విలువిద్యతో వ్యాపార తంత్రం

ఆన్‌లైన్‌లో ఆర్చరీ లాటరీఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాలయ సంస్కృతికి అద్దంబాణాల ఆటనే వాణిజ్యమంత్రంగా మార్చిన ఘనతఎన్.ఐ.టి. చదివి ఈ వ్యాపారంలోకి దిగిన అంకుర్ ప్రియదర్శన్రూపాయి పందేనికి రూ. 80 ప్రైజ్ప్రపంచంలోనే అత్యంత న్యాయబద్ధమైన లాటరీగా పేరు

విలువిద్యతో వ్యాపార తంత్రం

Sunday April 12, 2015,

3 min Read

సంస్కృతిని, లాటరీలో గెలుపొందాలనే ఆశని, సాంప్రదాయ విలువిద్యని కలిపి.. వ్యాపార సూత్రంగా మార్చిన అంకుర్ ప్రియదర్శన్ విజయగాధ ఇది. ముంబై లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో ఎంబీఏ అభ్యసించిన అంకుర్... వినూత్నమైన ఓ ఆలోచనతో వాణిజ్యాన్ని సృష్టించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో తరతరాలుగా సాంప్రదాయబద్ధమైన ఆట విలువిద్య. పేరుకు ఆటే అయినా.. ఇదో లక్కీ లాటరీ కూడా. ఒక్క రూపాయి పందెంతో గరిష్టంగా రూ. 80 వరకూ గెలుచుకునే ఛాన్స్ ఉండే ఆట షిల్లాంగ్‌లో జరుగుతుంది. ప్రస్తుతం దీనికి చట్టబద్ధత ఉంది కూడా.


Photo by  Mike Marlowe

Photo by Mike Marlowe


విభిన్నమైన లాటరీ

మేఘాలయలో ఈ ధనుర్విద్యతో ఆడే లాటరీ పేరు తీర్. గతంలో ఈ గేమ్‌ని 'తోహ్ టిమ్' అని పిలిచేవారు. లాటరీ-విలువిద్య రెంటినీ కలిపి కొన్ని తరాల క్రితమే ఈ గేమ్ డిజైన్ చేశారు. ఫలితాన్ని ఊహించడం, అంచనా వేయడం ద్వారా అప్పటికప్పుడే 80 రెట్లవరకూ గెల్చుకునే అవకాశముంటుంది. అంత మొత్తమా ! అనిపిస్తోందా.. ఇంతకీ అసలెలా ఆడతారో తెలుసుకోవాలనుందా? "ప్రతి రోజు సాయంత్రం 4గం.లకు, 4.30గం.లకు.. అంటే రోజుకు రెండుసార్లు విలుకాళ్ల ప్రదర్శన జరుగుతుంది. మూడు గ్రూపులు, ఒక్కో గ్రూపులో 20మంది ఆర్చర్స్... అంటే మొత్తం 60మంది విల్లంబులతో సిద్ధంగా ఉంటారు. సిగ్నల్ రాగానే తమ బాణాలను లక్ష్యం దిశగా సంధిస్తారు అందరూ. లక్ష్య ఛేదనను పరిశీలించి నిర్ణేతలు ఫలితాలు ప్రకటిస్తార"ని మైక్ మార్లో అనే ట్రావెలర్ తన బ్లాగ్‌లో రాశారు.


సాంప్రదాయం టూ ఆన్‌లైన్

20వ శతాబ్దం ప్రారంభంలో గ్రామాల్లోనూ, ప్రాంతాల్లోనూ విడివిడిగా ఈ ఆట నిర్వహించేవారు. 1950 తర్వాత ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది తీర్. ఆటకు ప్రాముఖ్యత పెరగడం, ఎక్కువమందిని ఆకర్షితులవడంతో.. న్యాయబద్ధమైన ఫలితాలు ప్రకటించేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1982లో ఈ ఆటను చట్టబద్ధం చేసింది మేఘాలయ ప్రభుత్వం. ఈ గేమ్‌ని ఆన్‌లైన్‌కి పరిచయం చేసి.. సక్సెస్ ఫార్ములా సిద్ధం చేశారు అంకుర్ ప్రియదర్శన్. 2014 అక్టోబర్‌లో www.teercounter.com వెబ్ సైట్ ప్రారంభించారాయన. ప్రతీ ఆట పూర్తయిన నిమిషాల వ్యవధిలోనే... స్కోర్లు, ఫలితాలు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చేలా సైట్ రూపకల్పన జరిగింది.

