సిలికాన్ వ్యాలీ టు స్టార్టప్ వయా నాసా. టెక్నాలజీలో కామాక్షికి తిరుగేలేదు

సిలికాన్ వ్యాలీ టు స్టార్టప్ వయా నాసా. టెక్నాలజీలో కామాక్షికి తిరుగేలేదు

Friday October 23, 2015,

4 min Read

అల్గారిథమ్స్ అల్పాహారం. లెక్కలతో స్నాక్స్.. డిన్నర్‌లో ఆల్ ఇన్ వన్ లు.. ఇదీ కామాక్షి శివరామకృష్ణన్ ఫుడ్ అండ్ స్టడీ మెను. ముంబైలో పుట్టి.. దక్షిణాది సంప్రదాయాల మధ్య పెరిగారామె. ఒకప్పుడు వందల మంది టెకీస్‌లో అమె కూడా ఒకరు. కానీ.. ఇప్పుడు వందల మందికి ఆమె ఒక్కరు.

​ముంబైలో చదివిన డిగ్రీకి.. స్టాన్‌ఫర్డ్‌లో చదివిన ఇన్ఫర్మేషన్ థియరీకి.. నాసా స్పేస్ షటిల్‌కు న్యూ హారిజన్ అందించడానికి.. గూగుల్‌లో ఆమె సాధించిన ఘనతకి ఏమాత్రం సంబంధం లేదు. ఆమె ఎక్కడున్నా.. ప్రత్యేకం. రూల్ బుక్‌కి భిన్నం. మనలో చాలా మంది ఆమెను చూసి ఆసూయ పడాల్సిందే. మీరివన్నీ ఎలా చేయగలరు అని ప్రశ్నిస్తే.. ఆమె నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. నాకెవరూ చేయొద్దని చెప్పలేదే అంటూ నవ్వేస్తారు.

image


​ఆడవాళ్లకు ఇంజనీరింగ్ ఏంటి ? పైగా పశ్చిమ దేశాలకు వెళితే పాడైపోతారనే భయం బలంగా ఉన్న రోజుల్లోనే ఆమె అమెరికా వెళ్లారు. అప్పటి కంటే.. ఇప్పుడు పరిస్థితి కాస్త బెటర్ అంటున్నారామె.

“ నా లాంటి వాళ్లు.. ఆర్థిక వేత్తలు కావాలనుకుంటారు. వాల్ స్ట్రీట్ లాంటి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ట్రేడింగ్ ద్వారా తిమ్మిని బమ్మి చేసే వాళ్లలా కావాలనుకుంటారు. కానీ.. నేను అలా ఉండాలనుకోలేదు. ఎంచుకున్న రంగంపై నా ప్రభావం చూపించాలనుకున్నాను '' అంటారు కామాక్షి.

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు ఎన్ని టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చినా ఆమె లైట్ తీసుకున్నారు. అందుకే ఆమె ఎంచుకున్న మార్గం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

​కామాక్షి శివరామకృష్ణన్ కెరీర్‌లో ఈ ఏడాది కొత్త అడుగులు పడుతున్నాయి. యాడ్ మాబ్‌ అనే స్టార్టప్ ఐడియాతో ముందుకొచ్చారు. ఐడియా ఆఫ్ మెషీన్ లెర్నింగ్ స్టాక్‌లో లీడ్ సైంటిస్ట్‌గా కొత్త కెరీర్ స్టార్ట్‌ చేశారు. ఇదో ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ. యూజర్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడమే వీళ్ల పని. యాడ్స్ క్రియేట్ చేయడం.. వాటిపై యూజర్స్ అభిప్రాయాలు తెలుసుకోవడానికి స్టాటిస్టిక్స్, అల్గారిథంతో ప్రోగ్రాంని క్రియేట్ చేయడం.. ఇదీ తన పని. ఓ క్లిక్, ఓ చాట్‌తో యూజర్స్ అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇదంతా ఓ పెద్ద ప్రహసనం. కొత్త టెక్నాలజీతో ఓ ప్రయత్నం చేయడం.. అది ఎలా పనిచేస్తుందో చెక్ చేసుకోవడం.. మళ్లీ మరో ప్రయత్నం.. పాతదానితో సరిపోల్చడం.. ఇలా ఓ చైన్ నడుస్తుంది. అది కూడా బేసిక్ ప్రిన్సిపల్స్‌కి అనుగుణంగా.

​యాడ్ మాబ్‌లోకి కామాక్షిని తీసుకోవడానికి కారణం ఏంటి ? అంటే ఒక్కటే. ఆమె దానికి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. గూగుల్, యాపిల్‌కి భిన్నంగా వర్కింగ్ స్టైల్ ప్రవేశపెట్టారు. అయితే.. ఓ మహిళ అనే అంశం ఆమె ఎదుగుదలకి ఎక్కడా అడ్డంకి కాలేదు. సహజంగా ఆమెలో ఉన్న వ్యాపారాత్మక గుణం, ప్రభావం చూపగల ప్రతిభ వరంలా మారాయి. టీంని లీడ్ చేయడం, బిజినెస్ ఎన్వైర్‌మెంట్, సామాజిక అంశాలు కూడా మగవాళ్లకే అనుకూలంగా ఉంటాయి. అలాంటి క్వాలిటీలు కూడా తలపండిన పురుషులకే ఎక్కువగా ఉంటాయి. కానీ.. అలాంటి వారిని ఎందరినో పక్కకునెట్టి.. ఓ స్టార్టప్ కంపెనీని ఆమె ఎట్రాక్ట్ చేశారంటే ఆమెలో ఏదో స్పెషాలిటీ ఉన్నట్టే.

image


ప్లూటోతో అనుబంధం

ఆమె పీహెచ్‌డీ చేస్తుండగా.. న్యూ హారిజన్స్ అనే కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు కామాక్షి. సూర్య గ్రహానికి సుదూర ప్రాంతాన ఉన్న ప్లూటోపైకి నాసా పంపబోతున్న స్పేస్ మిషన్‌లో దీన్ని వినియోగించనున్నారు. నాసా తయారు చేసిన స్పేస్ క్రాఫ్టుల్లో ఇదే అత్యంత ఖరీదైంది. ఇంతకీ ఈ న్యూ హారిజన్స్ ఏం చేస్తాయంటే.. స్పేస్ క్రాఫ్ట్ నుంచి ప్లూటో గ్రహ ఉపరితలం మీదకు రేడియో సిగ్నల్స్‌ని పంపుతాయి. అవి అక్కడి పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేసి.. తిరిగి స్పేస్ క్రాఫ్ట్‌కి అందజేస్తుంది. అందులో ఉన్న చిప్.. ఆ సిగ్నల్స్‌ని కలెక్ట్ చేసి మూడు బిలియన్ మైళ్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్‌కి అందిస్తుంది. దీనికి అత్యంత తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. నాసా లాంటి సంస్థలో.. ప్లూటో గ్రహం మీద జరుగుతున్న పరిశోధనల్లో ఆమె డిజైన్ చేసి చిప్‌ని వాడుతున్నారంటే అది మాటలు కాదు.

image


​​బిజినెస్ ఉమెన్ .. బై చాన్స్..

కామాక్షి…వారసత్వంగా వ్యాపారంలోకి రాలేదు. కానీ కాకలు తీరిన బిజినెస్ ఉమెన్‌గా మారారు. లిమిటెడ్ మనీ, టైమ్, వనరులు, సమస్యలని డీల్ చేయడం అనే అంశాలు ఆమెను వ్యాపారవేత్తగా మార్చాయి. కొత్త టెక్నాలజీ డ్రా బ్రిడ్జ్ అనే కంపెనీని స్థాపించేలా చేశాయి. అమెరికాలో మహిళల సారధ్యంలో నడుస్తున్న ఫాస్ట్ గ్రోయింగ్ - ఇంక్ ఫైవ్ థౌజండ్ కంపెనీల్లో డ్రా బ్రిడ్జ్ కూడా ఒకటి. ఐదేళ్ల వయసున్న ఈ కంపెనీ వార్షికాదాయం 23,000 శాతం పెరిగింది. 2014లో ఆమెకు 33 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

ఆన్ లైన్ యాడ్స్‌తో యూజర్స్ ఎలా కాంటాక్ట్ అవుతారు ? స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్, లాప్ టాప్స్‌లో ఎలా ఉంటుందనే విషయం మీద కొత్త ప్రోగ్రాంని డిజైన్ చేస్తున్నారామె. ఒక యూజర్.. మొబైల్‌లో యాడ్ చూసి.. అదే వస్తువును ఏ ల్యాప్‌టాప్‌లోనో.. టాబ్లెట్‌లోనో కొనుగోలు చేస్తే.. డ్రా బ్రిడ్జ్ దాన్ని గుర్తిస్తుంది. ఇలా వినియోగదారుల డేటా తయారు చేస్తుంది. వారి అవసరాలు.. టేస్టులు మాత్రం బయటపెట్టినా.. యూజర్స్ వివరాలను మాత్రం గోప్యంగానే ఉంచుతుంది.

​​ఇంజనీరింగ్, టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో మహిళా రోల్ మోడల్స్.. పెద్దగా లేరు. కానీ.. కామాక్షితోపాటు కెరీర్ స్టార్ట్ చేసిన వారు.. చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ అందరిలోకీ.. ఆమె భిన్నంగా ఉన్నారు. ఒక్కసారి బోర్డ్ రూమ్ లోకి వెళితే.. అందరి కళ్లూ మననే చూస్తుంటాయి. మనం కరెక్ట్‌గా చేస్తే సక్సెస్.. లేకపోతే ఫెయిల్. ఆ టైంకి ఎదుటివారి మనసు గెలవాలి.. అది ఆడైనా.. మగైనా అంటారామె. యువతరానికి ఆమె ఇచ్చే సలహా ఒక్కటే. '' బి.. కంఫర్టబుల్ విత్ అన్ కంఫర్టబుల్. రిస్క్ చేయలేకపోతే ఆంట్రప్రెన్యూర్ కావాలని ఆశించొద్దు ''.

​ఇంత క్లారిటీ.. కాన్ఫిడెంట్ ఉంటే.. ప్లూటో వరకే కాదు.. అంతకంటే సుదూరానికి కూడా వెళ్లగలదు ఈ కామాక్షి అనే ధృవతార. మీరేమంటారు.. ? ఈ కథనం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం కాదంటారా ? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.