ఇంటర్న్‌ కదా అని ఈజీగా తీసుకోవద్దు...! స్టార్టప్స్‌కి వీళ్లూ ఆధారమే...

కంపెనీ ప్రారంభించాలంటే ఏఏ అంశాలు తెలుసుకోవాలిఎలాంటి వారికి అవకాశం ఇవ్వాలిగొప్ప టీం తయారు చేయడానికి కావల్సిన అంశాలేంటి ?స్టార్టప్ ప్రారంభించాలంటే ఈ సలహాలు పాటించండి

ఇంటర్న్‌ కదా అని ఈజీగా తీసుకోవద్దు...! స్టార్టప్స్‌కి వీళ్లూ ఆధారమే...

Saturday May 30, 2015,

4 min Read

మీ టీంలో మిగిలిన టీం సభ్యులు మిమ్మల్ని మోసం చేశారా ? అధైర్యపడొద్దు. మీకు కచ్చితంగా అవకాశాలొస్తాయి. మీకు ఆత్మవిశ్వాసం ఉంటే మరింత ముందుకు పయనించండి. ధీమా ఉంటే మరో కంపెనీని ఆవిష్కరించే పని మొదలు పెట్టండి. తొందరలోనే ఆ కంపెనీ పైకొస్తుంది. మీరొక స్టార్టప్ పౌండరా ? మీకు గొప్పగొప్ప ఆలోచనలున్నాయా ? పనిగంటలను లెక్కబెట్టకుండా పనిచేసే సత్తా మీలో ఉందా ? ప్రతివిషయంలో అప్ టు డేట్ అవుతున్నారా ? క్లెయింట్స్ మీటింగులకు అటెండ్ అవుతున్నారా ? ఇన్వెస్టర్ల మీటప్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా ? కంపెనీ లాంచింగ్‌కు ముందు ఫండింగ్ క్యాంపైన్ సక్రమంగా చేపట్టి ఫండింగ్ రాబట్టారా ? అయితే మీరు కచ్చితంగా విజయం సాధించినట్లే.

image


నాకు కంపెనీ లేదు. నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలోని కోర్ టీంలో నాకు సభ్యత్వం లేదు. వచ్చే ఏడాది సమ్మర్ దాకా నా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాదు. ఇంతకీ నేనెవరిని? నేను నేర్చుకుంటూ ఉన్నా. భవిష్యత్ లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను నమ్మిన సిద్ధాంతానే ఆచరిస్తా. నాదొక కొత్తరక్తం. నేను స్టార్టప్ కి ఇంటర్న్ లాంటి వాడిగా భావిస్తున్నా. అయినా ఏం ఫర్వాలేదు. వీటన్నింటిని పక్కన పెట్టి కంపెనీ ప్రారంభించాలనే విజన్‌ని మాత్రం తెరపైకి తీసుకురండి

స్ప్రింటర్ వర్సస్ మారథానర్

image


స్ప్రింటర్, మారథానర్ ఇద్దరూ అథ్లెట్సే. పరిగెత్తగలగడమనేది వారిద్దరిలో ఉన్న సిమిలారిటీ. ఒకరేమో 80 ఏళ్ల సినిమా నటుడు. ఎంతో అనుభవం, జీవిత పాఠాలు నేర్చిన వ్యక్తి. రెండో వాడు క్రాష్ కోర్స్ నేర్చుకొని ప్రవేశించిన వాడు. స్పింటర్ విషయానికొస్తే వాడి తెలివి తేటలను వాడుకోవాల్సి ఉంటుంది. మారథాన్ కొత్తగా ఆలోచించలేకపోయినా అతను కంపెనీకి ఎంతగానో అవసరమన్న విషయం గుర్తించాలి. ఒక ఫౌండర్‌గా ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉండాలి. స్ప్రింటర్‌ను తీసుకుంటే... వారి వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ అది ఎంతకాలం అనేది తెలుసుకోవాలి. ఏ విషయంపైనైనా తొందరగా స్పందిస్తారు, ఫలితాలను అందించగలరు. కాని అవి తాత్కాలికమే. కానీ మారథానర్ అలాకాదు. స్ప్రింటర్‌ కంటే సైజులో సగం ఉంటాడు. కానీ మీ అవసరాలకు అనుగుణంగా సమయానికి ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ తనని కూడా మీ టీంలో ఉంచుకోవాలి. మీరు గంటలకొద్దీ నడిపించాలంటే.. అది పెద్ద వ్యక్తులతో సాధ్యం కాని పని.

స్ప్రింటర్ చక చకా పని చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఎంత త్వరగా పని కావాలనే దానిపైనే అతని ఆలోచన. పని విషయంలో కూడా చాలా బేలన్సింగ్‌గా ఉంటాడు. మీరు స్ప్రింటర్‌కు ఉద్యోగం ఇస్తే కచ్చితంగా పనిచేస్తాడు, సాధిస్తాడు. కానీ తాను కంపెనీని ఎప్పుడు విడిచిపెడతాడనే విషయం బహుశా తనకి కూడా తెలిసి ఉండక పోవచ్చు.అప్పుడు వేరే స్ప్రింటర్‌ని వెతుక్కోవాల్సి ఉంటుంది.అప్పటి దాకా మీరే అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పనిచేసే సత్తా తనలో ఉంది కాబట్టి వేరే కంపెనీ వాళ్లు ఇచ్చిన మంచి ఆఫర్ ను స్ప్రింటర్ తిరస్కరించడు.

ఓ ఇంటర్న్ దినచర్య ఇది. ఉ. 10 నుంచి సా. 6 వరకూ ఏం ఏం చేస్తాడో.. ఎలా చేస్తాడో వివరించే ప్రయత్నమే ఈ పిక్

ఓ ఇంటర్న్ దినచర్య ఇది. ఉ. 10 నుంచి సా. 6 వరకూ ఏం ఏం చేస్తాడో.. ఎలా చేస్తాడో వివరించే ప్రయత్నమే ఈ పిక్


ది మారథానర్- అధిక బాధ్యతను తీసుకోడానికి సిద్ధంగా ఉండడు. మొత్తం 42కిలోమీటర్లు పరిగెత్తేదాకా తన ప్రయాణాన్ని ఆపడు. తన ఒంట్లో ఉన్నఅధిక కొవ్వుని కరిగించడానికే సిద్ధపడతాడు. తనకు స్థిరత్వం ఎక్కువ. నెమ్మదిగా ఉన్నప్పటికీ స్థిరత్వం ఉంటుంది. కొత్త విషయాలను నెమ్మదిగా తెలుసుకొని దానిపై కమాండ్ పెంచుకుంటాడు. సరికొత్త కళలను నేర్చుకోవడంపై ఎక్కువగా శ్రద్ధ పెడతాడు. తనకు ఎంత సేలరీ వస్తుంది లాంటి విషయాలను కనీసం పట్టించుకోడు. తానెంత నేర్చుకున్నాననే దానిపైనే ఎక్కువ ఆలోచిస్తాడు. కంపెనీకి తానెంత ఉపయోగపడుతున్నాననే దాన్ని పట్టించుకుంటాడు.

బలం, బలహానతలను గుర్తించడం

కంపెనీ ప్రారంభించిన రోజే 30వేల డాలర్ల డబ్బుని పెట్టి సేల్స్ పర్సన్స్‌ని అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. డిజైనర్లను, కంటెంట్ మార్కెటర్స్‌ని పెద్ద పెద్ద జీతాలిచ్చి తీసుకోవాలనే అభిప్రాయం తప్పే. క్వాలిటీ ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పులేదు కానీ వేలం వెర్రిలాగ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. అక్కడే మీ బలం, బలహీనత బయటపడుతుంది.

వేచిచూసే దోరణి మీలో ఉందా?

