10 రోజులు..30 మందితో మీటింగ్..12 కోట్ల ఫండింగ్ - ఆర్టిస్ట్ రాఘవ కొత్త మోడల్

ఫ్లిప్ సైకిల్ వ్యవస్థాపకుడు రాఘవ్ కెకెవిభిన్నమైన చిత్రాలను గీయడంతో దిట్టఆర్ట్ ప్రెన్యూర్ గా ఎదిగిన వైనంక్రియేటివ్ ఆలోచనతో ఫండింగ్ రాబట్టిన రాఘవఎలాంటి బిజినెస్ ప్లాన్ లేకుండా నిధులు సమీకరించాడుఅదెలా సాధ్యం ? అందరికీ వర్కవుట్ అవుతుందా ?

10 రోజులు..30 మందితో మీటింగ్..12 కోట్ల ఫండింగ్ - ఆర్టిస్ట్ రాఘవ కొత్త మోడల్

Wednesday April 08, 2015,

3 min Read

ఫ్లిప్ సైకిల్ వ్యవస్థాపకుడు రాఘవ కె.కె., రెండు మిలియన్ డాలర్లు సమీకరించారు. రెండు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో పన్నెండు కోట్ల రూపాయలు. అదీ పది పన్నెండు మంది ఏంజిల్ ఇన్వెస్టర్ల దగ్గరే ఆయన ఈ సొమ్మును సేకరించగలిగారు. వాట్సాప్ కు చెందిన నీరజ్ అరోరా, గోకీ కి చెందిన విశాల్ గోండాల్, క్లీనర్ పీకింగ్స్ భాగస్వామి జాన్ మేడా ఇందులో భాగస్వాములయ్యారు.

ఎలాంటి వ్యాపార ప్రణాళిక లేకుండా రాఘవ ఈ నిధులను సమీకరించగలిగారు. ఆయన విజయ రహస్యమేమిటి. ఇతర పెట్టుబడిదారులకు ఆయన ఎలా ఆదర్శంగా నిలుస్తారు. ఈ సంగతి తెలుసుకునేందుకు యువర్ స్టోరీ… రాఘవతో కాసేపు ముచ్చటించింది..

ఎలా జరిగిందంటే… ?


రాఘవ కెకె

రాఘవ కెకె


రాఘవ మాటల్లో చెప్పాలంటే "పెట్టుబడిని సమీకరించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి సంప్రదాయ పద్దతి. రెండోది తక్కువ ప్రయాణం…తక్కువ శ్రమతో సాధించేది.. పాత పద్ధతిలో రూపొందించే వ్యాపార ప్రణాళికలో పది నుంచి పన్నెండు స్లైడ్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఏంజిల్ ఇన్వెస్టర్ లేదా వీసీతో సమావేశం ఏర్పాటు చేసుకుని పావుగంట ఇరవై నిముషాల్లో స్లైడ్లను చూపిస్తూ మొత్తం వ్యాపార ప్రణాళికను వివరించాలి. ప్రణాళిక నచ్చితే వాళ్ల దగ్గరున్న జూనియర్ సిబ్బంది వంద ప్రశ్నలు అడుగుతారు. దాని తర్వాతే తమకు నచ్చిందని హామీ ఇస్తారు. అప్పుడే పది నుంచి ఇరవై మందితో బృందాన్ని సిద్దం చేయాలి. బృంద నాయకుడు ఒక టర్మ్ షీటు రూపొందిస్తాడు. ఈ ప్రక్రయ పూర్తయ్యేందుకు నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు" రాఘవ అంటున్నారు.

రాఘవ ఒక కొత్త మార్గం కనిపెట్టారు. సమయం వృధా కాకుండా చూసుకున్నారు. తనకు అర గంట ఇంటర్వ్యూ ఇవ్వాలని కంపెనీల వైస్ ఛైర్మన్లను అడిగారు. తన కంపెనీకి వాళ్లు ఏ విధంగా సాయపడగలరో నేరుగానే అడిగేశారు. తను కేవలం పెట్టుబడికి నిధులు సమీకరించడం లేదని…. వ్యాపారంలో విజయం సాధించిన పెట్టుబడిదారుల నుంచి తన కొత్త్ బిజినెస్ మోడల్ కు స్మార్ట్ మనీ అడుగుతున్నానని నమ్మించగలిగారు. నిధులను ఎలా సమీకరిస్తున్నారో.. ఆ నిధులను ఎలా వినియోగిస్తారో వారికి వివరించగలిగారు. పెట్టుబడి పెడతారని నమ్మకం ఉన్న వారి దగ్గరకు టర్మ్ షీటు కూడా తీసుకెళ్లారు. న్యూయార్క్ లోని ఒక అగ్రగామి లా ఫర్మ్ దగ్గరకు వెళ్లి ..ఇద్దరం కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధించే ఫార్ములాను వారికి వివరించి ఒప్పించారు.పది రోజుల వ్యవధిలో 30 మందిని కలవాలనుకున్నారు. ఆ 30 మంది నుంచి రెండు మిలియన్ డాలర్లు సమీకరించాలనుకున్నారు…రాఘవ కలవాలనుకున్న కొందరు ఇన్వెస్టర్లకు ఆయన ముందే తెలుసు. దానితో వారిని ఒప్పించడం సులభమైంది. మరికొంత మందిని తన స్నేహితుల ద్వారా సంప్రదించి ఒప్పించారు.

ఎలా సాధించారంటే ?

పెట్టుబడిని సమీకరించేందుకు రాఘవ ఎప్పుడూ ఏంజిల్ లిస్ట్ సిండికేట్ ను వాడలేదు. సిలికాన్ వ్యాలీలోని తన స్నేహితురాలిని సంప్రదించి కొన్ని రోజులు ఆమె ఇంట్లో ఉంటానన్నారు. పెట్రోల్ పోయించుకుని ఆమె కారును వాడుకుంటానన్నారు. ఒక మూల నుంచి మరో మూలకు కారులోనే ప్రయాణించారు. ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. న్యూయార్క్ నగరంలో ఉండే రాఘవ భార్య నేత్ర… కొందరు పెట్టుబడుదారులకు ఈ మెయిల్స్ ఇచ్చి ఆయనకు మార్గం సుగమం చేశారు. కంపెనీ సహ వ్యవస్థాపకురాలు, సీఓఓ కూడా అయిన ఆమె ఈ మెయిల్ ద్వారా ఐదు సమావేశాలు ఏర్పాటు చేయగలిగారు.

రాఘవ కొన్ని కంపెనీలకు అప్పాయింట్ మెంట్ లేకుండానే వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో ఎవరైనా తెలిస్తే పావుగంట సమయం కావాలని.. ఆ పావుగంటలోనే అందరి జీవితాలు మారిపోతాయని రాఘవ కొందరిని ఒప్పించగలిగారు. పెట్టుబడి పెట్టడం ఇష్టం లేని వారిని రాఘవ ఒక్క ప్రశ్న అడిగారు. పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్న వారిని పరిచయం చేయాలని వారిని కోరారు. వెంటనే ఫోన్ చేయమని అడిగారు పైగా అదో జీవవైవిధ్యమని ఆయన చెప్పుకున్నారు…

సంప్రదాయానికి విరుద్ధంగా రాఘవ చేసిన ప్రయత్నం ఫలించింది. అందుకు మూడు కారణాలున్నాయి. పెట్టుబడి కోసం ఆయన కలిసిన వ్యక్తులు ముందే తెలిసి ఉండటం ప్రయోజనం కలిగించింది. గతంలో అతని ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉండేదని అందరూ గుర్తించారు. ఆఖరుగా అతనిలో అంకిత భావం అందరికీ నచ్చింది. తన ప్రయత్నంలో రాఘవ విజయం సాధించి ఉండొచ్చు. అందరకీ ఈ ప్రక్రియను సిఫారసు చేయలేం. అయితే ఈ పనిలో రాఘవ కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నారు.


రాఘవ్ కెకె అద్భుతాల్లో ఒకటి

రాఘవ్ కెకె అద్భుతాల్లో ఒకటి