మొన్న దినసరి కూలీ.. నిన్న ఐటి ఎనలిస్ట్.. నేడు రైతు సేవల స్టార్టప్ సీఈఓ

138 దేశాల్లోవ్యాపించిన ఆగ్రోబుక్ సేవలు..ప్రారంభమైన 4నెలల్లోనే ఎల్లలు దాటిన ఆగ్రో స్టార్టప్.. 

0


ఆగ్రోబుక్ టీం విషయానికొస్తే.. ముందుగా చెప్పుకోవల్సిన వ్యక్తి ఫౌండర్ సుభాష్ లోధే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు ఐటి, బిజినెస్ అనలిస్ట్ గా 26 ఏళ్ల అనుభవం ఉంది. 2 బిలియన్ డాలర్ల కంపెనీలో ఉద్యోగం విడిచిపెట్టి వ్యవసాయానికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆగ్రోబుక్ స్టార్టప్ ప్రారంభించారు. యవట్మల్ అనేది మహారాష్ట్రలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడే జిల్లా. ఇదే సుభాష్ సొంతూరు. డెయిలీ వేజర్, ఫార్మర్, మిల్క్ డెలివరీ బోయ్‌గా పనిచేసిన సుభాష్ ఎంతో కష్టం మీద ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ముంబైలో లెక్చరర్ గా పనిచేసారు. తర్వాత ఈఆర్పి కన్సల్టింగ్ కెరీర్ ఎంచుకొని బిజినెస్ అనలిస్ట్‌గా మారారు. యూఎస్, యూకే, నెదర్లాండ్స్ దుబాయ్ లలో పనిచేశారు. ప్రస్తుతం కోర్ టీంలో ముగ్గురు సభ్యులున్నారు. ఫ్రీలాసింగ్, ఆఫ్ బోర్డ్ లో చాలా మంది పనిచేస్తున్నారు.

ఆగ్రోబుక్ డాట్ కామ్(agrowbook.com) 

ఇది వ్యవసాయ ఎకో సిస్టమ్‌కు సంబంధించిన ఐసిటి సొల్యుషన్. రైతులకు సాయం చేస్తూనే వ్యవసాయ రంగంలో ఉండే ఇతరులకు గైడ్ లెన్స్ ఇస్తుంది. వ్యవసాయ ఆధార పరిశ్రమలను ప్రోత్సహించడం, అగ్రికల్చర్ స్టూడెంట్‌లు, వ్యవసాయంపై రీసెర్చ్ చేసేవారు, వ్యవసాయానికి మద్దతిచ్చే బ్యాంకులకు ఇతర ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్‌లకు ఈ స్టార్టప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆగ్రోబుక్ సమాచారమే పరమావధివిగా నమ్మే సంస్థ. స్మార్ట్ ఫోన్ శకం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం గురించి తెలుసుకోవడం, కొత్త పద్ధతులు నేర్చుకోవడానికి మార్గాలు సుగమం అయ్యాయి. ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా రైతు ఇంటి దగ్గర నుంచే తను పండించిన పంటకు సరైన మార్కెట్ చేసుకొనే అవకాశాన్ని కల్పించడమే మా ప్రధాన ఉద్దేశమంటారు ఫౌండర్ సుభాష్ లోధే. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మార్పులు రాడానికి ఇప్పటి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎక్కడెలాంటి కొత్తపద్దతి అమలు చేసినా.. క్షణాల్లో దానికి సంబంధించిన సమాచారం అందించగలిగితే తాము సక్సస్ అయనట్లే అంటారాయన.

ఫౌండర్ సుభాష్ లోధే
ఫౌండర్ సుభాష్ లోధే
“వ్యవసాయ నేపధ్యం, అనుభవం తోపాటు దానిపై చర్చించి ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారమ మార్గాలను చూపించగలుతాం. పదిమంది కలసి చర్చించి ఒకరికి సాయం చేయాలన్నదే మా తదుపరి లక్ష్యం. ఇది మాలాంటి స్టార్టప్ ఫ్లాట్ ఫాంలో సాధ్యపడుతుంది.” అని అన్నారు సుభాష్.

ఆగ్రో ట్యూబ్

ఈ తరహా వ్యవస్థలో ఇదే మొదటిది. ఆగ్రో ట్యూబ్ ద్వారా వీడియోలను చూడొచ్చు. సైట్‌లో లాగిన్ అయిన రైతులు వీడియో ద్వారా సమాచారం సేకరించొచ్చు. వీడియో చూసిన రైతులు గానీ, యువకులు కానీ తర్వాతి విషయంపై సైట్ కు సంప్రదించే వెసులుబాటుంది. దీని ద్వారా టెక్నాలజీ వాడకం పెంచొచ్చు. 

తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామం ఏ రకంగా వ్యవసాయంలో ఉన్నత స్థాయికి చేరింది.. లాంటి కథలు ఈ ఆగ్రో ట్యూబ్ లో ఉన్నాయి. అగ్రికల్చర్‌కు సంబంధించిన చాలా విషయాలు, ఎన్నోకోర్సుల సమాచారం ఇందులో ఉంది. కొన్ని సంస్థలతో భాగస్వామి అయి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను మెరుగుపరిచే కార్యక్రమం చేపడుతున్నాం. తద్వారా ఆయా ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేస్తున్నాం.

ఒక మంచి ఉదాహరణగా అస్సాంలోని తేజ్ పూర్‌కి చెందిన ఓ అబ్బాయి విజయగాధను మనం చూడొచ్చు. తాను మొదటి సారి ఇంటర్నెట్ ఉపయోగించిన వ్యక్తి. ఆగ్రో ట్యూబ్‌లో కోళ్ల పెంపకం స్టోరీ చూసి స్ఫూర్తి పొందాడు. తర్వాత తన భూమిని పౌల్టరీ ఫాం కోసం వినియోగించాడు. మేం తనకు మద్దతుగా నిలిచి నాబార్డు అధికారులను సంప్రదించేలా చేశామని సుభాష్ ఎంతో ఆనందంగా చెప్పారు. ఇదే కాదు ఇలాంటి స్పూర్తినిచ్చే ఎన్నో రకాలైన వీడియోలు అగ్రో ట్యూబ్‌లో ఉన్నాయి. 

ఆగ్రో సొల్యూషన్ (వ్యవసాయ పరిష్కారాలు)

వ్యవసాయం చేస్తుండగా వచ్చే సమస్యలను పరిష్కరించే ఓ వేదికగా ఆగ్రో బుక్ నిలవనుంది. సమస్యల తాలూకు వివరాలను సేకరించి వాటిని నిష్ణాతులకు చేరవేస్తాం. వారి దగ్గర నుంచి తొందరగా పరిష్కారం అందేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. వచ్చే నెలలో ఆగ్రో సొల్యూషన్ పేరుతో దీన్ని ప్రారంభించాలని యోచిస్తున్నామని సుభాష్ వివరించారు. స్మార్ట్ ఫోన్ యాప్‌లో ఇది పనిచేసేలా, కొత్తగా వ్యవసాయరంగంలోకి యువకులు ప్రవేశించడానికి ఇది బాగా ఉపయోగపడగలదని ఆయన అభిప్రాయపడ్డారు. జంతువుల ఆరోగ్య విషయాలపై కూడా అనేక సలహాలు సూచనలు అగ్రో సొల్యూషన్ ఇస్తుంది. దురదృష్టం కొద్దీ దేశంలో చాలా తక్కువ వెటర్నరీ క్లినిక్‌లు ఉన్నాయి. దీంతో పశువులు ఇతర జంతువుల ఆరోగ్య విషయాలపై పాడిపరిశ్రమలో పనిచేసే వారికి సరైన సమాచారం లభించడం లేదు. మా స్టార్టప్ దీనికి సొల్యూషన్ చూపిస్తోందని అన్నారాయన.

భవిష్యత్ ప్రణాళికలు

సభలు, సమావేశాల్లాంటి యాక్టివిటీలు నిర్వహించడానికి కొన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వస్తున్నాయి. గ్రామీణ భారతంలో సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అక్కడ డిజిటల్ స్కిల్స్‌ను పెంపొందించాలనే ధ్యేయంతో అగ్రోబుక్ అడుగులేస్తోంది. వచ్చే ఏడాది కల్లా సప్లై చెైన్ చేపట్టాలనే యోచనలో ఉంది. వ్యవసాయం చేసిన దగ్గర నుంచి దాన్ని అమ్మకం చేపట్టేదాకా అన్ని విషయాల్లో ఆగ్రోబుక్ తనదైన మార్క్ చూపించాలని చూస్తోంది. దీంతో పాటు ఆగ్రోలిస్ట్ పేరుతో వ్యవసాయంతో సంబంధం ఉన్న అన్ని రంగాలను ఒక తాటిపైకి తీసుకురానున్నారు. వ్యవసాయానికి సంబంధించిన ఆగ్రో ఈవెంట్స్, ఆగ్రో జాబ్స్ లాంటివాటిని భవిష్యత్తులో ప్రారంభించనున్నారు. ఆగ్రోబుక్ ప్రారంభం నుంచే ఒక గ్లోబల్ ఫ్లాట్‌ఫాంగా అవతరించింది. నాలుగు నెలల్లోనే 1, 228 నగరాలు, 138 దేశాల్లో అగ్రోబుక్ సేవలు విస్తరించింది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని అన్ని ప్రాంతీయ భాషల్లోకి తీసుకురానున్నారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik