ప్రపంచంలో ఏ కళాశాల గురించైనా చెప్తుందీ కాలేజీ దునియా..

ప్రపంచంలో ఏ కళాశాల గురించైనా చెప్తుందీ కాలేజీ దునియా..

Monday April 04, 2016,

3 min Read


పరీక్షలు అయిపోయాయి. సమ్మర్ హాలీడేస్. తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఏది బెస్ట్ కాలేజ్? మంచి కాలేజీని వెదకడం చాలా కష్టమైన పని. మనం చేరబోయే కాలేజీలో సౌకర్యాల మాటేమిటి? అసలు అందులో చేరితే ప్లేస్ మెంట్ వస్తుందా? ఇలాంటి సమస్యలన్నింటికీ సింగిల్ క్లిక్ తో చెక్ పెట్టొచ్చంటోంది కాలేజీ దునియా టీం.

దేశ – విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం అందిస్తోంది కాలేజ్ దునియా. 20 వేల కాలేజీలు, యూనివర్సిటీలు, ఫీజుల సమాచారాన్ని అందిస్తోందీ వెబ్ సైట్. ప్లేస్ మెంట్, పూర్వ విద్యార్థులు, ర్యాంకింగ్స్, అవార్డ్స్, ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇలా మొత్తం సమాచారం అందిస్తోంది. ఈ వెబ్ సైటును రోజుకు 60 వేల మంది విజిట్ చేస్తున్నారు. సిటీలవారిగా… దేశాలవారీగా.. కోర్సులవారిగా ఎలాగైనా సెర్చ్ చేయవచ్చు. ప్రతి కాలేజ్ కు సంబంధిచిన రివ్యూలు చదవొచ్చు. దేశంలోని ఆరు వేల కోర్సులకు సంబంధించిన వివరాలు ఈ కాలేజ్ దునియాలో కనిపిస్తాయి.

2014లో సాహిల్ ఛలానా కాలేజ్ దునియాను స్థాపించారు. బిట్స్ పిలానీలో సాహిల్ 2010లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాహిల్.. మొదట్లో గెట్ మై ఫామ్ డాట్ ఇన్ పేరుతో స్టార్టప్ స్థాపించారు. అది కొంత విజయం సాధించినా… పార్ట్ నర్స్ విడిపోవడంతో అది మూతపడింది. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాలేజీ డేటా, క్వాలిటీ ఇన్ఫర్మేషన్, అడ్మిషన్లలో సమాచార కొరత ఎక్కువగా ఉందని గుర్తించారు. కొంతమందితో కలిసి పరిశోధనలు చేసి, కాలేజీ దునియా వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ఆర్నెల్ల పరిశోధనల తర్వాత పకడ్బందీగా ఈ వెబ్ సైట్ ను తీసుకొచ్చారు. గాడీ డాట్ కాం సీఈవో ఉమాంగ్ కుమార్ కోటి రూపాయలు పెట్టుబడి పెడితే, మరికొందరు రెండుకోట్లు ఇన్వెస్ట్ చేశారు.

ట్రూలీ, మ్యాడ్లీ వ్యవస్థాపకుడు పీఈసీ చండీగఢ్ గ్రాడ్యుయేట్ హిమన్షు జైన్ కాలేజీ దునియా సీఈఓగా పనిచేస్తున్నారు. ఐడీఎస్ ఇన్ఫోటెక్ మాజీ ఉద్యోగి.. కంటెంట్ హెడ్ గా జాయిన్ అయ్యారు. జలంధర్ నిట్ లో చదివిన ఆశిష్ కుమార్ ఆపరేషన్స్, మెయిలింగ్ బాధ్యతలు చేపట్టారు. కెరీర్ 360 ఎంప్లాయీలో పనిచేసిన డీసీఈ గ్రాడ్యుటేట్ సంజయ్ మీనా.. సేల్స్ వ్యవహారాలను చూస్తున్నారు.

image


ఆదాయం ఎలా?

వెబ్ సైట్లో యాడ్స్ పై ఆధారపడి కాలేజ్ దునియాను నడుపుతున్నారు. అవి కాకుండా ఔత్సాహికులకు ప్రిపరేషన్ మెటీరియల్స్ ను అమ్ముతున్నారు. NIIT గ్రూప్, ఎడ్యుకంప్ బిజినెస్ స్కూల్స్, NMIMS, అలయెన్స్ బిజినెస్ స్కూల్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, బ్రిటిష్ కౌన్సిల్, ఐడీపీ గ్లోబల్ లాంటి క్లైంట్స్ కూడా కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు.

అసలు ఎడ్యుకేషన్ రంగం ఎలా ఉంది?

భారత్ లో ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యధిక టీనేజర్లున్న దేశం భారత్. అందుకే భవిష్యత్ లో మార్కెట్ బాగా విస్తరిస్తుంది. 2020నాటికి ప్రపంచంలోనే గ్రాడ్యూయేట్లున్న రెండో పెద్ద దేశం అవుతుంది. విద్యారంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లూ కూడా భారీగా వస్తున్నాయి. 2000 నుంచి 2015 మధ్యకాలంలో 120 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.అందుకే విద్యారంగంలో స్టార్టప్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఖాన్ అకాడమీ, టాటా ట్రస్ట్ లాంటి సంస్థలు ఈ రంగంలోకి వస్తున్నాయి. మార్కెట్లో పోటీమాత్రం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.

భవిష్యత్ ప్రణాళికలు

రోజుకు లక్షమంది విజిటర్స్ ను ఆకట్టుకోవడమే కాలేజ్ దునియా ప్రస్తుత టార్గెట్. వచ్చే ఆరు నెలల్లో పదిలక్షల మందికిపైగా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటారు. ఏడాదిలోనే భారత్ లో నంబర్ వన్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ గా అవతరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీం. ఆన్ లైన్ కౌన్సెలింగ్ ఇవ్వాలనేది మరో ప్లాన్. గత రెండు నెలల్లోనే 25 వేల మంది ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారంటే… దీనికున్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 20వేల విద్యా సంస్థల సమాచారం అందిస్తున్న ఈ వెబ్ సైట్.. 2016 చివరినాటికి 40వేల కాలేజీలు, పలు యూనివర్సిటీల సమాచారం ఇవ్వనుంది.

యువర్ స్టోరీ మాట

ప్రపంచ విద్యారంగంలో భారత్ కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో 14 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 22 కోట్ల 70 లక్షల మంది విద్యార్థులున్నారు. 36 లక్షల మంది విద్యార్ధులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ట్యాక్సీలు, ఈ-కామర్స్ రంగాల్లో … మొబైల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎడ్ టెక్ స్టార్టప్ లకు ఇది చాలా మంచికాలమనే చెప్పొచ్చు. 

పిల్లల్ని చదివించేందుకు తల్లి దండ్రులు ఖర్చుకు వెనుకాడటం లేదు. రిక్షా తొక్కుకునేవారు సైతం తమ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు. అందుకే ఈ రంగంలో కంపెనీల ఎదుగుదలకు మంచి స్కోప్ ఉందనే చెప్పొచ్చు. 20 వేల విద్యా సంస్థలను కవర్ చేసిన కాలేజ్ దునియా.. విద్యార్థులకు మంచి సేవల్నే అందిస్తోంది.

వెబ్ సైట్