నిధుల సమీకరణ వ్యాపారంలో ఒక భాగం.. అదే విజయం కాదు

నిధుల సమీకరణ వ్యాపారంలో ఒక భాగం.. అదే విజయం కాదు

Sunday November 01, 2015,

3 min Read

“నువ్వు ఓ ఆంట్రప్రెన్యూర్ అయినపుడు.. తప్పు, ఒప్పులు అంటూ ఏమీ ఉండవు. గత 15 ఏళ్లుగా ఈ -కామర్స్ రంగాన్ని పరిశీలించి, అనుభవంతో చెబ్తున్న మాటలివి” అన్నారు కె.వైదీశ్వరన్. టెక్‌‌స్పార్క్స్ 2015 సదస్సులో ఆయన చెప్పిన ఉత్తేజకరమైన మాటలివి.

image


ఎవరైనా వ్యక్తి ఫెయిల్ కావడంలో ఎక్స్‌పర్ట్‌ అనిపించవచ్చు. కానీ అతను అలాంటివాడు కాకపోయే అవకాశమే ఎక్కువ. “సక్సెస్ సాధించిన వాటికంటే.. ఫెయిల్యూర్ల నుంచే ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చన్నారు వైదీశ్వరన్. ముందుగా అనుకోని బాటలో నడిచేటపుడు చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందన్నది ఆయన భావన.

విజయం ఓ అదృష్టం. కానీ అపజయం ఆత్మబంధువు

“పేకాట ఆడుతున్నాం అనుకోండి. అందరికీ ఆటీన్ రాణి అవసరం ఉండొచ్చు. కానీ మొత్తం పేక సెట్‌‌లో ఆ కార్డ్ ఒకటే ఉంటుంది. అది ఎవరికి వస్తే వారే గెలుస్తారు”అంటున్నారు వైదీశ్వరన్.

అలాగని మిగతావారు సరిగా ఆడలేదు కాబట్టే ఓడిపోయారని అనలేం కదా. ఇప్పుడు ప్రారంభమవుతున్న కంపెనీల్లో 95శాతం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోతున్నాయి. అయితే.. ఆంట్రప్రెన్యూర్స్ మాత్రం 100శాతం సక్సెస్ సాధిస్తున్నారని వైదీశ్వరన్ అన్నారు.

“ఓ సంస్థ సాధించే ఫలితాలు ఆంట్రప్రెన్యూర్‌షిప్‌‌పై ఆధారపడి ఉండవం”టూ తన ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చారు. పలు సంఘటనలు, ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా.. వెంచర్ ఫలితాలు వెలువడతాయి. ఆంట్రప్రెన్యూర్ చేతిలో ఉండేది.. స్టార్టప్‌ని ప్రారంభించడమే. ఇలా స్టార్ట్ చేయగలగడమే సక్సెస్ సాధించడం అంటారు వైదీశ్వరన్.

ఆంట్రప్రెన్యూర్ కావాలంటే ?

ప్రజలు, పెట్టుబడి, ఆలోచనలే ముఖ్యం. ఓ స్టార్టప్ ఏర్పాటు చేయడానికి ధైర్యంతోపాటు.. కాస్త వెర్రి కూడా ఉండాలంటున్నారు వైదీశ్వరన్. ఓ అనంతమైన, ప్రమాదమైన సముద్రంలోకి కేవలం ఒకే పెడల్ ఉన్న పడవతో ప్రయాణించడం లాంటిదే ఆంట్రప్రెన్యూర్‌షిప్. తర్వాతేం జరుగుతోందో చెప్పడం ఎవరివల్లా సాధ్యమయ్యే పని కాదు. మధ్యలో ఏదైనా సుడిగుండంలో చిక్కుకుపోవచ్చు.. అవతలి ఒడ్డుకు చేరచ్చు.. లేదా ఎవరైనా వచ్చి కాపాడచ్చు.

ఓ వినూత్నమైన విభిన్నమైన ఆలోచన ఉంటేనే ఆంట్రప్రెన్యూర్ అంటూ చాలా మంది చెప్పే మాటను కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. “ గొప్ప విప్లవాత్మక ఆలోచనలు అన్నీ ఇప్పటికే చేసేశారు. రాబోయేవాటితో సహా.. మహా గొప్ప ఆలోచనతో అభివృద్ధి చెందబోయే కంపెనీ ఒకటి కూడా లేదని నేను విశ్వసిస్తాను” అన్నారు వైదీశ్వరన్. ప్రస్తుతం ఉన్న, నిర్వహిస్తున్న వ్యాపారాల్లోనో విధానాల్లోనే మార్పులుతో ముందుకురావడం తప్ప.. కొత్త వ్యాపారం సృష్టించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు.

