క్యాంపస్ కథలు చెప్పే ‘స్టుమేగ్జ్’

1


కాలేజీ అంటేనే ఇన్నోవేషన్. సరికొత్త ఆవిష్కరణలన్నీ కాలేజీ లైఫ్ నుంచి మొదలైనవే. భవిష్యత్ ఆంట్రప్రెన్యూర్ల మొదటి అడుగులు క్యాంపస్ నుంచే మొదలువుతాయి. ఇక ఐడియాలగురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నూతన ఆవిష్కరణల్ని వెలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది స్టుమేగ్జ్ అనే ఓ హైదరాబాదీ స్టార్టప్. విద్యార్థుల ఇన్నోవేటివ్ కధలను ప్రపంచానికి చెబుతోంది. క్యాంపస్ కధలను ప్రత్యేకంగా చూపిస్తోంది. ఇదొక కాలేజీ మేగజైన్ అని ఫౌండర్లు చెప్పుకొస్తున్నారు.

100కు పైగా కాలేజీలు

ఇప్పటి వరకూ వందకు పైగా కాలేజీలకు సంబంధించిన వేల కధలను ఈ సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐదు వేలకు పైగా విద్యార్థులు ఇందులో రిజిస్ట్రర్ అయ్యారు. యాక్టివ్ యూజర్ల సంఖ్య రెండులక్షలు. ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణల్లో ఉన్న కాలేజీల దాకా నెట్ వర్క్ వ్యాపించింది.

“కాలేజీ నేటివ్ కంటెంట్ అందించడం మా లక్ష్యం,” శ్రీచరణ్ లక్కరాజు

శ్రీచరణ్ ఈ స్టార్టప్ ఫౌండర్. విద్యార్థుల ట్యాలెంట్ ని గుర్తించడం తమ స్టార్టప్ సొల్యూషన్ గా చెప్పుకొచ్చాడు. కాలేజీ ఫెస్ట్ లను సంబంధించిన సమాచారం ఇవ్వడం లాంటివి ఈ సైట్ చేస్తోంది. వేల మంది విద్యార్థుల ఆలోచనల్ని ఆన్ లైన్ మేగజైన్ రూపంలోకి తీసుకొచ్చారు. మరిన్నింటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.. మరిన్ని క్యాంపస్ లకు మా సేవలను విస్తరించడమే లక్ష్యమని తెలిపాడు శ్రీచరణ్

స్టుడెంట్ రైటర్స్

చాలా వరకూ తమ కథలను విద్యార్థులే రాస్తున్నారని శ్రీచరణ్ అంటున్నాడు. ఎవరి కథలను వారే చెబుతున్నారు. వాటని తాము పబ్లిష్ చేస్తున్నామని అంటున్నాడు. వైజాగ్ గీతం, ఇక్కడి సిబిఐటి లాంటి కాలేజీలకు ప్రత్యేక బ్లాగ్ లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరిన్ని కాలేజీలకు ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నాడు.

“విద్యార్థుల నుంచి ఒరిజినల్ కంటెంట్ సేకరిస్తున్నాం,” శ్రీచరణ్

కాలేజీల్లో జరిగే విశేషాలను విద్యార్థు నుంచే సేకరిస్తున్నాం. నూతన ఆవిష్కరణ గురించి కాలేజీ నుంచి రిజిస్ట్రర్ అయిన విద్యార్థులే అందిస్తున్నారు. ఎవరైనా సైట్ లో రిజిస్ట్రర్ అయి కంటెంట్ అదించొచ్చు. ఇలాంటి చాలా విషయాల్లో విద్యార్థులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామన్నాడు చరణ్. కాలేజీ అప్రోవల్ టీం ఏర్పాటు చేశారు. కంటెంట్ ని ఫైనల్ చేసే బాధ్యత ఆ టీం చూసుకుంటుంది.

స్టుమేగ్జ్ టీం

టీం విషయానికొస్తే శ్రీ చరణ్ లక్కరాజు దీని ఫౌండర్. హైదరాబాద్ టీకేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీచరణ్ ఇన్ఫోసిన్ లో ఉద్యోగం చేశాడు. అక్టోబర్ 2015లో దీన్ని ప్రారంభించాడు. కళ్యాణ్ దీని మరో కోఫౌండర్. ట్రిపుల్ ఐటీ హెచ్ నుంచి ఎంఎస్ చేశాడు. టీంలో మరో కీలక సభ్యుడు ఫ్రెడీ. వైజాగ్ పైడా కాలేజీ నుంచి తను బిటెక్ పూర్తి చేశాడు.

సవాళ్లు

క్యాంపస్ కధలను చెప్పడానికి విద్యాసంస్థలు ముందుకు రావు. సాధారణంగా ఐడియాలను షేర్ చేస్తే అవి మిస్ యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చాలా వాటిని హైడ్ చేస్తుంటారు. ఇలాంటి గ్రేట్ ఐడియాలని, ఇన్నోవేషన్ ని బయటకు తీసుకు రావడం పెద్ద చాలెంజ్. స్టుమేగ్జ్ పూర్తిస్థాయి ఆన్ లైన్ పబ్లికేషన్ గా చూసేవారు షేర్ చేస్తున్నారని శ్రీచరణ్ అంటున్నాడు.

పోటీదారులు, ఆదాయ మార్గాలు

స్థానికంగా పోటీ లేకపోయినా క్యాంపస్ స్టోరీస్ చెప్పే చాలా సంస్థలున్నాయి. చాలా విద్యాసంస్థలు సొంతంగా ఇలాంటి ప్లాట్ ఫాం లను అందిస్తున్నాయి. అయితే అన్ని క్యాంపస్ లను ఏకతాటిపైకి తెస్తున్నామని శ్రీచరణ్ అంటున్నాడు.  

భవిష్యత్ ప్రణాళికలు

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించిన కథలు చెప్పడం ప్రస్తుతానికి టార్గెట్ గా పెట్టుకున్నాం. వెబ్ సైట్ లో అందిస్తున్న కంటెంట్ ఈ ఏడాది చివరి కల్లా యాప్ రూపంలో కూడా లభిస్తుంది. ఫండింగ్ వస్తే దేశ వ్యాప్తంగా సేవలను విస్తరిస్తామని చరణ్ అంటున్నాడు.

website

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories