ఫోన్ కొట్టు..యాప్ పట్టు..! చిటికెలో తయారుచేసి ఇస్తామంటున్న స్టార్టప్!!

Friday February 19, 2016,

4 min Read

ప్రపంచమంతా డిజిటల్ వరల్డ్ వైపు వెళ్తోంది. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్, అందులోని యాప్ ఉంటేచాలు. డేటింగ్ నుంచి డైటింగ్ వరకు. మూవీ టికెట్స్ నుంచి విమాన టికెట్ల వరకు. వంట చేయాలన్నా , బ్యాంక్ లావాదేవీలు నడపాలన్నా.. దేనికైనా ఇప్పుడు యాప్ ఉండాల్సిందే. ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోవాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో యాప్స్ కావాల్సిందే. అలాంటి యాప్స్ అనుకున్న వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చుగానీ, అనుకున్న యాప్ చిటికెలో కావాలంటే సాధ్యమేనా? అలా కావాలంటే ఎవరిని సంప్రదించాలి? అంటే ఈ ప్రశ్నకు మేమున్నాం అని సమాధానం చెప్తోంది పూణెకు చెందిన ప్లోబల్ యాప్స్. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో పెట్టుకోవాలంటే తమ యాప్స్ ఉపయోగించండి అంటోంది ప్లోబల్ యాప్స్. 

ఒక దశాబ్దం క్రితం ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు ఒక మంచి స్థలం కోసం అన్వేషించేవారు. ఆ తర్వాత ఒక్కొక్కటీ అమర్చుకుని బిజినెస్ నడిపేవారు. ఆన్ లైన్ లో ఫెసిలిటీ వుంటే దాన్ని అదనపు అర్హతగా భావించేవారు. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్- ఈ కామర్స్ విజృంభింందో వ్యాపారం రూపురేఖలే మారిపోయాయి. ఈ రోజుల్లో ఏ వ్యాపారం చేయాలన్నా దానికి వెబ్ సైట్ ఉండాల్సిందే. వర్చువల్ ప్రెజెన్స్ కు ప్రాధాన్యత పెరిగింది. ఆఫీసంటూ ఒకటి లేకపోయినా ఫర్వాలేదు అనుకునే రోజులివి. అయితే స్మార్ట్ ఫోన్లు, యాప్స్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. యాప్స్ తోనే కంపెనీ క్రెడిబిలిటీని లెక్కగడుతున్నారు.

స్టార్టప్ ల నుంచి బడా కంపెనీల వరకు మొబైల్స్ లో తమ ఉనికిని చాటాలనుకుంటున్నాయి. అయితే చాలా స్టార్టప్ లు సొంతంగా మొబైల్ యాప్స్ తయారు చేసుకోలేకపోతున్నాయి. అలాంటి వారికి వరంలా దొరికింది పుణెకు చెందిన ప్లోబల్ యాప్స్ సంస్థ. రెండేళ్లక్రితం స్థాపించిన ఈ స్టార్టప్ ఇప్పటివరకు వెయ్యికి పైగా మొబైల్ యాప్స్ తయారుచేసింది. సంప్రదాయ వ్యాపారాలకు ఆన్ లైన్ హంగులు జోడించి పరుగులెత్తిస్తోంది. తక్కువ ఖర్చులోనే యాప్స్ రూపొందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది . 

undefined

undefined


ప్లోబల్ యాప్స్ ప్రస్థానం 

అతుల్ పోహార్కర్, అలియాసాగర్ మోతివాలా, అభిషేక్ జైన్ అనే ముగ్గురు కుర్రాళ్లు కలిసి ప్లోబల్ యాప్స్ స్థాపించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి బడా కంపెనీల వరకు అన్నింటికీ అవసరమైన సమగ్ర మొబైల్ బిజినెస్ సొల్యూషన్స్ చూపించడం, వాటికి అవసరమైన యాప్స్ తయారుచేసి ఇవ్వడమే ప్లోబల్ యాప్స్ బిజినెస్. సంప్రదాయ, ఆధునిక వ్యాపారాలకు అవసరమైన మొబైల్ యాప్స్ ను తయారుచేసి ఇవ్వడమే కంపెనీ లక్ష్యం. వీరు తయారుచేసిన యాప్ ను తీసుకుని, పదంటే పది నిమిషాల్లో ఆయా కంపెనీలు తమకు అవసరమైనట్లు రీ డిజైన్ చేసుకుని వాడుకోవచ్చు.

అతుల్ పోహార్కర్ ప్లోబల్ యాప్స్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతను ప్రాడక్ట్ డెవలప్మెంట్, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇక్రావ్ ఇన్ సంస్థకు ఈసీఓగా చేసిన అనుభవం ఉంది అతడికి. సీటీఓ అభిషేక్. అతను నోవా ఆర్క్ సీఈఓగా గతంలో పనిచేశారు. అలియా సాగర్ కంపెనీ పార్ట్ నర్ షిప్, సేల్స్ చూసుకుంటారు. అతనికి డిజిటల్ పబ్లిషింగ్, అడ్వర్టయిజింగ్, సాస్ ప్రాడక్ట్స్ తయారీ, ఐటీ సేల్స్ లో అనుభవముంది. ఎమ్మెన్సీ కంపెనీలో విదేశాల్లో పనిచేశారు కూడా.

undefined

undefined


మీ అంతట మీరే చేసుకోండి (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పద్ధతిలోనే యాప్స్ తయారు చేస్తోంది ప్లోబల్ యాప్స్ . హాస్పిటాలిటీ, లైఫ్ స్టైల్, ఈ-కామర్స్ వ్యాపారాల కోసం ఎక్కువగా యాప్స్ రూపొందించి ఇస్తోంది. ఈ కంపెనీలో మొత్తం 30 మంది ఉద్యోగులు ఫుల్ టైం పని చేస్తున్నారు. 500 క్లైంట్స్ కు వెయ్యి యాప్స్ తయారు చేసిచ్చింది ప్లోబల్ యాప్స్. యాప్స్ ను ఉపయోగించుకుని మొబైల్ కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యం.

