మెడికల్ టెస్ట్‌లకు డైరెక్టరీగా మారిన ‘డాక్టర్ సి’

70 శాతం మెడికల్ టెస్టులపైనే ఆధారపడుతున్న ట్రీట్‌మెంట్మెడికల్ టెస్టులు చేసే ల్యాబ్ లిస్ట్ ఖర్చులతో సహా వివరాలు అందిస్తున్న ‘డాక్టర్ సీ’హైదరాబాద్‌లో ప్రారంభమై దేశ వ్యాప్తంగా విస్తరించే లక్ష్యం.

0

ఈ కాలంలో అనారోగ్యమంటేనే అదో అతిపెద్ద సమస్య, దానికి కావాల్సిన మెడికల్ టెస్టులు, ఒక్కో సారి ట్రీట్ మెంట్ కన్నఎక్కువ బాధ కలిగిస్తుంది. రాను రాను అనారోగ్య సమస్యలు సున్నితంగా మారడం, డాక్టర్లు కూడా విపరీతమైన టెస్ట్‌లు రాయడం, సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంటుంది.

ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని, మెడికల్ టెస్ట్స్‌లో పారదర్శకత ఉండే విధంగా ఓ మొబైల్ ఇంటర్నెట్ అప్లికేషన్‌ను ప్రారంభించింది ‘డాక్టర్ సి’. మీకు కావాల్సిన టెస్ట్‌ను ఆన్ లైన్ లేదా యాప్‌లో సెర్చ్ చేస్తే చాలు, ఆ సర్విస్ ఇస్తున్న ల్యాబ్ లిస్ట్‌తో పాటు వాటికి అయ్యే ఖర్చు వివరాలు కూడా చూపిస్తుంది. అంతే కాకుండా స్పెషల్ రేట్స్‌లో బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇప్పటికే హైద్రాబాద్లో ఉన్న ఈ కంపెనీ , త్వరలో బెంగుళూరులో కూడా ప్రారంభం కానుంది. 2016 కల్లా దేశ వ్యప్తంగా విస్తరించాలనే ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.

కస్టమర్లు, డయాగ్నాస్టిక్ సెంటర్ల మధ్య అసుసంధానం చేయడానికి స్వర్గీయ డాక్టర్ దయాకర్ రెడ్డి ఈ అప్లికేషన్‌ను ప్రారంభించారు. తరువాత నలుగురు కో ఫౌండర్లు, ఎక్స్ సిలికాన్ వ్యాలీ ఇంజినీర్స్ , ఐవీవై లీగ్ గ్రాడ్యుయేట్స్ గత సంవత్సరం ఈ సంస్ధను తమ టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా అభివృద్ధి చేయడానికి చేరారు.

“ట్రావెల్ వెబ్సైట్స్ లాగే మా పనితీరు కూడా ఉంటుందని అంటున్నారు ‘Dr.C' సీఓఓ మాన్సీ గాంధీ. ప్రైజ్ చెక్ చేసుకోవడం, రివ్యూ రాయడం, టెస్టులను ఆన్ లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు”.

“సామాన్యంగా పేషెంట్స్ వారి డాక్టర్లు రికమండ్ చేసే ల్యాబ్‌కే వెళ్తారని ఉహించే వాళ్లము, కాని ఈ మధ్య చదువుకున్న చాలా మంది పేషెంట్లు పరీక్షలకు వెళ్లే ముందు అన్ని విధాలుగా చెక్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఇలాంటి కస్టమర్లే మా టార్గెట్ గ్రూప్స్”.

డాక్టర్ సీ యాప్ ద్వారా టెస్ట్ బుక్ చేసుకునే వారికి డిస్కౌంట్ కూడా అందే విధంగా పలు డయాగ్నాస్టిక్ ల్యాబ్స్‌తో ఒప్పందం పెట్టుకుంది ఈ కంపెనీ. మార్కెటింగ్, కస్టమర్ సర్విస్, బిజినెస్ డెవలప్మెంట్ లాంటి కార్యకలాపాలు చూడటానికి 20 మంది సభ్యులు ఈ కంపెనీలో పని చేస్తున్నారు.

క్యాలిఫోర్నియాలో అనీల్ ధార్నీ, రామ్ గుడవల్లీ, ఆండ్రూ కీడెల్ నడిపిస్తున్న ‘లెవియాధన్ ఇన్వెస్ట్‌మెంట్స్’ ద్వారా సుమారు 2.5 కోట్ల పెట్టుబడులు రాబట్టగలిగారు. ‘ద్రువా’, ‘స్టే జిల్లా’ లాంటి స్టార్టప్స్ ఉన్న ‘స్పైస్ క్యాపిటల్’, ‘గో నార్త్ వెంచర్స్’ వ్యవస్దాపకులు, ‘ఇండియన్ ఎంజెల్ నెట్వర్క్’ సభ్యులు సంజయ్ జెస్రానీ కూడా డాక్టర్ సి ఇన్వెస్టర్ల్‌గా ఉన్నారు.

ఒక్క సంవత్సరంలో సుమారు 1.4 కోట్ల వార్షిక రన్ రేట్ సాధించిన ‘డాక్టర్ సీ’, 2016 కల్లా డయాగ్నాస్టిక్ మార్కెట్ 10 బిలియన్ డాలర్లు మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తోంది. మన దేశంలో సుమారు 70 శాతం ట్రీట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ల పై ఆధారపడటంతో డయాగ్నాస్టిక్ సర్విసులు మెడికల్ కేర్ లో కీలకమైన పాత్రనె పోశిస్తుంది.

Click here to check out DoctorC’s website and here to download the Android app.

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD