హైదరాబాదులో వ్యాపారానికి 'ఫేస్ బుక్' బూస్టింగ్

హైదరాబాదులో వ్యాపారానికి 'ఫేస్ బుక్' బూస్టింగ్

Friday December 18, 2015,

2 min Read

మీకు వ్యాపారం ఉందా? వెబ్ సైట్ ఉందా? లేకపోయినా ఫర్వాలేదంటోంది ఫేస్ బుక్. ఎఫ్ బీ పేజీ పెట్టుకొని మీ వ్యాపారానికి బూస్టింగ్ ఇచ్చుకోమని సలహా ఇస్తున్నారు. దీనిపై పూర్తి అవగాహన కల్పించేందుకు టీ హబ్ వేదికగా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది ఫేస్ బుక్ హైదరాబాద్. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దేశంలో ఎన్నో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని వీటికి ఆన్ లైన్ కస్టమర్లను వెతికి పెట్టే బాధ్యతను తాము తీసుకుంటామని ఫేస్ బుక్ బరోసా ఇస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్, సెక్రటరీ ప్రియరంజన్ పాల్గొన్నారు.

image


స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీ

తెలంగాణ రాష్ట్రానికి స్టార్టప్ ఇన్నో వేషన్ పాలసీ తీసుకొస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఫేస్ బుక్ తీసుకున్న ఇనిషియేషన్ ను కొనియాడిన కెటిఆర్ హైదరాబాద్ స్టార్టప్ క్యాపిటల్ కానుందని అభిప్రాయపడ్డారు.

“విమన్ ఆంట్రప్రెన్యుర్ షిప్ ను ప్రోత్సహించడంలో టీ ప్రభుత్వం ముందుంది.” కెటిఆర్

అమ్మాయిలు వ్యాపారం చేయడానికి ముందుకొస్తే వారికి ఆర్థిక సాయంతో పాటు కెరియర్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకు రానుందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వాటిని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫేస్ బుక్ ఇలా ముందుకొచ్చి వ్యాపారానికి సాయం చేయడం గొప్ప విషయం. దీన్ని అంతా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

image


తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీ

తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీని అడ్వాంటేజీలను మూడు పాయింట్లలో కేటీఆర్ చెప్పారు.

  1. ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించిన అన్ని అనుమతలు 15రోజుల్లో పూర్తి చేస్తారు. అలా కానీ పక్షంలో 15రోజుల తర్వాత కంపెనీ దానంతట అదే అప్రూవల్ అయిపోతుంది. 16రోజునుంచి ఆ కంపెనీకి క్లియరెన్స్ ఇవ్వని ఆఫీసర్ కానీ మరే వ్యక్తి కానీ బాధ్యుడిగా తేలితే చర్యలు తీసుకుంటారు.
  2. వెయికోట్ల టర్నోవర్ దాటిని ఏదైనా కంపెనీ , మరో చిన్న కంపెనీలో ఇన్వస్ట్ మెంట్ చేయాలనుకుంటే తమ దగ్గర లిస్టవుట్ చేసిన స్టార్టప్ లను అందిస్తామని అన్నారు. అలాంటి కంపెనీలకు ప్రభుత్వం తరుపును ప్రత్యేక రాయితీలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
  3. విదేశాల నుంచి ఎవరైనా వచ్చి హైదరాబాద్ లో సంస్థను మొదలు పెట్టాలనుకుంటే, ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే వారు వచ్చే రోజు తెలంగాణ ప్రభుత్వం తరుపు నుంచి అధికారులు వారికోసం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి నేరుగా సిఎంఓ ఆఫీసుకు తీసుకొస్తారు. అక్కడ అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆ సంస్థ ప్రారంభానికి అన్ని విధాలా సాయం చేస్తారు.

ప్రధానంగా కొన్నింటిని గురించే చెప్పిన కేటీఆర్ ఇలాంటి పాలసీలు చాలా ఉన్నాయనన్నారు.

ఆసక్తి కనపడిచిన మహిళా వ్యాపారవేత్తలు

వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న ఔత్సాహిక మహిళలతోపాటు ఇప్పటికే సంస్థలు నెలకొల్పిన నారీమణులు చాలా మంది ఈ ఈవెంట్ లో జరిగిన చర్చపై ఆసక్తి కనపరిచారు. ఫేస్ బుక్ పేజీ తో వ్యాపారాన్ని ఎలా బూస్టింగ్ చేయొచ్చనే దాన్ని తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అన్ని తరహా స్టార్టప్ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఫేస్ బుక్ వారు ఇచ్చిన కొన్ని ట్రిక్స్ తమ వ్యాపారా వ్యాప్తికి సహకారం ఇస్తుందనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు వారంతా.

image


ఇంట్రాక్షన్ సెషన్ లో ప్రశ్నల వర్షం

మహిళా ఔత్సాహిక వ్యాపార వేత్తలతో ప్రశ్నోత్తరాలను నిర్వహించారు మంత్రి కేటీఆర్. వ్యాపారానికి సంబంధించి, ప్రభుత్వ పాలసీలు, ప్రోత్సాహకాలను తెలుసుకోడానికి మహిళలు ఎంతో ఆసక్తి కనపరిచారు. ఇదే విషయాలపై కేటీయార్ ను పలు ప్రశ్నలు అడిగారు. భారత దేశానికి స్టార్టప్ క్యాపిటల్ కాడానికి హైదారబాద్ కి ఉన్న అవకాశాలను కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక్కడున్న కాస్టాఫ్ లివింగ్ స్టార్టప్ కంపెనీలు ప్రారంభించడానికి అత్యంత అనుకూల విషయంగా కెటిఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా డౌట్ ఉంటే ప్రియరంజన్ తో ఫేస్ బుక్ లో టచ్ లో ఉండాలని అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతారని ముగించారు