తమ కస్టమర్లు జస్ట్ పది నిమిషాల్లో యాప్ తయారుచేసుకునేలా చేస్తోంది ప్లోబల్ యాప్స్. కావాల్సిన ఫీచర్స్ ఎంచుకోవడం, అవసరమైన కంటెంట్ అప్ లోడ్ చేయడం, యాప్ టెస్ట్ చేయడం, చివరికి ప్లే చేసి పబ్లిష్ చేయడం అంతే. కంపెనీ అవసరాలకు తగ్గట్లు యాప్ రెడీ అయిపోతుంది.

 చిన్న మధ్యతరహా కంపెనీలకు యాప్స్ తయారుచేసుకునేలా చేయడమేకాదు. అత్యంత తేలికగా, వేగంగా యాప్ రూపొందించుకునేలా చేస్తాం. మా క్లైంట్స్ నేటివ్ యాప్స్ తయారుచేసుకునేలా ప్రోత్సహిస్తాం-అతుల్  

యాప్ రూపొందించడానికి, దాన్ని యాండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే) రూపంలో ఇవ్వడానికి కొంత మొత్తం ఛార్జ్ చేస్తోంది ప్లోబల్ యాప్స్ కంపెనీ. డైరెక్ట్ బీటూబీ మాడలే కాకుండా రీసెల్లర్ ప్రోగ్రాం కూడా ఉంది. యాడ్ ఏజెన్సీలు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ఏజెన్సీలు, వెబ్ సైట్ అండ్ మొబైల్ డెవలప్ మెంట్ కంపెనీలకు సాయం చేస్తుంది. నేటివ్ యాప్స్, ఐఫోన్ యాప్స్ తయారీకి సహకరిస్తుంది. డీఐవై వెబ్ సైట్స్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న షోఫిఫై డాట్ కాం కు కూడా ప్లోబల్ కంపెనీ యాప్స్ అందిస్తోంది.

2017 చివరి నాటికి వెయ్యి కంపెనీలు, 400 రీసెల్లర్స్ కు యాప్స్ విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ స్టార్టప్ ను మరింత బలోపేతం చేసేందుకు ఫండ్స్ సేకరిస్తోంది. యువ ఇంజనీర్లను నియమించుకునేందుకు క్యాంపస్ లను సైతం విజిట్ చేస్తోంది. హాస్పిటాలిటీ, లైఫ్ స్టైల్, స్పా, రియల్ ఎస్టేట్, బాండ్స్ రంగాల్లో యాప్స్ తయారుచేస్తున్న ప్లోబల్ కంపెనీ మరిన్ని రంగాల్లో యాప్స్ తయారీకి సిద్ధమవుతోంది. 202017 చివరి నాటికి ప్రపంచ మొబైల్ యాప్ మార్కెట్ 77 బిలియన్ డాలర్లు.. అంటే 5 లక్షల 23 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. అమెరికాలో 2014లో హాలీవుడ్ మూవీస్ అన్నికలిపి వసూలు చేసినదానికన్నా…ఐ ఫోన్ యాప్స్ తయారీదారులు ఎక్కువ ఆర్జించారు. అంటే మార్కెట్ ఏ స్థాయిలో వుందో చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని కంపెనీలు సొంతంగా యాప్స్ అభివృద్ధి చేసుకున్నా.. అవి అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. జాగర్నాట్ ఈ రంగంలో భారీ విజయాలే సాధించింది. జంగో, మినీ లక్సె లాంటి యాప్స్ డెవలప్ చేసింది. జంగో కంపెనీ పేటెమ్ ద్వారా భారీగా నిధులు సేకరించింది. 40 నగరాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. మినీ లక్సె అమెరికాలోని హైటెక్ సెలూన్ స్టార్టప్. ఇది 2014లో 23 మిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. అమెరికాకు చెందిన జిగ్ స్టెర్ కంపెనీ అండ్రిసీన్ యాప్ అభివృద్ధి చేసి 2015 డిసెంబర్ లో కోటి డాలర్లను ఆర్జించింది. కార్పొరేట్ ప్రోజెక్టులతోనే జిగ్ స్టెర్ కు సంబంధముంది. అందుకే మన దేశంలో ప్లోబల్ యాప్స్ లాంటి స్టార్టప్ లకు మంచి భవిష్యత్ ఉందని చెప్పుకోవచ్చు.

యువర్ స్టోరీ అభిప్రాయం

కంపెనీలు వేటికవే మొబైల్ యాప్ తయారు చేసుకోవాలంటే చాలా టైం కేటాయించాలి. ఖర్చుకూడా తడిసి మోపెడవుతుంది. అంత కష్టపడ్డా యాప్ విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ప్లోబల్ యాప్స్ లాంటివాటి సహకారం తీసుకోవడం ఉత్తమం. అలాంటి స్టార్టప్ లు మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాప్స్ తయారు చేస్తాయి. కావాలంటే వాటికి సంబంధిత కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్లు చిన్నచిన్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 

ప్లోబల్ యాప్స్ స్టార్టప్ ను కొద్ది మంది యువ టెకీలు విజయవంతంగా నడుపుతున్నారు. మున్ముందు ఎలాంటి యాప్స్ తయారు చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ఈ యాప్ విప్లవం మానవ మనుడగను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. అందుకే దీనికి మంచి భవిష్యత్ ఉందనే చెప్పవచ్చు. మంచి యాప్స్ ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే కదా..