హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త !!

0

హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు ఇదొక ప్రియమైన వార్త. ఎందుకంటే ఇకపై ప్యారడైజ్ బిర్యానీ తినాలనుకుంటే రెస్టారెంట్ దాకా వెళ్లక్కర్లేదు. ఫుడ్ పాండాలో ఆర్డరిస్తే ఇంటి దగ్గరకే వేడి వేడి బిర్యానీని తెచ్చిపెడతారు. ఫుడ్ పాండాతో కలసి డెలివరీ సర్వీసును అందిస్తోంది ప్యారడైజ్.

“బిర్యానీ టేస్ట్ మిస్ అవుతున్నామనుకునే వారికి ఇదొక అపూర్వ అవకాశం” సమీర్ భాసిన్

ప్యారడైజ్ సిఓఓ సమీర్ ఇకపై ప్యారడైజ్ టేస్ట్ మిస్ అవ్వల్సిన పనిలేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

హైదరాబాద్, బెంగళూరుల్లో

ప్యారడైజ్ బిర్యానీ హైదరాబాద్ తోపాటు బెంగళూరులో కూడా సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల రెండు చోట్ల ఈ సర్వీసును ఒకే సారి అందుబాటులోకి తెచ్చామన్నారు. హైదరాబాద్ లో ప్యారడైజ్ కి తొమ్మిది రెస్టారెంట్, టేక్ అవే సెంటర్లున్నాయి. బెంగళూరులో మూడు వరకూ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు ఫుడ్ పాండా యాప్ ద్వారా అన్న చోట్ల బిర్యానీ సప్లై చేయనున్నారు.

“ఆన్ లైన్స్ సేల్స్ తో కొత్త అధ్యాయం కానుంది” సమీర్

ప్యారడైజ్ ఆన్ లైన్ సేల్స్ లోకి రావడం సరికొత్త అధ్యయమే అంటున్నారు సమీర్. తమ డెలివరీ పాట్నర్ గా ఫుడ్ పాండా ఉండటం సరికొత్త ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకొచ్చారు.

మిలియన్ డాలర్ డీల్

ఫుడ్ పాండా, ప్యారడైజ్ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా మిలియన్ డాలర్ టర్నోవర్ జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇక ఫుడ్ పాండా విషయానికొస్తే అన్నిచోట్ల నుంచి ఫుడ్ ని కస్టమర్లకు చేరవేడయడంలో ముందుంది. ఫుడ్ పాండాకు హైదరాబాద్, బెంగళూరులో బాగా నెట్ వర్క్ ఉంది. మరో పక్క హైదరాబాద్ బిర్యానీకి పెట్టింది పేరు. ఎన్నో దశాబ్దాలుగా ప్యారడైజ్ అనేది హైదరాబాద్ బిర్యానీకి ఒక బ్రాండ్ నేమ్ గా మారిందని చెప్పాలి.

"ప్యారడైజ్ లాంటి సంస్థ తో తాము భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది," సౌరభ్

ఫుడ్ పాండా సీఈఓ సౌరభ్ ప్యారడైజ్ తమ క్లెయింట్ గా ఉందని ఇప్పుడు భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. రెండు సంస్థలు కలసి భవిష్యత్ లో మిలియన్ డాలర్ల వ్యాపారం చేయనున్నాయన్నారు. తమ కస్టమర్లకు మరింత చేరువ కాడానికి మొదటిసారి డెలివరీ విభాగంలో తాము భాగస్వామ్యాన్ని చేర్చుకున్నామని సమీర్ చెప్పుకొచ్చారు.

బిర్యానీతో పాటు ఇతర వంటకాలు

బిర్యానీతో పాటు ప్యారడైజ్ లో లభించే ఇతర్ వంటకాలను సైతం ఫుడ్ పాండాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా తమకంటూ ఉండే బిర్యానీ ఫ్యాన్స్ కోసం ఫుడ్ పాండాతో చేతులు కలిపామని సమీర్ అంటున్నారు. గ్రిల్డ్ చికెన్, చికెన్ 65 తోపాటు వెజిటేరియన్ ఐటమ్స్ కావాలన్నా ఫుడ్ పాండా యాప్ లో లభిస్తాయనన్నారు. ఫుడ్ పాండాసర్వీసు ఉండే సమయంలో కచ్చితంగా బిర్యానీ దొరికే ఏర్పాటు చేశారు. దీంతోపాటు పండగలకు ప్రత్యేక ఆఫర్లను సైతం అందిస్తామన్నారు.

భవిష్యత్ ప్రణాలికలు

రెండు నగరాలకే పరిమితమైన బిర్యానీ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఆంధ్రాలోని ఇతర టూ సీటీలను తర్వాతి టార్గెట్ గా చెప్పుకొచ్చిన సమీర్ ఫుడ్ పాండా అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో హోం డెలివరీని ప్రారంభిస్తామన్నారు. కార్పొరేట్ ఆఫీసుల అవసరార్థం అన్న సమయాల్లో బిర్యానీ దొరికేలా చూస్తామని అంటున్నారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik