అరుదైన ఘనత సాధించిన విశాఖ మున్సిపాలిటీ

0

గ్రేటర్ విశాఖ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ టూ వీలర్స్ అందజేసింది. వీటిమీద శానిటరీ సూపర్ వైజర్లు సిటీ అంతా పెట్రోలింగ్ చేస్తూ చెత్త ఉన్న పరిసరాల క్లీనింగ్ కోసం అప్పటికప్పుడు ఆదేశాలిస్తుంటారు. పర్యావరణహితమైన మోటార్ సైకిళ్లను హైదరాబాదుకి చెందిన గాయం మోటార్స్ రూపొందించింది. ఏపీ సీం చంద్రబాబు చేతుల మీదుగా ఉద్యోగులకు పంపిణి చేశారు.

250 వాట్స్ కెపాసిటీ లిథియం బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు స్మార్ట్ పెడల్ సిస్టమ్ తో నడుస్తాయి. పెడల్ సహాయక వ్యవస్థ వివిధ స్థాయిల్లో బైక్ ని ముందుకి తోస్తుంది. ఒక్కసారి పెడల్ మీద కాలేసి తొక్కితే 80 శాతం ఎనర్జీని అదే తయారు చేసుకుంటుంది. అది కాకుండా కుడివైపు హాండిల్ పక్కన ఒక థ్రోటల్ ఉంటుంది. మనం పెడల్ మీద కాలు వేయకున్నా అది ఐదు సెకన్లలో సైకిల్ ని 0-25 KMPH వేగంతో తీసుకెళ్తుంది. ఒకవేళ బ్యాటరీ సాయం వద్దనుకుంటే నార్మల్ సైకిల్ లా కూడా వాడుకోవచ్చు.

విశాఖ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో జీవీఎంసీ వాడుతున్న ఈ సైకిళ్లు కూడా పర్యావరణహితానికి మరింత తోడ్పాటు అందిస్తాయనడంలో సందేహం లేదు.

Related Stories

Stories by team ys telugu