మీరు అలసిపోలేదా?౎ అని ప్రశ్నించాను. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చరపరిచింది. ఏదో ఆశించి మన దగ్గరకు వచ్చే పేషెంట్లకు లేదా వారి బంధువులు, సన్నిహితులకు నా నోటి నుంచి శుభవార్త చెబితేనే నా అలసట మాయమవుతుంది. అప్పుడు వారి కంటి వెంట వచ్చే ఆనందభాష్పాలే నాకు అత్యంత ఉన్నతమైన రివార్డు. ఇటువంటి వాతావరణంలో నేను పెరిగాను. నా తల్లి కూడా డాక్టరే. అయితే నేను పుట్టిన తర్వాత ఆమె ప్రాక్టీసు చేయడం మానేసింది. ప్రేమ, ఇతరులకు సహాయపడటం వంటి మొదలైన అంశాలను ఆమె నుంచే పుణికిపుచ్చుకున్నాను. ఆమె గురించి మాట్లాడుతుంటే నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.౎

ఐఐటి, ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌


ఐఐటిలో స్నేహితులతో కలిసి
ఐఐటిలో స్నేహితులతో కలిసి

నా తల్లిదండ్రులు కొంతకాలం దుబాయిలో ఉన్న రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అప్పట్లో డిటర్జెంట్‌ టైడ్‌ ప్యాకెట్‌ కొంటే ఒక డిజిటల్‌ వాచ్‌ ఉచితంగా యిచ్చేవారు. ఆ ప్యాకెట్లు ఎక్కువుగా కొనమని నా తల్లిని ఒత్తిడి చేస్తుండేవాడిని. అట్లా వచ్చిన వాచ్‌లను ఓపెన్‌ చేసి చూసేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది, లెక్కలు, టెక్నాలజీపై ఆసక్తి ఉందని. నేను పదకొండు, పన్నెండవ తరగతి చదువుతున్నప్పుడు, మనదేశంలో కల్పనా చావ్లా వార్తలు మార్మోగిపోతుండేవి. మా బంధువుల్లో చాలా మంది చండీగఢ్‌లో ఉన్నారు. కల్పనా చావ్లా కూడా అక్కడి వారే. దీంతో మా సంభాషణలు చాలావరకు కల్పనా చావ్లా, నాసాల గురించి ఉండేవి. నేను ఆస్ట్రోనాట్‌ కావాలని, నాసాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ కలల సాకారం కోసం ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో చేరాను. తరగతులకు హాజరవుతున్న క్రమంలో నాకు అర్థమైంది ఏమిటంటే ఎయిర్‌షిప్‌ను తయారు చేయడం కన్నా, దాంట్లో ప్రయాణం చేయాలన్న దానిపైనే నాకు ఆసక్తి ఉండేది. అయితే నా ఇంజనీరింగ్‌ విద్య నాకు ఉపకరించిందనే చెప్పాలి. ఎట్లా అంటే.. హౌసింగ్‌కు సంబంధించి మా ఇన్వెస్టర్లు ఫలానాది ఎలా సాధిస్తారంటూ ప్రశ్నించే వారు. ఆ సమయంలో నేను చెప్పే సమాధానం.. ఇదేమి రాకెట్‌ సైన్స్ కాదని, నేను ఒక ఇంజనీరునని చెప్పేవాడిని. నా ఆలోచనా విధానాన్ని మార్చిన ఐఐటీ బాంబేకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ౎

సమయం వృథా చేయద్దు

నేర్చుకోవాలన్న కసి నాలో తీవ్రంగా ఉంది. సమస్యలను నా అంతట నేను పరిష్కరించుకోవాలి. నేను పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఈవిధంగా చేయడం వల్లే నా పనితీరు మెరుగు పడింది. ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి, చూడటానికి నా సొంత పద్ధతిలో, సరిపడా సమయం తీసుకుం టాను.౎

హౌసింగ్‌. కామ్‌ ఎందుకు ఏర్పాటు చేశానంటే ?

మన ప్రాథమిక అవసరాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఒకటి. ప్రతిఒక్కరి జీవితంలో ఇది తప్పనిసరి. నివసించడానికి ప్రతిఒక్కరికి ఇల్లు కావాల్సిందే. అందుకోసం ఇల్లు కొనడమో, అద్దెకు తీసుకోవడం చేస్తాం. ఎన్నో ఇళ్లు మారుతుంటాము. కొన్ని కారణాల వల్ల ఇంటికి సంబంధించి వ్యవహారాల్లో బిగుసుకుపోయినట్లు కొంతమంది ఉంటారు. దీనికి కారణం స్పష్టత, పారదర్శకత, సమర్థత వంటి అంశాలు కొరవడటమే. మనమందరం పారదర్శకత కావాలని కోరుకుంటాము. నా వరకూ హౌసింగ్‌. కామ్‌ అనేది నా ఆలోచనలకు ప్రతిరూపం. లక్షల మంది ప్రజలకు ఇది ఉపయోగపడుతోంది. దీనికి ఒక లక్ష్యం, అర్థం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెబుతాను. బెంగళూరు అమ్మాయి నుంచి నాకు ఒక ఈ మెయిల్‌ వచ్చింది. థ్యాంక్‌ యూ అద్వితీయ మీ సంస్థ హౌసింగ్‌. కామ్‌ ద్వారా మేము కోరుకున్న ఇంటిని ఎంచుకున్నాము. మా గ్రాండ్‌ మదర్‌కు 70 ఏళ్లు. ఆమె తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. అందుకని ఆస్పత్రులకు సమీపంలో ఉండే ఇల్లు మాకు అవసరమైంది. ఆ పని మీ వెబ్‌సైట్‌ ద్వారా నెరవేరింది.౎ అని ఆ మెయిల్ సారాంశం. నేను చాలా సంతోషపడ్డాను. నేను ఏంటీ అన్నది ఈ మెయిల్‌ అద్దంపడుతుంది. మనం సృష్టించింది ఏదైనా ఘనంగా ఉండాలి౎ అని హౌసింగ్‌. కామ్‌ వ్యవస్థాపకుడు అద్వితీయశర్మ చెప్తారు.

- శ్రద్ధ శర్మ