ఆటలతో పిల్లలకు చదువు చెప్పించే స్కిడోస్

చిన్నపిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగిoచడం అంటే ఆటలు కాదు. కానీ ఆటలతో నే చదువు నేర్పాలనుకున్నాడు ఆదిత్య ప్రకాష్. పాటలు, బొమ్మలు వంటి రొటీన్ పద్దతులు కాకుండా గేమ్స్‌తో పిల్లలకు ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు చదువు కూడా నేర్పాలనే ఉద్దేశంతో 2010 లో స్కిడోస్ కంపెనీని స్థాపించాడు.

0

స్కిడోస్‌ను ఆదిత్య ప్రకాష్ ISB లో త న బ్యాచ్‌మేట్ రాజ్‌దీప్‌సెథీతో కలిసి ప్రారంభించారు. ఆదిత్య ప్రకాష్ స్కిడోస్ కన్నా ము౦దు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) ను౦చి డిగ్రీ పొ౦దాక ఎయిర్టెల్ VAS, డివైసెస్‌లో కూడా పని చేసిన అనుభవ౦ ఉ౦ది. అ౦తే కాకు౦డా ఇ౦డియాలో ఐ-ఫోన్ లా౦చ్ చేసిన టీమ్‌ను లీడ్ చేసిన ఘనత కూడా ఆయన సొ౦తమే. దీని తరువాత HT మీడియాలో చేరి ఆక్కడ మొబైల్ VAS , ఇన్-స్టోర్ రేడియో స్పేస్ వ౦టి కొత్త వె౦చర్‌ను ప్రార౦భి౦చాడు. 

స్కిడోస్ టీమ్‌తో ఆదిత్య ప్రకాశ్
స్కిడోస్ టీమ్‌తో ఆదిత్య ప్రకాశ్

స్కిడోస్ అనే కంప్యూటర్ గేమ్‌ని ఎందుకు స్టార్ట్ చేసారో చెపుతూ, "చాలా స్కూల్స్‌లో ప్రైమరీ క్లాసులు చదివే పిల్లలు ఎక్కువగా కంప్యూటర్స్‌ను వాడారు. అందుకే కంప్యూటర్స్‌లో గేమ్స్‌తో నేర్పితే వారి విలువైన సమయాన్ని కంప్యూటర్స్ రూమ్స్‌లో గేమ్స్ ఆడుతూ నేర్చుకుంటారనేదే స్కిడోస్ ఉద్దేశమని అంటారు ఆయన.

“అందుకే ఈ సాఫ్ట్‌వేర్‌ని మొదట ప్రైమరీ క్లాస్ వారికోసం స్కూల్స్‌కి సేల్స్ చేసాము. కానీ పాఠశాలలకు అమ్మడమనేది చాలా కష్టమేకాక తక్కువ లాభాలతో ఎక్కువ టైమ్ పట్టేది. అందుకే మొబైల్ స్పేస్ ద్వారా ఈ సాఫ్ట్‌వేర్‌ని డైరెక్ట్‌గా యూసర్స్‌కి సేల్ చేయాలని నిర్ణయి౦చూకున్నాము" - ఆదిత్య ప్రకాశ్

ఈ గేమ్స్ చాలా డిఫరెంట్‌గా ఉండాలని, పిల్లల వయస్సు - వేర్వేరు సబ్జెక్టులను దృష్టిలో పెట్టుకొని 3 నుండి 12 ఏళ్ల్ల పిల్లలను ఆకర్షించే విధంగా 135 కు పైగా వెబ్ బేస్డ్ గేమ్స్‌ను రూపొందించారు.

స్కిడోస్ టీమ్ ముందుగా ఇందులోని సాధక బాధకాలు తెలుసుకొన్నారు. పిల్లలకు చూపించి వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని సరైన ఔట్‌పుట్‌ వచ్చే వరకూ మార్పులు చేసి గేమ్స్‌ను రూపొందించారు. గేమ్స్‌తో పాటు చదువుపై ఆసక్తి కలగాలంటే ఆటలు, చదువు రెండింటినీ బ్యాలెన్స్ చేసేట్టుగా మా విధానం ఉండాలని తెలుసుకున్నారు.

ప్రీ స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకి౦చిన మా రెండవ ప్రొడక్ట్ ఇంకా నిర్మాణ దశ లోనే ఉంది. ఈ గేమ్స్‌లో మరిన్ని ఆటలు, వాళ్లతో కనెక్టివిటీ ఉండి చిన్నపిల్లలను ఆకట్టుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబ్తున్నారు.

ఈ గేమ్స్‌ను ఉపయోగి౦ చే వారి స౦ఖ్య ఎక్కువ గానే ఉంది. వచ్చే నెలకు 30% కన్నా పైగా ఈ యాప్స్ యూజర్స్ పెరుగుతారని మా అంచనా. ఇండియాలో 5% యూజర్స్ ఈ యాప్‌ని వాడుతుంటే, USA , యురోప్‌లోనే ఎక్కువ మార్కెట్ ఉంది. మొత్తం మీద 10% యూజర్స్ రోజుకు దాదాపు 4 నిమిషాలు ఈ యాప్స్ కోసం స్పెండ్ చేస్తున్నారు.

Related Stories

Stories by bharathi paluri