సెల్ఫ్ కాన్ఫిడెన్స్

తీర్ కౌంటర్ వెబ్‌సైట్‌కి నెలకు లక్షా 40వేల జెన్యూన్ క్లిక్స్ ఉంటాయి. అలెక్సాలో ఈ పోర్టల్‌కి భారత ర్యాంకు 9500. సైట్‌లోకి అడుగుపెట్టగానే హోమ్‌పేజ్‌లో రెండు కాలమ్స్‌లో నెంబర్స్ కనిపిస్తాయి. ఇవి తీర్ ఆటకు సంబంధించినవి కాగా.. మిగతావన్నీ డమ్మీ ఐకాన్లే. అవన్నీ ఆ సైట్‌కి సంబంధించిన ఇతర లింకులు. అలాగే ఈ సైట్ పేజ్‌లలో యాడ్స్ కూడా భారీగానే దర్శనమిస్తాయి. మొదటిసారి ఈ వెబ్ సైట్ విజిట్ చేసినపుడు యాడ్స్ కొంచెం ఇబ్బంది పెడతాయనే చెప్పచ్చు. అయితే వీటికి అంకుర్ దగ్గర సరైన సమాధానమే ఉంది. "మాది లాభాలు గడించే కంపెనీ.. మీరు చేసే రివ్యూల కోసం సైట్‌ డిజైన్ మార్చాలా" అంటూ అంకుర్ ప్రియదర్శన్ ఘాటైన ఈ మెయిల్ వచ్చింది. తన సైట్‌పై, తన బిజినెస్ మోడల్‌పై ఆయనకున్న నమ్మకం, అంచనా దీంతో అర్ధమవుతుంది.

స్టార్టప్ కంపెనీ స్థాయిలోనే విపరీతమైన క్రేజ్ ఉంది ఈ తీర్ కౌంటర్‌కి. ప్రస్తుతం తీర్ ఆటపై అంచనాలు, ఫలితాలకే పరిమితమైనా.. ఆ ఆటకే సంబంధించిన లాటరీ వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశాలని కొట్టి పారేయలేం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత న్యాయబద్ధమైన లాటరీ గేమ్ ఇది అనే పేరుంది దీనికి. ప్రస్తుతం ఆన్ లైన్‌లో తీర్‌కి సంబంధించిన టికెట్ల విక్రయం చేసేందుకు అంకుర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మేఘాలయ మొత్తానికి తీర్ కౌంటర్ గురించి తెలుసంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు టికెట్లు కొనే అవకాశం కూడా కల్పిస్తే ఖచ్చితంగా ఈ సైట్‌కి క్రేజ్ పెరుగుతుంది. అప్పుడు ఈ ఆట షిల్లాంగ్‌కే కాకుండా ప్రపంచం మొత్తానికి పరిచయమయి, నచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


అంకుర్ ప్రియదర్శన్

అంకుర్ ప్రియదర్శన్


పోటీ పెరిగినా మంచిదే

ప్రస్తుతం ఈ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయితే ముందస్తుగా ఈ వ్యాపారాన్ని అంచనా వేసి అడుగుపెట్టిన అంకుర్‌కే అవకాశాలెక్కువగా ఉంటాయి. ప్రస్తుతం 15 లక్షల మంది తీర్ ప్లేయర్స్ ఉన్నారు మేఘాలయాలో. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ కూడా ప్రారంభమైతే.. ఈ సంఖ్య బాగా పెరిగే ఛాన్సుంది. పోటీ పెరిగి... తద్వారా ఆట ప్రాచుర్చం పొందడం తమ కంపెనీకి మంచే చేస్తుందంటారు అంకుర్ ప్రియదర్శన్.