ఇంటిదగ్గరికే సెలూన్ సేవలు.. 2 నెలల్లోనే వేయి ఆర్డర్లు

0

ఆన్ లైన్, యాప్స్ రావడంతో సర్వీసులన్నీ డోర్ డెలిరీ అయిపోయాయి. కిరాణా సామాను నుంచి మెడికల్ సర్వీసుల దాకా అన్నీ కాలింగ్ బెల్ కొట్టి సర్వీస్ అందించేవే. తాజాగా వీటి సరసన చేరింది సెలూన్ సర్వీస్. అంటే ఇంటిదగ్గరకే బ్యూటీ సేవలన్నమాట. క్రాస్నా అనే ఈ పక్కా హైదరాబాద్ స్టార్టప్.. ప్రారంభమించి రెండు నెలలు పూర్తి చేసుకుందో లేదో.. ఇప్పటికే వేయి ఆర్డర్లు కూడా దాటింది.

“జ్యూయలరీ డిజైనర్ గా ఉన్నప్పుడే బ్యూటీ సేవలను సంబంధించిన స్టార్టప్ పెట్టాలనుకున్నా,” ప్రియాంక రెడ్డి

క్రాస్న ఫౌండర్ ప్రియాంక ఈ స్టార్టప్ కు ముందు జ్యూయలరీ వ్యాపారం చేశారు. కస్టమైజ్డ్ డిజైన్స్ లో ప్రత్యేక పేరుంది.

ఇది మొదలు

జ్యూయలరీ వ్యాపారంలో ఎంతో మంది క్లెయింట్స్. చాలామంది వెడ్డింగ్ మేకప్, ఇతర బ్యూటీసేవల గురించి ప్రియాంకను అడిగేవారట. సాధారణంగా జ్యూయలరీ వ్యాపారానికి కస్టమర్లైనా, క్లెయింట్స్ అయినా అమ్మాయిలే ఉంటారు. వారు ఇంత ఆసక్తితో అడగడంతో ఈ స్టార్టప్ కు బీజం పడిందని చెప్పుకొచ్చారామె.

“గతేడాదే సెలూన్ సర్వీస్ స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నా,” ప్రియాంక

అయితే పూర్తి స్థాయిలో ఆర్గనైజ్డ్ గా ఉండాలని మార్కెట్ రీసెర్చి చేశామని ఆమె అంటున్నారు. పూర్తి ప్రొఫెషనల్ గా సెలూన్ సేవలు ఉండేలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో ఈ రంగంలో రాణిస్తోన్న స్టార్టప్ లను దగ్గరి నుంచి చూసి దీన్ని మొదలు పెట్టానని అన్నారామె.

క్రాస్న పనితీరు

ప్రారంభించిన దాదాపు రెండున్నర నెలలవుతోంది. పూర్తి స్థాయిలో ప్రమోషన్ కూడా మొదలు కాలేదు. కానీ ప్లేస్టోర్ లో వందల్లో డౌన్ లోడ్స్ ఉన్నాయి. ఐఓఎస్ లో కూడా కస్టమర్లున్నారు.

“కస్టమర్లకు మూడు రకాలుగా సేవలను అందుబాటులోకి తెచ్చాం,” ప్రియాంక

క్రాస్న సేవలను వినియోగించుకోడానికి కస్టమర్లకు మూడు రకాలు దారులున్నాయి. అందులో మొదటిది యాప్. మొబైల్లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఆర్డర్ ఇవ్వొచ్చు. వెబ్ సైట్ ద్వారా కూడా ఆర్డర్లు ఇవ్వొచ్చు. దీంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి అపాయింట్ మెంట్ ఇవ్వొచ్చని ప్రియాంక అంటున్నారు. ఆఫీసు, హోటల్, ఇళ్లు ఇలా ఎక్కడి కైనా వెళ్లి క్రాస్న టీం సర్వీసు అందిస్తుంది. పూర్తిగా మగువల కోసమే నడుస్తోన్న స్టార్టప్ కనుక- సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రీనింగ్ చేసిన ఉద్యోగులను మాత్రమే తమ సంస్థలోకి తీసుకుంటారు. షీటీంలకు అనుసంధానం అయ్యేలా ఆప్షన్ నుకూడా ఇస్తున్నారు.

క్రాస్న టీం

క్రాస్న టీం విషయానికొస్తే.. ప్రియాంక రెడ్డి గురించి ప్రధానంగా చెప్పాలి. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి డిగ్రీ పొందిన ప్రియాంక- 2008లో యూరప్ లోని మంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రియంక్(PRIYNK) పేరుతో కస్టమైజ్డ్ జ్యూయలరీ వ్యాపారం చేశారు. గతేడాది చివర్లో ఈ స్టార్టప్ ప్రారంభించారు. తమ కస్టమర్లంతా ఆడవారే కావడం, వారికి ఉపయోగపడే మరో వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశంతో బ్యూటీ సెలూన్ సర్వీస్ స్టార్టప్ ప్రారంభించారు. మరో ఇద్దరు ఆపరేషనల్ మేనేజర్లు, ఇద్దరు కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ మొత్తం ఐదుగురు టీం ఈ స్టార్టప్ కు పనిచేస్తున్నారు. దీంతో పాటు మరో వందమంది బ్యుటీషియన్స్ పనిచేస్తున్నారు.

సవాళ్లు, ఇతర ప్లేయర్లు

ఇప్పటికే అన్ని మెట్రో నగరాల్లో ఈ తరహా స్టార్టప్ లు ఉన్నాయి. వాటి బ్రాంచీలు హైదరాబాద్ లో ఉన్నాయి. వీరి బ్రాండ్ తో పోలిస్తే ఇక్కడే ప్రారంభమైన క్రాస్నాకు అంతస్థాయిలో మార్కెట్ లేకపోవచ్చు. కానీ ప్రియాంకకు గతంలో జ్యూయలరీ పరంగా ఉన్న క్లయింట్స్ తో తనకంటూ ఓ మార్కెట్ ఇమేజీని క్రియేట్ చేసుకున్నారు. కనక వారి నుంచి పెద్డ పోటీ ఉండబోదనే ధీమాతో ఉన్నారు.

“సర్వీస్ సెక్టార్ లో ఉన్నాం కనుక, గుడ్ విల్ కాపాడుకుంటూ రావడమే పెద్ద చాలెంజ్,” ప్రియాంక

100 మంది ప్రొఫెషనల్ బ్యుటీషియన్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ స్టార్టప్ కోసం పనిచేస్తున్నారు. బలమైన టీంతో ఈ సవాల్ ఎదుర్కొంటామని ప్రియాంక అంటున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

హైదరాబాద్ నుంచి బెంగళూరు, వైజాగ్, విజయవాడ, చెన్నైలకు సేవలను విస్తరించాలని చూస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా దీన్నిపూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories