కనెక్టెడ్ ప్రోడక్ట్ అనుభూతిని అందిస్తున్న iBoT

కనెక్టెడ్ ప్రోడక్ట్ అనుభూతిని అందిస్తున్న iBoT

Sunday October 25, 2015,

4 min Read

This article is a part of Cloud Sparks Series sponsored by Microsoft Azure.

ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్ ఫోన్లు, ఈ-కామర్స్‌ల విప్లవం నడుస్తోందనే చెప్పుకోవాలి. దీని ద్వారా దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగానూ వివిధ రకాల డివైజ్‌లు లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు కనెక్టడ్‌గా ఉండటం అత్యావశక్యంగా మారింది.

iBoT టెక్నాలజీ తయారీదారులకు, వ్యాపారవేత్తలకు, జనాలకు... మెషీన్లతో సులభంగా కనెక్ట్ అయ్యేందుకు, కంట్రోల్ చేసేందుకు ఏర్పాటైన ఓ స్టార్టప్. మాన్యుఫ్యాక్చరర్లకు తమ ఉత్పత్తిని సులభంగా సబ్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్‌లుగా మలచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ద్వారా మరింత సమాచారం పొందేందుకు వ్యాపారవేత్తలకు సహకరిస్తుంది.

స్మార్ట్ డివైజ్‌లు, స్మార్ట్ వైర్ లెస్ సెన్సార్‌లు, వైర్ లెస్ కనెక్టివిటీ, స్మార్ట్ క్లౌడ్, స్మార్ట్ ఇంటిగ్రేషన్ వంటి టెక్నాలజీ స్టాక్ ను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా అందిస్తుంది iBoT.

image


ఐడియా ఆఫ్ ఎగ్జిక్యూషన్

రవి సుబ్రహ్మణ్యానికి ఐబాట్ రెండో వెంచర్. 2005లో మొబైల్ వన్ అనే ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ కంపెనీని స్థాపించిన రవి... 2011లో దాని నుంచి నిష్క్రమించారు. అదే ఏడాది... ఆలస్యమైన ఫ్లైట్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఈ ఔత్సాహిక వ్యాపారవేత్తకు ఓ కన్జ్యూమర్ డ్యూరబుల్ సంస్థ సీఈఓకు మధ్య జరిగిన సంభాషణ తరువాత iBoT ప్రాణం పోసుకుంది.

ఆనాటి సంభాషణను గుర్తుచేసుకున్న రవి... iBoT ప్రాణం పోసుకున్న తీరును వివరించాడు. ‘మా మధ్య జరిగిన సంభాషణ క్రమంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండస్ట్రీకి నడుమ ఉన్న పోటీపై ఓ బిజినెస్ మోడల్‌ను రూపొందించే ఆలోచనకు దారి తీసింది. తమ వద్ద ఉన్న సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్‌ను కస్టమర్‌కు అమ్మేసిన తరువాత సదరు సాఫ్ట్‌వేర్ సంస్థ మళ్లీ మొదటి నుంచి ప్రయాణం మొదలుపెట్టాలి. కాబట్టి, కొంత యూనిట్‌ను విక్రయించి, లక్ష్యాలను ఐదు నుంచి పదిశాతం పెంచుకునే కన్జ్యూమర్ డ్యూరబుల్ మార్కెట్ పై దృష్టి సారించడం మేలని భావించాను ’.

ఈ సంభాషణ జరుగుతున్నప్పుడే కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ఛానెల్ డ్రివెన్ సేల్స్, సర్వీసుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని గ్రహించారు రవి. దీనివల్ల మిస్ ప్లేస్డ్ వారెంటీలు ఎక్కవై నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మెషీన్ / ఉత్పత్తుల తయారీదారులు, ఓనర్లను కనెక్ట్ చేస్తూ రెండు వైపులా కమ్యూనికేషన్‌‌కు ఉపకరించడం ద్వారా iBoT సమర్థవంతమైన కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్‌కు తోడ్పడుతోంది.

ఈ స్టార్టప్ ప్రారంభించే ముందు రవి.. జర్మనీలోని SAP AG లోని ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీ విభాగంలో సుమారు 10 ఏళ్ల పాటూ సేవలు అందించారు. ఇండస్ట్రియల్ ఇంజినీర్ అయిన రవి... చార్టెడ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కూడా. దీనితోపాటూ MBA డిగ్రీ కూడా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన iBoT లో ప్రస్తుతం 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

గ్రోత్ స్టోరీ

పోడక్ట్స్ /మెషీన్స్ మాన్యుఫ్యాక్చరర్లు, ఓనర్లతోనే కాకుండా కన్య్జూమర్‌లతోనూ సమర్థవంతంగా డీల్ చేస్తుంది కాబట్టి iBoTను పూర్తిస్థాయి స్టాక్ కంపెనీగా అభివర్ణించవచ్చు. 2011-2014 మధ్యలో R & Dని మూసివేసే వరకూ నామమాత్రపు ఎదుగుదలనే చవిచూసిన ఈ సంస్థ 2014లో Q4 ద్వారా కొంత ఫండ్స్‌ను సమకూర్చుకుంది. ప్రస్తుతం iBoT మైక్రోసాఫ్ట్ వెంచర్స్ పోర్ట్ ఫోలీయో సంస్థగా మారింది.

మైక్రోసాఫ్ట్‌తో మా కలయిక ఎన్నో విధాలుగా కలసివచ్చింది. సంస్థను ప్రారంభించిన తొలినాళ్లలో అంటే 2012లో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ప్లాట్‌ఫార్మ్‌ను వినియోగించుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్ ఎంటర్ ప్రైజ్, అనుబంధ సంస్థలతోనూ సులభంగా సంబంధాలు ఏర్పడ్డాయి. మైక్రోసాఫ్ట్ వెంచర్స్, MS Corp ఈ రంగంలో బలంగా కుదురుకునేందుకు ఉపకరించాయి.

ఈ రంగంలోని పోటీతత్వం మైండ్ షేర్ పైనే ఆధారపడి ఉంటుందని రవి బలంగా నమ్ముతారు. ' ప్రతి సంస్థా ఇంటర్ కనెక్డెడ్‌నెస్ లేకపోవడం వల్లే నష్టాలు చవిచూస్తున్నామని గుర్తించింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు బోలెడు మార్గాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మేము చౌక ధరతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాం. తద్వారా సులభంగా పనిచేసుకునే వాతావరణం వాళ్లందరికీ ఏర్పడుతుంద' ని అంటారు రవి.

image


సవాళ్లు

బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే ఓ వేదికను డిజైన్ చేయడమే iBoT ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. అందులోనూ ప్రతి మెషిన్‌తోనూ అనుసంధానించే విధంగా దాన్ని రూపొందించాలి. అప్పటివరకూ డిజైన్ చేసిన ప్రతీ మెషిన్ కూడా కేవలం ఒక్క ప్రయోజనానికి మాత్రమే ఉపయోగపడేది. ఉదాహరణకు గేమింగ్ కోసం ఎక్స్ బాక్స్, హాట్ స్పాట్స్ కోసం వైఫై రూటర్లు వగైరా. కాబట్టి, 2013 వరకూ తమ సొల్యూషన్‌ను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఎలక్ట్రానిక్ డివైజుల తయారీదారులు హార్డ్‌వేర్ లెవెల్‌లో సెక్యూరిటీ గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదని గుర్తించారు. దీనిపై స్పందించిన రవి.. ‘ ఎన్క్రిప్షన్, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను కాపాడుకోవడానికే... సాఫ్ట్ వేర్ స్టాక్‌లను ఉపయోగిస్తారు. ఆటోనోమస్ ఫంక్షన్‌లను నిర్వహించే పరికరాల (గేట్లు, డోర్లు, రీఫ్రిజరేటర్లు, పవర్ జెనరేటర్లు మొదలైనవి)ను కనెక్ట్ చేసేటప్పుడు చొరబాటు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. ఇది ఓ వైరస్, మీ ఈ మెయిల్‌ను అటాక్ చేయడం కన్నా ఎంతో ప్రమాదకరమైనద’ ని తెలిపారు. అందుకే తయారీ దశలోనే ఇండస్ట్రియల్ గ్రేడ్ టెక్నాలజీ, సెక్యూరిటీని ఇందులో భాగం చేస్తున్నారు. అయితే తమ డిజైన్ వల్లే ప్రస్తుత స్కేల్, సామర్థ్యం ఆధారపడి లేదని అంగీకరించేందుకు రవి ఏమాత్రం వెనుకాడకపోవడం మరో విశేషం.

