కళాకారులకు వారధిగా మారిన అభినేత్రి

కళాకారులకు వారధిగా మారిన అభినేత్రి

Sunday December 27, 2015,

2 min Read

నాట్యకళాకారులు, గాయకులు, వాయిద్యకారులు ఇలా కాళాకారులు ఎవరైనా వారి కోసం ఈవెంట్స్ చేయడానికి మేమున్నాం అంటన్నారు అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ వారు. 2003 లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ అభినేత్రి దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారులతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంది.

“కొత్త కళాకారులకు ఓ ప్లాట్ ఫాం ఇద్దామనుకుంటున్నాం,” ప్రమోద్ రెడ్డి

సంగీతం, నాట్యం లాంటి అంశాల్లో కొత్తగా ప్రవేశించే వారికి సరైన గైడ్ లైన్స్, స్టేజ్ పెర్ ఫార్మెన్స్ కు అవకాశం ఇవ్వడమే తమ సంస్థ ఉద్దేశమని అభినేత్రి ఫౌండర్ ప్రమోద్ అంటున్నారు.

image


20ఏళ్లు డ్యాన్స్ తో అనుబంధం

ప్రమోద్ 20 ఏళ్లుగా భరత నాట్యం సాధన చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి భరత నాట్యంలో డిప్లమా పూర్తి చేశారు. 2003 నుంచి అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ స్థాపించి సాంప్రదాయ కళలకు సేవలందిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఈ అకాడమీ నుంచి బయటకు వచ్చారు. పూర్తి స్థాయి స్టేజ్ షోలు 2013నుంచి మొదలు పెట్టారు. అమెరికాలో జరిగే తానా సభల్లో కూడా డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ చేసిన ప్రమోద్ భరతనాట్యానికి మరింత ప్రచారం కల్పించాలనుకుంటన్నారు. దీనికోసం భారీగా ఈవెంట్స్ చేయాలని అనుకుంటన్నారు. ఇప్పటికే కొన్ని ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. తాను రెండు దశాబ్దాలుగా భరతనాట్యంతో అనుబంధం కొనసాగిస్తున్నానని మరింత కాలం ఇది కొనసాగుతుందని సంతోషంగా అంటున్నారు ప్రమోద్.

image


అభినేత్రి చేపడుతున్న ఈవెంట్స్

అభినేత్రి ప్రధానంగా ఏడాదికి రెండు ఈవెంట్లను చేపడుతోంది. నాట్యప్రవాహ, త్యాగరాజ నృత్య ఆరాధన లుగా ప్రమోద్ చెప్పుకొచ్చారు.

image


  1. నాట్యప్రవాహ 2013 నుంచి ప్రారంభించారు. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో స్టేజ్ షో ఉంటుంది. మంజులా శ్రీనివాస్, చిత్ర నారాయణన్ లాంటి ఎందరో గొప్ప డ్యాన్సర్లు తమ ఈవెంట్ లో పాల్గొన్నారని అంటున్నారాయన.
  2. త్యాగరాయ నృత్య ఆరాధన అనేది ఓ సరికొత్త ప్రక్రియ. వందల మంది గాయకులు, కళాకారులు పెర్ ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒకే నాట్యకళాకారిని నృత్యం చేయడం ఈ ప్రక్రియ ఉద్దేశం.

“మన సాంప్రదాయ నృత్యాన్ని ప్రచారం కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం,” ప్రమోద్

ఇప్పటి వరకూ ఈ ఈవెంట్ల ద్వారా 150కి పైగా కళాకారులను పరిచయం చేశాం. వీటిని ప్రారంభించి మూడేళ్లు కావస్తోంది. మరింత మందిని పరిచయం చేయాలని చూస్తున్నామని అంటున్నారాయన.

అభినేత్రి టీం

అభినేత్రి టీం విషయానికొస్తే ప్రమోద్ రెడ్డి ఫౌండర్. అభినేత్రికి స్కూల్ కు టీచర్ కూడా ఆయనే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్ లో పీజీ పూర్తి చేసిన ప్రమోద్ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆఫీసు పూర్తియిన తర్వాత అభినేత్రి స్కూల్లో పాఠాలు చెబుతారు. డ్యాన్స్ నేర్పిస్తారు. అభినేత్రికి ఫ్రీ లాన్సర్స్ గా మరో పదిమంది దాకా పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ లో 50మంది సభ్యులున్నారు. తానా లాంటి సభల్లో భరతనాట్యం షోలను పనిచేయడానికి కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. టీం ని మరిన్ని దేశాల్ల విస్తరించాలని చూస్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాలికలు

ఇన్నోవేటివ్ షోలను ఆర్గనైజ్ చేయాలని ప్రమోద్ యోచిస్తున్నారు. సాండ్ ఆర్ట్స్, డ్యాన్స్ కాంబినేషన్ తో పాటు టీం బిల్డింగ్ స్టోరీ టెల్లింగ్ లాంటి ప్రక్రియలను చేపట్టాలని చూస్తున్నారు. సరికొత్త థీమ్ తో భరతనాట్యం షోలను ఏర్పుట చేయాలనుకుంటున్నారు. అమెరికాలో, హాంకాంగ్ లో అభినేత్రికి బ్రాంచీలున్నాయి. మరిన్ని దేశాల్లో బ్రాంచీలు ప్రారంభిచాలలని చూస్తున్నారు.

సంగీతం,నాట్యం, సాంప్రదాయ కళ ఏదైనా అది భాషకు అందని ఓ అనుభూతి దాన్ని అనుభవిస్తే గాని మాటల్లో చెప్పలేమని ముగించారు ప్రమోద్