స్టార్టప్‌కు స్ట్రాటజీ కన్సల్టెంట్ల అవసరమెంత ?

స్టార్టప్‌కు స్ట్రాటజీ కన్సల్టెంట్ల అవసరమెంత ?

Friday August 14, 2015,

4 min Read

ఏదైనా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే పెట్టుబడి ఒక్కటి ఉంటే సరిపోదు. మంచి ప్రణాళిక ఉండాలి. మనం పెట్టుబడి పెట్టే రంగంలో ఎలాంటి పోటీ ఉంది ? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి ? భవిష్యత్ ఎలా ఉండబోతుంది ? అనే విషయాలను అంచనా వేయగలగాలి. కానీ స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నవారిలో చాలామంది ఇండస్ట్రీకి కొత్తవారే. దీంతో స్ట్రేటజీ కన్సల్టెన్సీలకు గిరాకీ పెరిగిపోతోంది. సంస్థల అభివృద్ధికి ఈ స్ట్రాటజీ కన్సల్టెన్సీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ సంస్థలపైనా ఆరోపణలు వస్తున్నాయి. స్ట్రాటజీ కన్సల్టెన్సీలు ఇస్తున్న సలహాలు ఎందుకు పనికిరావడంలేదని కొందరు వ్యవస్థాపకులు ఆరోపిస్తున్నారు. మనది కానప్పుడు ఎలాంటి సలహాలైనా ఇవ్వొచ్చనే వాదన వాళ్ల నుంచి వినిపిస్తోంది. అయితే వీటిని కొట్టిపారేస్తున్నారు jitha.me వ్యవస్థాపకులు జితామిత్ర తాతాచారి.

image


వ్యాపార రంగంలో ఎక్కువగా దూషణలు భరించేది స్ట్రాటజీ కన్సల్టెంట్లే. గతంలో ఐదేళ్లపాటు నేను మానిటర్ గ్రూప్‌లో పనిచేశాను (ఈ సంస్థను మైఖెల్ పోర్టర్ ప్రారంభించారు). స్ట్రాటజీ కన్‌సల్టెంట్లపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.

  • వ్యాపార దిగ్గజాలకు కన్సల్టెంట్ రంగంలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న యువకులు ఎలా సలహాలివ్వగలుగుతారు ?
  • ఐదేళ్ల తర్వాత అమలులోకి వచ్చే ప్లాన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది ?
  • స్లైడ్లను తయారు చేయడం తప్ప కన్సల్టెంట్లు ఏమీ చేయరు
  • ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు. కానీ ఇతరులకు సలహాలిస్తారు
  • సలహాలు ఇచ్చే రంగంలో మాత్రం మీరు ఎప్పటికీ పెట్టుబడులు పెట్టరు

స్నేహితులు, బంధువులు, విమానాల్లో కలిసే స్నేహితులు నుంచి ఇలాంటి ఎన్నో ఆరోపణలు విన్నాను. ఇలాంటి ఫిర్యాదులను మేం ఎలా అడ్రస్ చేస్తామో మానిటర్ గ్రూప్‌లో పనిచేసేటప్పుడు చర్చించాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు సలహాలు ఇచ్చే సమయంలో వాటికి అవసరమైన స్థాయిలో, విస్తృతంగా, చాలా కసరత్తు చేస్తుంటాం.


1. మీరెవరైనా కానివ్వండి. మీకు ఏ విషయాలు తెలిసినా నాకు అవసరం లేదు. కానీ హైపోథిసిస్ విధానం మీకు అవసరం. అది నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండండి.

స్ట్రేటజీ కన్సల్టింగ్ రంగంలో ప్రవేశించినప్పుడు నాకు తోచిన మొదటి విషయం సరికొత్త హైపోథిసిస్ బేస్డ్ విధానం.

పరికల్పన ఆధారిత విధానం

పరికల్పన ఆధారిత విధానం


ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నేను మొదట్లో తీసివేత విధానాన్ని (డిడెక్టివ్ అప్రోచ్) అవలంభించేవాన్ని. తెలిసిన దాని నుంచి మొదలుపెట్టి, ముగింపు దిశగా ఆలోచిస్తుండేవాడిని. మరోవైపు నుంచి ఇండక్టివ్ అప్రోచ్ (పరికల్పన విధానం) ద్వారా కొన్ని అంచనాలు చేయడం, వాటిని పరీక్షించడం (అవసరమైతే వాటిని మోడిఫై చేయడం) చేశాం. ఈ డాటా ఆధారిత విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. ఈ నేర్చుకునే విధానం కారణంగా ఇండస్ట్రీని అర్థం చేసుకునే సంపూర్ణత్వం లభించింది. అందుకే చాలా కంపెనీలు స్ట్రాటజీ కన్సల్టెంట్లను నియమించుకుంటాయి. తమ నమ్మకాలను పరీక్షించి, ఇండస్ట్రీలు ఎలా మారుతున్నాయో కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌లకు వివరిస్తాయి ఆ సంస్థలు వివరిస్తాయి.

ఈ విధానంలో అంచనాలు వేయడం, ఒకవేళ అవి తప్పయితే వాటిని సరిద్దుకోవడం జరుగుతుంటుంది. తరచుగా బహుళ ప్రాజెక్టులలో పనిచేయడం కారణంగా ఆరోగ్యకరమైన ప్రశంసలు లభిస్తుంటాయి. ఈ సంస్థను ప్రారంభించిన సమయంలో ఈ మార్గాన్ని నేను గుర్తించగలిగాను. నాకు సరైన సమాధానం తెలిసి ఉండకపోవచ్చు. కానీ నా నమ్మకాలను ఎలా పరీక్షించుకోవాలో తెలుసు, ఆ విధంగానే నేను నడుచుకుంటాను.

2. అనిశ్చితిలో కూడా పనిచేయడం..

స్ట్రాటజీకి, ఆపరేషనల్ కన్సల్టింగ్‌కు ఉన్న భేదం ఏంటంటే టైమ్ ఫ్రేమ్. స్ట్రాటజీ అనేదీ సుదీర్ఘ కాలానికి చెందినది. వచ్చే మూడు నాలుగేళ్లలో ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉంటాయో తెలియజేస్తుంది. ఒక్కోసారి ఆ స్ట్రేటజీలు పని కూడా ప్రారంభించవు. కాబట్టి కొంత అస్పష్టత ఉంటుంది. కానీ అప్పటికీ కొన్ని సృజ‌నాత్మ‌క‌ మార్గాలను అన్వేషించి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇండస్ట్రీ నిపుణులతో మాట్లాడాలి. సంబంధిత ఇండస్ట్రీల్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో పరిశీలించాలి. ఆర్థిక స్థితిగతులను అంచనావేయాలి. కానీ నిన్ను సంతృప్తి పరిచేందుకు ఇవేవీ సరైన సమాధానాలు ఇవ్వవు. ఆరంభంలో సరైన సమాధానాలు లభించకపోవచ్చు. కాని పరిస్థితులు చక్కబడిన తర్వాత మనకు కావాల్సిన సమాధానం లభిస్తుంది.

ఇప్పుడు మా స్టార్టప్ చేసే పని ఇదే. నా ప్రాడక్ట్ ఎవరికి నచ్చుతుందో, ఎవరో అసహ్యించుకుంటారో, ఎంతమంది వేస్ట్ అంటారో, ఎందరు పక్కనపడెస్తారో తెలియదు. నేను మాత్రం పనిచేస్తూనే ఉంటాను. నేను సరైన మార్గంలోనే పనిచేస్తున్నాను అని తెలుసుకునేందుకు ఎప్పుడు ఏదో రకమైన పరీక్షలు చేసుకుంటూనే ఉంటాను.

3. క్లయింట్ల అలవసరాలను తీర్చడమే అన్నింటికన్నా ముఖ్యమైనది.

కొంతకాలంపాటు సందిగ్ధతను పక్కనపెట్టేద్దాం. కన్సల్టింగ్ రంగంలో క్లయింట్లకు సేవ చేయడమే ముఖ్యం. మానిటర్ గ్రూప్‌లో పనిచేస్తున్న సమయంలో కంపెనీ వ్యవస్థాపకులు ఇదే చెప్తుండేవారు. వారాంతంలో అకస్మాత్తుగా పనిచేయడం కావొచ్చు లేదా ఆరోగ్యం బాగోలేకపోయిన ఫీల్డ్ విజిట్ చేయాల్సి రావొచ్చు. క్లయింట్ లబ్ధి పొందే పనులు చేయడం ఎంతో ముఖ్యం.

ప్రస్తుతం మేం వినియోగదారుల కోసం ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను రూపొందించాం. ప్రతి క్షణం ఈ యాప్‌కు సంబంధించిన రివ్యూలు వస్తుంటాయి. కొన్నిసార్లు తీవ్రంగా దూషిస్తు, వన్ రేటింగ్ మాత్రమే ఇస్తూ రివ్యూలు వస్తుంటాయి. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పనిచేయలేం. ఎవరైతే నెగటివ్ రివ్యూలు ఇస్తారో, వారికి కూడా ఉపయోగపడేలా పనిచేయాలన్నదే నా లక్ష్యం. అప్పుడు ఈ రేటింగ్‌ల గురించి భవిష్యత్‌లో బాధపడాల్సిన అవసరం రాదు.

‘‘ప్రతిభావంతులందరిలో విలువైనదేంటంటే ఒక పదం అవసరమైన చోట రెండు పదాలను వాడకపోవడం- థామస్ జెఫర్‌సన్’’

‘‘ప్రతిభావంతులందరిలో విలువైనదేంటంటే ఒక పదం అవసరమైన చోట రెండు పదాలను వాడకపోవడం- థామస్ జెఫర్‌సన్’’


4. క్లుప్తతే సమాచార వ్యవస్థకు ఆత్మ..

విమర్శకులు చెప్పేది నిజమే. కన్సల్టెంట్లు ఎక్కువగా పవర్ పాయింట్ స్లైడ్స్ వాడుతుంటారు. కానీ వాటిని ఉపయోగించడం ఎంతో అవసరం. వర్డ్ డాక్యుమెంట్‌లా కాకుండా స్లైడ్స్‌లలో ఎక్కువ ప్లేస్ ఉండదు. అందువల్ల చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెప్పేది ఎందుకు ముఖ్యమో కూడా వివరించాల్సి ఉంటుంది.

స్లైడ్స్ తయారు చేసేందుకు నేను ఇప్పటివరకు పదివేల గంటలపాటు కష్టపడి ఉండొచ్చు. అయినా అందులో నేను నిష్ణాతుణ్ణి కాను. కానీ కీలకమైన సందేశాన్ని కొన్ని పదాల్లో ఇవ్వడం మాత్రం తెలుసు. స్టార్టప్ కంపెనీలకు ఇదెంతో ముఖ్యం. క్లయింట్లకు చిన్నపాటి ఈమెయిల్ సందేశాలు, ప్రభావవంతమైన ఫేస్ బుక్ యాడ్స్, ఇన్వెస్టర్లకు చిన్న చిన్న అటెన్షన్ స్పాన్స్.. ఇలా క్లుప్తమయిన సందేశాలు స్టార్టప్‌లకు ఎంతో కీలకం.

5. సలహాలు కాదు వాటిని అమలుపర్చడం ముఖ్యం

ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్ట్.. ఇలా నిరంతర అనుభవం కారణంగా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎంతో చక్కగా ఆలోచించి తయారు చేసిన వ్యూహాలు కూడా ఒక్కోసారి అమలులో విఫలమవుతుంటాయి. దీనికి సంబంధించి నా దగ్గర వాస్తవ ఉదాహరణ ఉంది. మేం ఓ స్ట్రాటజీని రూపొందించి క్లయింట్‌కు ఇచ్చాం. కొన్ని నెలల తర్వాత ఆ క్లయింట్ తిరిగి మా వద్దకు వచ్చి మేం సూచించింది వర్కవుట్ కావడం లేదని, మళ్లీ సాయం చేయాలని కోరాడు. మేం మంచి సూచనలే ఇచ్చాం. కానీ ఆ ప్లాన్ అమలు చేయడంలో సాయం చేయడం కూడా మా బాధ్యతే. ఆ క్లయింట్ టీమ్ మెంబర్స్‌కు మా స్ట్రేటజీ గురించి వివరించాం.

ఈ కెరీర్‌లో అనుభవం ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే వ్యూహాలు పెద్ద విషయమేమీ కాదు. దాన్ని పక్కగా, ప్రభావవంతంగా అమలు చేసేలా, క్లయింట్‌కు ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే ముఖ్యం. పాల్ గ్రాహం తన కథనంలో మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌ను ‘‘గేమింగ్ ద సిస్టమ్’’‌గా పేర్కొన్నారు. అలాగే దాన్ని కాలేజీతో పోల్చారు. మొదటి విషయాన్ని నేను అంగీకరించను. కానీ రెండో విషయం మాత్రం నిజమే. వ్యాపారం రంగంలో ఉన్నతంగా నిలబడేందుకు, సత్తాచాటేందుకు స్ట్రాటజీ కన్సల్టెంట్ మంచి స్కూల్‌లా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

రచయిత జితా ముంబైలో ఓ చిన్న డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్‌ను రన్ చేస్తున్నారు. కొంతకాలంపాటు మోనిటర్ గ్రూప్‌లో పనిచేసిన జితా, స్ట్రేటజీ రంగంలో భవిష్యత్‌ను ఊహించి సొంతంగా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జితా పుస్తక పురుగు. (2014లో 62 పుస్తకాలను పఠనం చేశారు). ఖాళీ సమయాల్లో రాసేందుకు ఆసక్తి చూపుతారు. జితా గురించి మరింత తెలుసుకోవాలంటే jitha.meని సంప్రదించండి.