'అజ్యూర్ వంటి క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ ఫార్మ్ లకు ఎంతగానో రుణపడి ఉంటాం. లక్షలాది మెషిన్ల పనితీరుపై అవగాహన, వాటికి ఏం కావాలో తెలుసుకుని త్వరితగతిన సాఫ్ట్ వేర్‌ను రూపొందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంద' ని చెబుతున్నారు రవి.

భవిష్యత్ ప్రణాళికలు

ఎన్నో ఏళ్లు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్టార్లో సేవలు అందిస్తున్న రవి... తన అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలను గర్వంగా వివరిస్తున్నాడు.

1. ప్రోటోటైపింగ్ ముఖ్యమైనదే అయినప్పటికీ... అది మీ ఆర్కిటెక్చర్ పై ప్రభావం చూపకుండా చూసుకోవాలి.

2. మీ కస్టమర్లు సదరు సబ్జెక్టులో నిష్ణాతులు కాదని గుర్తుంచుకోవాలి. ఇంకొకరు ఈ రకమైన సిస్టమ్స్‌ను రూపొందిస్తున్నప్పుడు... మీదే పూర్తి బాధ్యత అని భరోసా ఇవ్వాలి.

3. ఎంటర్‌ప్రైజ్ / ఇండస్ట్రీ గ్రేడ్ సిస్టమ్‌లను డిజైన్ చేయడం చాలా కష్టం. సరైన సహచరులను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం.

iBoT లో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ సంస్థ ప్రయాణాన్ని సైన్స్ ఫిక్షన్ మూవీగా అభివర్ణించుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇతరులతో సెక్యూర్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. ది హైవ్ మైండ్ త్వరలోనే వాస్తవం కాబోతోందని రవి బలంగా నమ్ముతారు. అందుకే 'ప్రతి మెషీన్ కూడా ఇతర మెషీన్‌ల ఎక్స్‌పీరియెన్స్‌కు అనుగుణంగా ట్యూన్ అయ్యి ఆపరేట్ చేసే రోజులు వస్తాయ'ని అంటారు.

భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో తమ సంస్థ ప్రపంచంలోనే ఉత్తమమైన కంపెనీగా గుర్తింపు సాధిస్తుందని రవి నమ్ముతున్నారు. అతని కలలు నెరవేరుతాయని ఆశిద్దాం.

-----

అజ్యూర్ అనేది ఓ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఫ్లాట్ ఫార్మ్. కంప్యూట్, డేటా, స్టోరేజ్, నెట్వర్కింగ్ వంటి ఇంటిగ్రేటెడ్ సర్వీసులకు ఓ యాప్‌లా పనికి వచ్చే ప్లాట్ ఫార్మ్. మ్యానేజ్డ్ , అన్ మ్యానేజ్డ్ సర్వీసుల అద్భుతమైన కలయికతో కూడిన ఈ యాప్ వివిధ అప్లికేషన్‌లను బిల్డ్ చేసుకునేందుకు, మేనేజ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎంటర్‌ప్రైజ్ ప్రూవెన్ హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్స్ డిమాండ్‌కు తగ్గ ఫలితాలను త్వరితగతిన జెనరేట్ చేస్తుంది. ఇది ఆన్-ప్రిమైసెస్‌తో పాటు క్లౌడ్‌కు తగ్గట్లు అప్లికేషన్‌లను నిర్మించేందుకు దోహదపడుతుంది. అజ్యూర్ ద్వారా డేటా స్టోరేజ్, బ్యాక్ అప్, రికవరీ మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.