మొబైల్ గేమ్స్ ఆడేవారి సోషల్ నెట్వర్కింగ్ ఈ ‘ప్లేజాప్’

మొబైల్ గేమ్స్ ఆడేవారి సోషల్ నెట్వర్కింగ్ ఈ ‘ప్లేజాప్’

Saturday October 24, 2015,

3 min Read

మీకు మొబైల్ గేమ్స్ ఆడే అలవాటుందా? అన్నీ గేమ్స్ కాకుండా కొన్నింటికే అతుక్కుపోయి ఉంటారా ? మీలా ఇంకెవరైనా అలా స్టిక్ అయిన వారి గురించి తెలుసుకోవాలనుందా ? అయితే ప్లేజాప్‌లో లాగిన్ కావ్వాల్సిందే.

"ప్లేజాప్ అనేది ఆటల ఆడే వారందరినీ కలిపే ఒక ఫేస్ బుక్ లాంటిది." ఫౌండర్ రవి

ప్లేజాప్ ప్రారంభం

ప్లేజాప్‌కి ద్రుతా అనేది పేరెంటింగ్ కంపెనీ. ఈ కంపెనీ ప్రోడక్టుగా ప్లేజాప్ జనం ముందుకు వచ్చింది. మొబైల్‌లో సోషల్ నెట్ వర్కింగ్ ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. మొబైల్ గేమ్స్ ఆడేవారంతా ఈ నెట్ వర్క్‌లో సభ్యులు. మల్టీ ప్లేయర్ గేమ్స్‌నుఈ నెట్ వర్క్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తో ఆడుకోవచ్చన్నమాట. రియల్ టైం నాకౌట్స్ ఈ యాప్‌లో ఉండే అసలు మజా. అలా మొదలైన ప్లేజాప్‌లో ఇప్పుడు 6 వేలకు పైగా ప్లేయర్స్ ఉన్నారు. యాక్టివ్ యూజర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మరింత యూజర్ బేస్ పెంచుకున్నాక పూర్తి స్థాయి యాప్ ప్లాట్‌ఫాంలో టోర్నమెంట్లు చేపట్టాలని చూస్తున్నారు.

image


అసలేంటి ప్లేజాప్

గేమ్స్ ఆడే నెట్వర్క్‌లా ఉన్నప్పటికీ గేమ్స్‌లోనే ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా ఇది అందుబాటులో ఉంటుంది. ఉన్న గేమ్స్ అన్నింటిలో ఇది ఉండటం వల్ల అక్కడ రిజిస్ట్రర్ చేసుకున్న యూజర్ కు నోటిఫికేషన్స్, పాపప్స్ పంపిస్తుంది ప్లేజాప్. యాప్ మోడ్‌లో ఉన్నప్పటికీ గేమ్స్‌కు ఇన్‌బిల్ట్ ఫీచర్‌గా సేవలు అందిస్తోంది. ఇన్ బిల్ట్ ఫీచర్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ చేయడం చాలా సులభం. అలా యూజర్స్‌కు కొత్త విషయాలు చెబుతూ వారు గేమ్‌తో కనెక్ట్ అయ్యేలా ప్రమోట్ చేస్తుంది. డీల్స్ ఇస్తూ గేమ్ మళ్లీ మళ్లీ ఆడేలా చేస్తుంది. ఇలా గేమ్ యూజర్ బేస్‌ని కాపాడే ఇన్ బిల్ట్ యాప్ ఇది.

image


రెవెన్యూ మోడల్

గేమ్ స్టుడియోలో ఇంటిగ్రేట్ కావడం వల్ల వర్చువల్ కరెన్సీ ని యూజర్లకు అందించడం ఇందులో మొదటి ఆదాయ వనరు. గేమ్స్‌ని ప్రమోట్ చేసే పనిలో భాగంగా వర్చువల్ కరెన్సీ పాయింట్స్‌ని యజర్లకు ఇవ్వడం వల్ల వాటి వేల్యూ బట్టి షేరింగ్ వస్తుంది. దీంతో పాటు యూజర్లను కనెక్ట్ చేయడం, గేమ్‌లో యూజర్ బేస్ సస్టేయిన్ చేయడంతో మరో రకంగా ఆదాయం సమకూరుతుంది. టికెట్స్‌ని అమ్మడాన్ని ప్లేజాప్ యూజర్ల ద్వారా ప్రమోట్ చేయడం దీని ప్రధానం ఉద్దేశం కనుక ఈ రకంగా కూడా ఆదాయం సమకూరుతోంది.

ప్లేజాప్ టీం ప్లేయర్స్

రవి సాతనపల్లి ప్లేజాప్ ఫౌండర్. విప్రో, మోటరోలా లాంటి పెద్ద సంస్థల్లో 20ఏళ్లకు పైగా అనుభవం ఉన్న రవి.. దీన్నీ ఈ ఏడాది జూన్ లో ప్రారంభించారు. ఈయనతో పాటు గేమ్ డెవలప్‌మెంట్‌‌లో 17 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి టీం మొంబర్‌గా ఉన్నారు. ఆయనతో పాటు వెబ్ డెవలప్‌మెంట్ పై అనుభవం ఉన్న మరో ఇద్దరు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ల తో పాటు మరో కో ఫౌండర్ ఉన్నారు. ఇండస్ట్రీలో అత్యంత ప్రభావశీల మైన పొజిషన్స్ లో పనిచేసిన టీం దీని వెనకుంది.

ఇతర ప్లేయర్స్

బెంగళూరు కేంద్రంగా నెక్ట్స్ పీర్ అనే ఓ స్టార్టప్ దీనికి సిమిలర్ గా ఉంటుంది. ఇదే ఇండస్ట్రీలో 5 ఏళ్ల అనుభవం ఉన్న ఈ స్టార్టప్ సబ్ స్క్రిఫ్షన్ ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తోంది. దీంతో పోలిస్తే టెక్నాలజీ పరంగా చాలా స్ట్రాంగ్ అయిని ప్లేజాప్ సోషియల్ నెట్ వర్కింగ్ అనే ఫీచర్ యునిక్ ఫ్యాక్టర్. ఎక్కువ మంది ప్లేయర్స్ ని యంగేజి చేయడం దీని ప్రధాన ఉద్దేశం కనక నెక్ట్స్ పీర్ కంటే ప్లేజాప్ బెస్ట్ అంటున్నారు ఫౌండర్ రవి.

image


ఫండింగ్ , భవిష్యత ప్రణాళికలు

ఫ్యామిలి అండ్ ఫ్రెండ్స్ ద్వారానే సేకరించిన ఫండ్స్ తో ప్రస్తుతం ఇది నడుస్తోంది. యూజర్ బేస్ పెరుగుతున్న కొద్దీ ఆదాయం పెరుగుతోంది. సీడ్ ఫండింగ్‌తో పాటు ఫస్ట్ రౌండ్‌కి సిద్ధంగా ఉన్న ప్లేజాప్ తొందరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటోంది. ప్లేయర్స్ అందరినీ కనెక్ట్ చేసి టోర్నమెంట్లను ఏర్పాటు చేయాలనే ఈ యాప్ భవిష్యత్ ప్రణాలికలో ఒకటి. వేల సంఖ్యలో యూజర్స్ ని గేమ్ లో ఇన్వాల్వ్ చేసి రియల్ టైం టోర్నమెంట్లకు సిద్ధం అవుతోంది. టీం ఎక్స్ పేన్షన్ కోసం చూస్తోంది.

మొదటి ఏడాది పూర్తైనప్పటికీ వన్ మిలియన్ యూజర్ బేస్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని ముగించారు రవి