నెట్ లేకుండానే పెద్ద ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసే స్విఫ్ట్

అన్ని రకాల ఫార్మాట్లనూ ట్రాన్స్‌ఫర్ చేసే స్విఫ్ట్బ్లూటూత్ కంటే వేగంగా పనిచేసే సామర్థ్యంమొబైల్ ఫోన్లతో సాధ్యం చేసిన టీమ్ గూగుల్ ప్లే స్టోర్ లో 4.5 స్టార్ రేటింగ్క్లౌడ్ టెక్నాలజీతో వేగం

నెట్ లేకుండానే పెద్ద ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసే స్విఫ్ట్

Friday May 08, 2015,

3 min Read

ఈ- కామర్స్ సైట్లలో ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద సంస్థల సహకారంతో.. స్విఫ్ట్ ఫైల్ ట్రాన్సఫర్ (SFT) యాప్ ఎంట్రీతో మొబైల్ పరికరాలకు, డేటా బదిలీ వినియోగదారులుకు అవకాశం ఇస్తోంది. ఈ ఆప్ ద్వారా ఇంటర్నెట్ సేవలు , బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మొబైల్ నెట్‌వర్క్ లేకుండా ఆండ్రాయిడ్ పరికరాలతో ఈ ఫార్మాట్ ఫైళ్లను ట్రాన్స్‌ఫర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. "ముఖ్యంగా డేటా బదిలీ, వేగంగా కనెక్టివిటీ ఇస్తూ. ఆ పనిని సులభతరం చేయడానికి, డిసెంబర్ 2014 లో SFT ప్రారంభించారు పంకజ్ సింగ్.

image


SFT ఏమిటి ?

SFTతో ఫోటోలు, డేటా ఫోల్డర్లు ఏ సైజులో ఉన్నా.. ఈజీగా పంపించే ఓ సాధానం. అధిక వేగంతో ఫైల్స్ పంపడం వల్ల ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు సహాయపడుతుంది. మ్యూజిక్, వీడియోస్, బొమ్మలును SFT ఉపయోగించి పంచుకోవచ్చు. ఇది Bluetooth కంటే వేగంగా పని చేస్తుంది. దాదాపుగా 50 రెట్లు వేగంగా డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.SFT కు ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా డేటా బదిలీ చేసుకోవచ్చు.


image


బెంగళూరులో చిన్న పారిశ్రామికవేత్తలకు పంకజ్ SlydS అనే ప్రదర్శనకు రూపకల్పన చేశారు. అయితే పంకజ్ ప్రతిష్టాత్మక రక్షణ సేవలకు సంబంధించి సేవలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆయన ముంబై హెచ్ ఆర్ కాలేజీలో బ్యాచిలర్ మేనేజ్ మెంట్ ఆఫ్ స్టడీస్ ఎంచుకున్నారు. ఇక SFT సహ వ్యవస్థాపకుడు కునాల్ మహాజన్ ఇంజనీర్‌గా ఎల్లప్పుడూ ప్రోగ్రామింగ్ పట్ల ఆసక్తి ఉండేది. ఆయన అనేక API లు SDKs అభివృద్ధితో అనేక సంస్థల్లో టెక్నికల్ టీమ్స్‌లోఉండేవారు. 2013 లో ఆయన సుమారు 3300 డాలర్ల పెట్టుబడితో కుమి లాబ్స్‌ను విలీనం చేశారు. Kumilabs అప్పటికే అనేక గేమ్స్ , అప్లికేషన్లను డెవలప్ చేసింది. దాదాపు నెలకు 40 మిలియన్ల కంటే ఎక్కువ డౌన్ లౌడ్లు అయ్యేవి. వాటి ద్వారా 10 మిలియన్ల కంటే యాడ్ రిక్వెస్ట్ లు ఉండేవి.

image


పంకజ్ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, కునాల్ ఇలా అన్నారు "నేను 2013 మధ్యలో బెంగళూరు లోని ప్రారంభ కార్యక్రమంలో పంకజ్‌ను కలుసుకున్నాను. త్వరలో SFT ప్రారంభించడానికి ప్రణాళిక , నైపుణ్యం భాగస్వామ్యం పై ఇద్దరం చర్చించాం. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండడంతో అనుకున్నది సాధ్యమైంది. "

ఆలోచన

ఫాస్ట్ అండ్ వైర్లెస్ ద్వారా ఫైల్ బదిలీ చేయాలనే ఆలోచనకు మొదలైన నాటి నుంచి దానిపై పనిచేయడం మొదలు పెట్టారు. పంకజ్ ఆలోచన ఆఫ్ బౌన్స్ ఆగస్టు 2014 లో కునాల్‌కు వచ్చింది. సర్వేలు నిర్వహించడం, రీసెర్చ్ డిజైన్ చేసిన తరువాత డేటా పంపించడం ప్రారంభించారు. వినియోగదారుల ఫైళ్లను, డేటా, Wi-Fi, ని ఉపయోగించుకోవడంపై కూడా ఆలోచించారు. SFT ని డిసెంబర్ 2014లో Google ప్లే స్టోర్ లో ప్రారంభించామని కునాల్ చెప్పారు . "మేము టెక్నికల్ గా ఎండ్ యూజర్ వరకు సర్వ్ చేయాలనుకుంటున్నామని" తెలిపారు. ఎప్పటికప్పుడు మా ఉత్పత్తిని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారుల్లో నమ్మకం కల్గించే పని కొనసాగిస్తున్నామన్నారు. "మేము మా వినియోగదారులు ఏది ఆశిస్తారో వారికి అది అందించే పని చేస్తామని వివరించారు. "

image


SFT వేగంగా మార్కెట్లో వెళ్లున్న యాప్. SDK రాసిన తర్వాత యాప్ పై టీమ్ కు నమ్మకం పెరుగుతోంది. "ఎవరైనా క్లౌడ్ ద్వారా సులభంగా ఫైళ్ళు పంచుకోవచ్చు కాబట్టి అప్లికేషన్‌లో క్లౌడ్ భాగస్వామ్య లక్షణాలను సమగ్రపరిచాం'' అంటూ చెప్పుకొచ్చారు కునాల్. డేటా యాక్సెస్, USB డ్రైవ్, ఫోన్ వినియోగదారులకు యాప్ అనుమతిస్తుంది. డెస్క్ టాప్ వెర్షన్ అందించేందుకు కృషి చేస్తున్నాం. డేటా డౌన్ లౌడ్, పరిశోధన విశ్లేషణల ఆధారంగా SFT వినియోగించే వారు 18-30 సంవత్సరాల వయస్సు కలవారిగా గుర్తించారు. ఈ విభాగంలో చిత్రాలు, వీడియోలు వంటి డేటా బదిలీతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇంకా ఈ డేటా బదిలీకి సుమారు ఐదు నిమిషాల సగటున ప్రతి సెషన్ లో Google Play లో 4.5 స్టార్ రేటింగ్ ఉంటుంది.

భవిష్యత్తు ప్రణాళికలు

ఐఫోన్, Windows మొబైల్ కోసం అప్లికేషన్ లాంచ్ చేయనున్నారు. "మా వినియోగదారులు, గెలుచుకున్న అవార్డులు, ప్రశంసలు పొందిన తరువాత, PC వెర్షన్ అభివృద్ధి ప్రారంభించామని పంకజ్ చెప్పారు. SFT మొబైల్ ప్రీమియర్, హాట్ అవార్డ్ వంటి పురస్కారాలు అందుకుంది. ఇంకా పబ్లిక్ ఓటింగ్ లో అత్యధిక రేటింగ్ మొబైల్ Appగా SFT నిలుస్తోంది.