ఇక ఫేస్ బుక్ లో ప్రొఫైల్ పిక్ దర్జాగా పెట్టుకోండి..!

0

మీకు తెలుసా? ఫేస్ బుక్ వాడకంలో అమెరికా తర్వాత ఇండియానే టాప్ సెకండ్ పొజిషన్లో ఉంది. యూఎస్‌ లో 219 మిలియన్ పీపుల్ ఫేస్ బుక్ వాడితే, భారత్ తో యూజర్ల సంఖ్య 213 మిలియన్లు. ఇక ఇటీవలి లెక్కల ప్రకారం మన దేశంలో 24 శాతం మంది మహిళలు ఎఫ్‌బీని వాడుతున్నారు. అయినప్పటికీ చాలామంది మహిళలు తమ అకౌంట్లలో ప్రొఫైల్ పిక్ పెట్టుకోడానికి వెనుకాడుతున్నారు. కారణం ఫోటోలు మిస్ యూజ్ అవుతాయనే భయం. డౌన్ లోడ్ చేసి మార్ఫింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే అందరూ ప్రొఫైల్ ఫోటో ఏ పువ్వో, సీనరీయో పెట్టుకుంటారు. లేదంటే ఖాళీగా వదిలేస్తారు.

సామాజిక కట్టుబాట్లు తెంచుకుని సామాజిక మాధ్యమాల్లోకి వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేది వాస్తవం. సొంతఫోటో కూడా పెట్టుకోలేని నిస్సహాయత. దీనికి పరిష్కారం చూపించింది ఫేస్ బుక్. మహిళల కోసం ఒక కొత్త పరికరాన్ని పరిచయం చేసింది. దానిపేరే ప్రొఫైల్ పిక్ గార్డ్. ఈ టూల్ ఫోటోకి రక్షణ కవచంలా నిలుస్తుంది. అపరిచితులు ఇమేజ్ డౌన్ లోడ్ చేయడం దుర్లభం. షేర్ చేయడం అంతకంటే కష్టం. స్క్రీన్ షాట్ వీలుకాదు. కనీసం టాగ్ కూడా చేయలేరు. ఈ టూల్ ను వాడే వారి ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ బ్లూ కలర్ బోర్డర్ కనిపిస్తుంది. అదే ఫోటోకి అతిపెద్ద రక్షణ వలయం.

పైలెట్ ప్రాజెక్టుగా ఇండియాలో ప్రవేశపెడుతున్నామని ఫేస్ బుక్ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు కూడా ఈ టూల్ సదుపాయాన్ని కల్పించనుంది.