ఫ్యాషన్, ఫైనాల్షియల్ కంపెనీలనే చూడండి. ఇంటర్న్‌కే మొదటిప్రాధాన్యం. ఎందుకంటే ఫ్రెషర్స్ కావడం వల్ల చక్కగా ఇన్ షర్ట్ చేసుకొని స్మార్ట్ గా కనిపిస్తారనే కాదు... ఇంటర్న్స్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కానీ వీరికి డిమాండ్ తక్కువగా ఉంది. సాధారణంగా ఫ్రెషర్ అంటే కొత్త ఆలోనలతో వినూత్నంగా ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. ఇది కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో సహకరిస్తుంది.

ఇంటర్న్ – ఇంటర్న్‌ని అంత తక్కువగా అంచనా వేయొద్దు. మొదటి రోజు ఏమీ తెలియని మొద్దుగా కనిపించినా.. నేర్చు కోడానికి అవకాశం ఇచ్చి మీ టీంలో తీసుకుంటే.. చాలా తక్కువ సమయంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకొని మనకు తెలియని వ్యాపార రహస్యాలను కూడా చెప్పే స్థాయికి చేరుకుంటాడు.

“ప్రోఫౌండీస్ కంపెనీలో నేనొక వెబ్ డెవలపర్ ఇంటర్న్ గా నా కెరియర్ ప్రారంభించా. దాదాపు రెండేళ్ల క్రితం మాట ఇది. అప్పుడు నాకు దీనిపై అవగాహన ఉంది కానీ విషయాలు మాత్రం అంతంత గానే తెలుసు. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో విషయాన్నీ అవగతం చేసుకున్నా. ఏడాది పూర్తి అయినప్పటికి ‘డూసెలక్ట్’ అనే కంపెనీకి నేను కో ఫౌండర్ అయ్యాను. నా కంపెనీలో నలుగురు ఇంటర్న్ క్యాండిడేట్లున్నారు. దీనికి కారణం నాకు ప్రోఫౌండీస్ ఇచ్చిన అవకాశమే.” అని సాంకేత్ సౌరవ్ అన్నారు. సాంకేత్ కంపెని కంప్రహెన్సివ్ టెస్టింగ్ పై పనిచేస్తోంది.

స్టార్టప్ కంపెనీ రూల్స్ మారుతునే ఉంటాయి. కొన్నేళ్ల క్రితం కంపెనీకి వెబ్ సైట్ ఉంటే అన్ని అయిపోయానుకునే వారు. కానీ సోషల్ మీడియా ప్రమోషన్ అంటే వారు లైట్ తీసుకునే వారు. ఎదగాలంటే సరైన టీం తో పనిచేయడమనే ఒకే ఒక్క సిద్ధాంతాన్ని నమ్ముకునే వారు. ఇది సదాభిప్రాయమే కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. ఓ మంచి టీం కంటే ఓ గొప్ప టీం తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇప్పటి తరం స్టార్టప్ లకు కావల్సింది గ్రేట్ టీం మాత్రమే.

టీం అంటే ఎలా ఉండాలి?

పెద్ద పెద్ద పనులు చేయాలంటే బిగ్ షాట్ లాంటి స్ప్రింటర్ కావాలి. వీరుంటే టీం మొత్తం మోటివేట్ అయిపోతుంది. వారిలో ఎనర్జీ టీం ను ముందుకు తీసుకెళ్తుంది. వీరితో పాటు ఎక్సెల్ షీట్‌లు ఫిల్ చేస్తూ స్థిరంగా ఆడే ఆటగాడిలాగా పనిచేసే మారథాన్ అవసరమూ ఉంది. వీరయితే మన బ్లాగ్‌లను కూడా ఎంతో వినూత్నంగా రాసే సత్తా కలిగి ఉంటారు. వీరితో పాటు ఇంటర్న్స్ అవసరాన్ని కూడా మనం గుర్తించాలి. వీరంతా ఉంటే టీం సమపాళ్లలో ఉన్నట్లు అర్థం. గొప్ప విజయాలు సాధించాలంటే గొప్ప టీం అవసరం ఎంతైనా ఉంది. పదిమంది స్ప్రింటర్స్ ఉంటే ఒక మారథానర్ ఉండేలాగా చూసుకోండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఆల్ ది బెస్ట్.