ఏ వ్యాపారం అయినా మూడు అంశాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని వైదీశ్వరన్ చెబ్తున్నారు.

  • 1. చేపట్టబోయే విధానం చౌకగా, వేగంగా, ఉన్నతంగా ఉండాలి.
  • 2. ఒకవేళ ఫెయిల్యూర్ తప్పకపోతే అది వేగంగా ఉండాలి. తొందరలోనే అపజయం తప్పదని ముందే తెలిస్తే దానిని అసలు ప్రారంభించద్దు. ఏం చేయాలనే అంశంపై ఎక్కువగా ఆలోచించాలి. పట్టుదల ఉండాలి.
  • 3. ఏ వ్యాపారమైనా డబ్బు సంపాదన కోసమే. కాకపోతే అది హాబీ అయి ఉండాలి.

“ హాబీలు చాలా మంచి చేస్తాయి. కొంతమంది పుస్తకాలు చదువుతారు. సినిమాలు చూడడం, ప్రయాణాలు, ఆటలతోపాటే.. ఈ-కామర్స్ కంపెనీలు ప్రారంభించడం కూడా ”అంటూ నవ్వేశారు వైదీశ్వరన్. 

బిజినెస్ ప్లాన్లు తయారు చేయడం విపరీతంగా బోర్ కొట్టే ప్రణాళికలతోవ్యాపారం ప్రారంభం అవుతుంది. దీన్ని ఎంత వివరంగా వీలైతే అంత డీటైల్డ్‌‌గా తయారు చేసుకోవాలి. మూడింట రెండొంతుల సమయం కేటాయించాలి. అలాగే అమ్మకాలను 3తో భాగించండి. మార్జిన్లను సగమే లెక్కించండి. ఖర్చులను రెట్టింపుగా వేసుకోండి అంటన్నారు వైదీశ్వరన్.

వ్యాపారంలో నిధుల సేకరణ ఒక భాగం మాత్రమే. అది విజయానికో, సాధించిన ఫలితానికో సంకేతం కాదు అని చెబ్తున్న వైదీశ్వరన్.. చాలామంది ఆంట్రప్రెన్యూర్లు వ్యాపార నిర్వహణ నిధుల సమీకరణ కోసమే అనుకుంటూ ఉంటారని అన్నారు. వ్యాపారం చేసేది డబ్బు సంపాదించడానికే.. నిధుల సమీకరించడానికి కాదంటూ వివరించారాయన.

అభివృద్ది సాధించడం కోసం నిధులు సమీకరించాలి. అదే పనిగా నిధులవేట కొనసాగిస్తున్నారంటే.. వనరులను సరిగా నిర్వహించడం తెలియనట్లే అని తేల్చేశారు వైదీశ్వరన్.

కంపెనీకి నిధులు మాత్రమే అందించే ఇన్వెస్టర్ కోసం ప్రయత్నించాలి. చాలామంది ఆంట్రప్రెన్యూర్లు చేసే తప్పు ఏంటంటే.. నిధులు అందించడంతోపాటు తమ కంపెనీకి విలువ పెంచే ఇన్వెస్టర్ల కోసం చూస్తుంటారు. “ఒకవేళ ఆ ఇన్వెస్టర్ నీ వ్యాపారం గురించి అంత తెలివైనవాడే అయి, నిధులు చేతిలో ఉన్నపుడు తనే వ్యాపారం నిర్వహించేవాడు” అన్నారు వైదీశ్వరన్.

కుటుంబంతో సంతోషంగా ఉండాల్సిందే

ఆంట్రప్రెన్యూర్స్ అందరికీ కష్టకాలం ఎపుడో అపుడు వస్తుంది. పరిస్థితులు కష్టంగా మారవచ్చు. ఆ సమయంలో అండగా ఉండి, మద్దతునిచ్చేది కుటుంబం మాత్రమే అన్నారు వైదీశ్వరన్.

ఆంట్రప్రెన్యూర్‌షిప్ జీవితాన్ని లాగేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. కంటికి కనిపించే అందం, ఆకర్షణతోపాటే అంతకుమించిన చీకటి కూడా దాగి ఉంటుంది. ఒకవేళ మొత్తం పోగొట్టుకునే సమయం వస్తే.. అప్పుడు ఎటువంటి కండిషన్స్ లేకుండా స్వాగతం పలికే సహృదయం కుటుంబానికే ఉంటుంది. ఎంతో ఎత్తు నుంచి దిగజారినా.. మద్దతునిచ్చేది కుటుంబం మాత్రమే అని చెప్పి ముగించారు వైదీశ్వరన్.