మీరు భాషాభిమానులా..! అయితే రండి.. డిజిటల్ గ్యాప్ పూరిద్దాం..!!  

యువర్ స్టోరీ మీకు స్వాగతం పలుకుతోంది..!!

0

ఇంటర్నెట్ వినియోగం బీభత్సంగా పెరిగిపోయింది. నెట్టింట్లో కూర్చునే పనులన్నీ చక్కబెడుతున్నారు. తిండి లేకపోయిన ఫరవాలేదుగానీ.. ఒక్క నిమిషం నెట్ లేకపోతే అల్లాడిపోయే పరిస్థితి. ఈ లెక్కన 2018 కల్లా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వినియోగదారులు 280 మిలియన్లకు చేరుకుంటారని రఫ్‌ అంచనా. 2014 జూన్ లో రూరల్ ఇండియాలో 60 మిలియన్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగడమే అందుకు నిదర్శనం. అయితే ఇంటర్నెట్ విప్లవాన్ని కంపెనీలు, స్టార్టప్స్ మార్కెట్‌ను ఎంతవరకు అందిపుచ్చుకుంటాయి? బహుభాషల్లో సైట్లను ఇంటర్నెట్ కంపెనీలు ఎలా తట్టుకోగలవు?

ఇంటర్నెట్ విస్తరించింది. మారుమూల గ్రామాలకు కూడా బ్రాడ్ బాండ్ సేవలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో కార్పొరేట్ కంపెనీలు స్థానిక భాషలపై దృష్టిపెట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి దిగ్గజాలు లోకల్ మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్థానిక భాషల్లో ప్రకటనలు, కంటెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి.

ఇండియా- భారత్. ఈ రెండింటి మధ్య డిజిటల్ గ్యాప్ కావల్సినంత ఉంది. అది పూరించడానికి యువర్ స్టోరీ ఈ బాధ్యతను తలకెత్తుకుంది. ఇప్పటికే యువర్ స్టోరీ.కామ్ ఇంగ్లీష్ తో పాటూ 12 భారతీయ భాషల్లో వెబ్ సైట్ రన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో యువర్ స్టోరీ భాష పేరుతో ఇండియన్ లాంగ్వేజెస్ డిజిటల్ ఫెస్టివల్ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి 11న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యువర్ స్టోరీ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు, స్థార్టప్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్నెట్ లో స్థానిక భాషల ప్రాముఖ్యతపై ప్రసంగిస్తారు. గూగుల్, షియోమీ, మైక్రోమాక్స్, బాబాజాబ్స్ , ప్రథమ్ బుక్స్, రివేరి లాంగ్వేజ్‌ టెక్నాలజీస్, రేడియో మిర్చీ లాంటి సంస్థలు లోకల్ లాంగ్వేజ్ స్ట్రాటజీ మీద అభిప్రాయాలు షేర్ చేసుకుంటాయి. భాషా నిపుణులు, పాలసీ మేకర్స్, అకాడమిస్టులు, రచయితలు డిజటల్ డెమోక్రటైజేషన్ స్థానిక భాషలను ఏకతాటిపైకి తెచ్చే శక్తిగా ఎలా ఉపయోగపడతాయో వివరిస్తారు.

వాటితో పాటుగా డిజిటల్ స్పేస్ ద్వారా భాషా సమస్యలను ఎలా అధిగమించ వచ్చో ముంబై గ్రూప్ మాటి-బాణిల ప్రదర్శన ఉంటుంది.

సో, మీకూ ఇండియన్ లాంగ్వేజెస్ మీద అభిమానం, స్థానిక భాషలపై పట్టుంటే.. భాషా ఫెస్టివల్ రండి.. యువర్ స్టోరీ మీకు స్వాగతం పలుకుతోంది.

ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

Related Stories