భాగ్యనగరంలో యాపిల్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్

0

మేకిన్ ఇండియాలో హైదరాబాద్ జాక్ పాట్ కొట్టింది. వరల్డ్ ఫేవరేట్ మొబైల్ ఫోన్ తయారీ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. తెలంగాణ ఐటీ మంత్రి కెటిఆర్ ఇదే విషయంపై తన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణాకు అన్ని శుభ సూచకాలే అని ఆయన వ్యాఖ్యానించారు.

170కోట్ల పెట్టుబడులు

25మిలియన్ అమెరికన్ డాటర్ల పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నట్లు యాపిల్ అధికార వర్గాలు తెలిపాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు 170 కోట్లు. దీని ద్వారా ప్రత్యక్షంగా 4500 ఉద్యోగాలు లభిస్తుండగా.. మరో 5వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. టిష్మన్ స్పేయర్స్ వేవ్ రాక్స్ లో ఇప్పటికే యాపిల్ సంస్థ రెండులక్షల యాభై చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటికే తీసుకుంది . దీని నుంచే ఈ ఏడాది జూలై నుంచి కార్యాలయం పనులు ప్రారంభం కానున్నాయి. భారత్ లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని యాపిల్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే యాపిల్ ఫైనల్ డెస్టినేషన్ మన భాగ్యనగరం కావడం విశేషం.

అమెరికా తర్వాత మొదటి డెవలప్ మెంట్ సెంటర్

హైదరాబాద్ కాలిఫోర్నియా తర్వాత మొదటి డెవలప్ మెంట్ సెంటర్ గా మారనుంది. మైక్రో సాఫ్ట్, గూగుల్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ ఇప్పటికే తమ కార్యాలయాలను తెరిచాయి. దేశ ఐటి రాజధానిగా ఉన్న బెంగళూరుకు కాకుండా హైదరాబాదే వాటికి సైతం మొదటి ఆఫ్షన్ కావడం, ఇప్పుడు యాపిల్ కూడా మన హైటెక్ సిటీ లోనే కార్యాలయం ప్రారంభించనుందన్న మాట.యాపిల్ కార్యాలయం ఏర్పాటును ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ కన్ఫర్మ్ చేశారు.

“ఇంతకు ముందే నిర్ణయించుకున్నారు. అన్ని సమావేశాలు జరిగిన తర్వాత యాపిల్ కార్యాలయం నుంచి మాకు కన్ఫర్మేషన్ వచ్చింది,” జయేష్ రంజన్

ఇప్పటికే యాపిల్ కార్యాయం ఏర్పాటు పై మాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు అధికారికంగా కన్ఫమ్ చేస్తున్నట్లు జయేష్ రంజన్ చెప్పుకొచ్చారు.

ఆగస్ట్ నుంచి కార్యకలాపాలు

స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థ టిష్మన్ స్పేయర్స్ వేవ్ రాక్స్ తో యాపిల్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. ఇక్కుడే ఈ సంవత్సరార్థంలో 150 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ ర శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. అన్నీ అనుకూలంగా జరిగితే మరో నాలుగైదు నెలల్లో యాపిల్ మ్యాప్ పై హైదరాబాద్ డెవలప్ మెంట్ సెంటర్ కనపడునుందన్న మాట

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik