హైదరాబాద్‌లో మొదటి సోలార్ పవర్ అపార్ట్‌మెంట్

0


ఇప్పుడంతా సోలార్ శకం నడుస్తోంది. సోలార్ ఎనర్జీపై జనానికి సైతం అవగాహన బాగా పెరిగింది. ఇదే విషయం బిల్డర్ చైతన్య రాయపుడిని ఆలోచింపజేసింది. దీంతో దేశంలోనే మొదటి ఎకో ఫ్రెండ్లీ మోడల్ అపార్ట్‌మెంట్‌ను జనం ముందుకు తీసుకొచ్చేలా చేసింది. ఈ అపార్ట్‌మెంట్ చూడటానికి విరివిగా జనం కూడా ఎగబడుతున్నారు. అసలా అపార్ట్‌మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఈ కధ చదవాల్సిందే.

సోలార్ ప్రాజెక్ట్ అపార్ట్‌మెంట్
సోలార్ ప్రాజెక్ట్ అపార్ట్‌మెంట్

కొండాపూర్‌లోని ప్రైడ్ సుప్రా హోమ్స్ పేరుతో 400 చ. గజాల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్స్ దేశంలోనే మొదటి సోలరైజ్డ్ అపార్ట్‌మెంట్. 2012లో కనస్ట్రక్షన్ పూర్తయింది. అయితే అందులోని చివరి ఫ్లాట్ టెనెంట్... కిందటి నెలలోనే జాయిన్ అయ్యారు. రెండేళ్లుగా ఎలాంటి ఇబ్బంది రాలేదు. పూర్తి స్థాయిలో సోలార్ పవర్‌తో అపార్ట్‌మెంట్ అవసరాలు తీరుతున్నాయి. సోలార్ పవర్ నైపుణ్యం ఏంటనేది ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది.

“దేశ వ్యాప్తంగా దాదాపు 6 నెలలు, 500 కనస్ట్రక్షన్స్ చూసిన తర్వాత మాకు పోలిన అపార్ట్ మెంట్ కట్టిన వారిలో మేమే ఫస్ట్ అని గర్వంగా చెబుతున్నా. 12కిలోవాట్ సోలార్ రూఫ్ ఇన్‌స్టాలేషన్ చేశాం. 8 ఫ్లాట్స్, 200లైట్స్, 40ఫ్యాన్స్, 8 టీవీలు కంప్యూటర్లకు కావల్సిన పవర్ బిల్డింగ్‌పై ఉన్న సోలార్ రూఫ్ నుంచే అందుతోంది ” అని చైతన్య రాయపుడి అన్నారు.

ప్రాజక్టుతో ఫౌండర్ చైతన్య
ప్రాజక్టుతో ఫౌండర్ చైతన్య

హీటింగ్, కూలింగ్‌తోపాటు అపార్ట్‌మెంట్‌కు కావల్సిన హాట్ వాటర్ లాంటి వాటికోసం చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది. వీటన్నింటికీ పరిష్కారం ప్రైడ్ సుప్ర అంటారాయన. ఎలాంటి వర్రీస్ లేకుండా మంచి లైఫ్‌స్టైల్ అలవరుచుకోవాలనుకునే వారికోసం ఈ స్టార్టప్ పనిచేస్తుంది. పవర్ కోసం నెలకు ఖర్చు 180నుంచి 225రూపాయిలకు మించదు. దీని ద్వారా పర్యావరణానికి కూడా సాయం చేసినట్లవుతుంది. అదే విధంగా మనకి మనం సాయం చేసుకోవడం సాధ్యపడుతుంది. ఇదే మోటోతో మా స్టార్టప్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రాజెక్ట్ ఎలా సాధ్యమైంది ?

నేను సాధారణ బిల్డర్ కావాలని అనుకోలేదు. ఏదో సంపాదించుకోవాలనీ ఇందులోకి రాలేదు. నాకు సొంతంగా ఐటి స్టాఫింగ్ కంపెనీ ఉంది అంటున్నారు చైతన్య రాయపుడి. అందరి ఐటి ఉద్యోగుల్లాగానే లోన్‌లో ఓ ఫ్లాట్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలనుకోలేదు చైతన్య. తను డిఫరెంట్‌గా ఆలోచించడం వల్లే హైదరాబాద్‌లో ఫుల్లీ సోలరైజ్డ్ అపార్ట్‌మెంట్‌ను మనం చూడగలిగాం. 2012 లో తనకు 27ఏళ్లు ఉండగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. చాలా కంపెనీలను కలిసారు. అపార్ట్‌మెంట్ మొత్తాన్ని సోలార్ పవర్‌తో నింపడం అంత అమాయకపు పని మరొకటి లేదని అంతా నీరుగార్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ఐడియా విరమించుకోమని ఉచిత సలహా ఇచ్చారట. ఎంతోమందితో సంప్రదింపులు జరిపినా ఎవరూ ఓకే అని అనలేదు. చివరాఖరికి బెంగళూరుకు చెందిని సోలార్ సప్లై కంపెనీ ఒక హోప్‌ని కలిగించింది. చాలా కష్టం తర్వాత ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఈ రూపుదాల్చిందని చైతన్య చెబ్తారు.

సౌర విద్యుత్తు ఖర్చుతో కూడుకున్నదా ? అపార్ట్‌మెంట్‌కు సోలార్ పెట్టించాలంటే ఫ్లాట్ రేటులో సగం డబ్బులు ఖర్చుపెట్టాలా ? అనే ప్రశ్నలకూ చైతన్య సమాధానాలిచ్చారు. ఒక అపార్ట్‌మెంట్ పైన మొత్తం 52 సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేయాలి. ఐదేళ్లకు ఒకసారి బ్యాటరీ మార్చాల్సిన అవసరం ఉంది. ఇతర ఖర్చులు పోనూ ఒక ఫ్లాట్‌కు అదనగంా అయ్యే ఖర్చు 2.75లక్షలు మాత్రమే. అయితే ఇది వన్ టైం ఇన్వెస్ట్‌మెంట్. ప్రతీ ఏడాది సాధారణ మెంటెనెన్స్ ఖర్చుంటుంది. సోలార్ పవర్ లిఫ్ట్ దీనిలో యాడ్ చేస్తాం కనుక లిఫ్ట్ మెయింటెనెన్స్ చార్జీలు దీనిలోనే కలపొచ్చు. ఇవన్ని సాధ్యం చేయడానికే మా ప్రాజెక్ట్ ప్రారంభించాం. భవిష్యత్తులో మా ప్రాజెక్టుకు డీజిల్ జనరేటర్ కూడా అవసరం ఉండకపోవచ్చని అంటారు.

భవిష్యత్ అంతా సోలార్ తరమే. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సుప్రా బిల్డర్ ఈ తరహా ప్రాజక్టుకు అంకురార్పణ చేయడం ఆనందించదగిన విషయం. ఎకో ఫ్రెండ్లీతో మన సమాజాన్ని, ప్రపంచాన్ని, భూమాతను మనం రక్షించికోవాల్సిన అసరం అందరిపైనా ఉంది అని చైతన్య ముగించారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik