ఇండియాలో సర్ఫింగ్‌ నేర్పిస్తున్న విదేశీ స్వామి

అమెరికాకు చెందిన జాక్ హెబ్నర్... మన దేశంలో సర్ఫింగ్ స్వామి.ఇండియాలో తొలిసారిగా మంగళూరులో సర్ఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన సర్ఫింగ్ స్వామి.ఆధ్యాత్మికతో పాటు సర్ఫింగ్ పట్ల శిక్షణ ఇస్తున్న ‘సర్ఫ్ క్లబ్ మంత్రా’.ఆసక్తి ఉన్న వారు ఆశ్రమంలో ఉంటూ శిక్షణ తీసుకునే వీలు.

ఇండియాలో సర్ఫింగ్‌ నేర్పిస్తున్న విదేశీ స్వామి

Tuesday June 09, 2015,

2 min Read

50 ఏళ్లుగా అలలతో పోటీ పడ్తూ.. ఇంటర్నెట్‌లో కూడా సర్ఫింగ్ చేస్తున్న జాక్ హెబ్నర్, ఇప్పుడు సర్ఫింగ్ స్వామిగా మారారు. అమెరికాలోని జాక్సన్ విల్లేకు చెందిన హెబ్నర్‌కు, 1972లో భారతీయ ఆధ్యాత్మికతపై మక్కువ పెరిగింది. అప్పటికే సర్ఫింగ్‌తో అనుబంధం ఉన్న స్వామి, ఇండియాలో సర్ఫింగ్ జాడ లేనట్టు గుర్తించారు. ప్రపంచంలో పొడవైన కోస్తా తీరాల్లో ఒకటైన మన దేశంలో సర్ఫింగ్ కల్చర్ లేకపోవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది.

ఈ సాంప్రదాయాన్ని మార్చాలని అనుకున్న స్వామి, 2004లొ కొంత మంది యువకులతో కలిసి మంగళూరులో ఓ సర్ఫింగ్ క్లబ్ ప్రారంభించారు. ఆ గ్రూపులో ఒకడైన రామ్మోహన్, 8 ఏళ్ల వయసులోనే సర్ఫింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇండియాలో తొలి సర్ఫింగ్ క్లబ్ గురించి తెలుసుకోవడానికి, రామ్ మోహన్‌తో మాట్లాడే ప్రయత్నం చేసాము. సర్ఫింగ్ ఫోటోగ్రఫీ ని కూడా ఎంచుకున్న రామ్ మోహన్, తను తీసిన ఫోటోలు ప్రపంచంలోని పలు మ్యాగజీన్స్‌లో ప్రచురితమయ్యాయి. 

“ ప్రారంభంలో సర్ఫింగ్ కోసం చెన్నై వెళ్లే వాళ్లం, అయితే మాకంటూ ఓ బేస్ ఉండాలని భావించిన సర్ఫింగ్ స్వామి, అందుకు మంగళూరును ఎంచుకుని, ‘మంత్రా సర్ఫ్ క్లబ్’ ఏర్పాటు చేసారంటున్నారు రామ్ మోహన్”.

image


అసలు ‘మంత్రా సర్ఫ్ క్లబ్’ ఆధ్యాత్మికతను పొందే ఆశ్రమం. “ఉదయం 4 గంటలకు లేచి స్నానం చేసిన వెంటనే ధ్యానం మొదలవుతుంది, 6:30 గంటలకు అందరు కలిసి శ్లోకాలు చదువుతారు, ఆ తరువాత పూజ జరుగుతుంది, ధ్యానంలో ప్రధాన మంతాన్ని ‘మహా మంత్ర’, లేదా ‘కృష్ణ మంత్ర’ అంటారని తన వెబ్ సైట్లో వెల్లడించారు జాక్”. సర్ఫింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అతిధులు ఎవరైనా ఆశ్రమంలొ ఉండవచ్చు, లేదా సాధారణంగా ఎన్రోల్ చేసుకుని క్లాసులు అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

మంత్రా క్లబ్‌లో ఒకే సారి 6 నుండి 8 మంది ఉండే అవకాశం ఉంది. కేవలం క్లాసుల వరకే అయితే 15 మంది వరకు ఇక్కడ శిక్షణ పొందవచ్చు. ఇక క్లబ్ నడపడానికి జాక్, ఆయన సిబ్బంది వెబ్ డిజైనింగ్‌తో పాటు కొబ్బరి బొండాలు కూడా అమ్ముతుంటారు. “మా వెబ్ సైట్ ఇప్పటికే ప్రాచుర్యం పొందింది, సర్ఫింగ్ వస్తువులు అమ్మడానికి మా దగ్గర ఈ కామర్స్ స్టోర్ కూడా ఉందంటున్నారు రామ్ మోహన్”.

“2004లో Surfing India.net వెబ్ సైట్ ని ప్రారంభించిన మాకు, అనూహ్యంగా స్పందన వస్తోంది. ఇండియాలో తొలి సర్ఫింగ్ క్లబ్ కావడంతో, ఇప్పటికే మంచి పాపులారిటీని కూడా సంపాదించింది, సముద్రంలో వినూత్న అనుభూతి పొందడానికి చాలా మంది రిక్వెస్ట్ పంపుతుంటారు,”- రామ్ మోహన్.

ఈ క్లబ్ ఆపరేషన్స్ చూడటానికి ఐదుగురు సభ్యులు ఉన్నారు. సర్ఫింగ్ స్వామి నిత్యం ప్రయాణిస్తున్నప్పటికీ, మంగుళూరును ఆయన బేస్‌గా పెట్టుకున్నారు. సర్ఫింగ్ కు సంబంధించి ఈ క్లబ్ అనేక ఈవెంట్స్ కూడా నిర్వహిస్తుంటుంది. అంతే కాకుండా, ఇతర దేశాల నుండి కూడా చాలా మంది మంగళూరులో సర్ఫింగ్‌లో పాల్గొనడానికి వస్తూ ఉంటారు. ప్రకృతిని గౌరవించడం కూడా జీవితంలో ఓ భాగం. “ దేవుడి సృష్టిలో భాగమైన పకృతిని గౌరవించాలని బోధిస్తాము, పకృతిని కాపాడే వారిగా ఉండాలి తప్ప నదులు, పర్వతాలు, అడవులు, సముద్రాలను కలుషితం చేసే వారు కాకూడదంటారు జాక్ ”.

ఇప్పటికే ప్రాముఖ్యతను సంపాదించిన ‘మంత్రా సర్ఫ్ క్లబ్’ కు విజిటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మెక్సికోలోని సియారా మాడ్రే పర్వతాల్లో ఇటీవల ఓ కొత్త ప్రాజెక్ట్‌ని కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పేరు అక్కడి ప్రాంతాని అనుకూలంగా ‘హౌస్టెకా ఎన్కాన్ టాడా’ అని పెట్టారు. అక్కడ కియాకింగ్, రాఫ్టింగ్, రాపలింగ్, ట్రేయిల్ బైకింగ్ లాంటి అడ్వెంచర్స్ చేసే వీలు కల్పిస్తున్నారు.