గ్రామీణ ఉత్పత్తులకు బి-స్కూల్ స్టూడెంట్స్ మార్కెటింగ్

గ్రామీణ క‌ళాకారుల‌ను ఆదుకుంటున్న లాల్‌టెన్‌క‌ళాకారులు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యిస్తున్న మ‌నీత్‌గ్రామీణ ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ అవ‌కాశం క‌ల్పిస్తున్న సంస్థ‌సంప్ర‌దాయ ఉత్ప‌త్తుల గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి వివ‌రిస్తున్న లాల్‌10రోజుకు లాల్‌10ను సంద‌ర్శిస్తున్న వెయ్యిమంది క‌స్ట‌మ‌ర్లుక‌ళాకారుల‌ను ఆదుకుంటూ క‌ళాకృతుల‌కు జీవం పోస్తున్న మ‌నీత్‌, స‌య్య‌ద్‌

గ్రామీణ ఉత్పత్తులకు బి-స్కూల్ స్టూడెంట్స్ మార్కెటింగ్

Saturday August 22, 2015,

5 min Read

భార‌తీయ ఉత్ప‌త్తులంటే ప్ర‌పంచ ప్ర‌సిద్ధి. గ్రామీణ క‌ళాకారులు త‌యారు చేసే ప్రాడ‌క్ట్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే ఈ ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో క‌ళాకారులు క‌ళ‌ల‌ను వ‌దులుకుని ప‌ట్ట‌ణాల బాట ప‌డుతున్నారు. అయితే ఇలాంటి క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు మ‌నీత్‌. 'లాల్‌10' పేరుతో ఈ పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేసి గ్రామీణ క‌ళాకృతుల‌కు మార్కెటింగ్ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు.

మ‌నీత్ గోహిల్‌కు ట్రావెలింగ్, ప్ర‌జ‌ల‌తో మాట్లాడడం ఎంతో ఇష్టం. ఆ ఇష్ట‌మే చేనేత‌, హ‌స్త‌క‌ళ‌లు, వివిధ రాష్ట్రాల‌కు చెందిన ఫుడ్ ప్రాడ‌క్ట్స్ మార్కెటింగ్ కోసం లాల్‌10పేరుతో ఓ పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేయించింది. " ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రంలోని ఔరియా జిల్లా 80 మంది నివాస‌ముండే ప‌టా గ్రామాన్ని సంద‌ర్శించాను. ఆ ఊరి ప్ర‌జ‌లు.. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎన్జీఓ సాయంతో శిక్షణ పొంది చేతితో నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తున్నారు. వాటిని అతి త‌క్కువ ధ‌ర‌కు అమ్ముతున్నా, మార్కెటింగ్ చేయ‌డం మాత్రం చాలా క‌ష్టం ఉంద‌ని వారు ఆవేద‌న చెందారు " అంటారు మనీష్.

రాజ‌స్థాన్ చండేలోకు చెందిన క‌ళాకారులు

రాజ‌స్థాన్ చండేలోకు చెందిన క‌ళాకారులు


మ‌నీత్ త‌న రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం తిరుగుతూ... గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్య జీవ‌నాధారంగా ఉన్న హ్యాండీక్రాఫ్ట్‌, హ్యాండ్లూమ్ సెక్టార్ గురించి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం దేశంలో 70 ల‌క్ష‌ల మంది ఈ క‌ళాకృతులు చేసుకుంటూ కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అన‌ధికారంగా 2 కోట్ల మందికి ఇవే జీవ‌నాధారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, అసోం, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క ఇలా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి క‌ళాకారుల‌ను క‌లిసిన అనుభ‌వం మ‌నీత్‌కు ఉంది. క‌ళ‌ల‌ వార‌స‌త్వ‌నికి ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు తీసుకురావాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న గుర్తించారు. అంతేకాదు అంప‌శ‌య్య‌పై ఉన్న‌ ఈ అద్భుత‌ క‌ళలు అంత‌రించిపోకుండా కాపాడి, క‌ళాకారుల‌కు స్థిర‌మైన ఆదాయం క‌ల్పించేందుకు ఆయ‌న సిద్ధ‌ప‌డ్డారు.

అసోం నేత కార్మికురాలు

అసోం నేత కార్మికురాలు


మ‌నీత్ చేప‌ట్టిన ఈ మ‌హోన్న‌త కార్య‌క్ర‌మంలో తానూ భాగ‌స్వామి అయ్యారు స‌య్య‌ద్‌. లాల్‌10లో చేరేందుకు త‌న‌ను పురికొల్పిన అంశాల‌ను ఆయ‌న వివ‌రించారు. " గ్రామీణ క‌ళాకారులు, పట్ట‌ణ క‌స్ట‌మ‌ర్ల మ‌ధ్య గ్యాప్‌ను తొల‌గించాల‌న్నది సాహ‌సోపేత‌మైన ఆలోచ‌న‌. సుదూర లాజిస్టిక్స్‌, ప్రామాణిక‌త గుర్తింపు, నాణ్య‌త‌ను కొన‌సాగించ‌డం వంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కృషి కొన‌సాగుతూనే ఉంటుంది. అలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌టం, ఈ ఫీల్డ్ కూడా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండ‌టంతో మ‌నీత్‌తో పాటు నేను చేరాను.

పేరు వెనుక క‌థ‌

ఈ పోర్ట‌ల్‌కు లాల్‌10 పేరు పెట్ట‌డ వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. త‌న ప‌నిమీద ప‌లు ప్రాంతాల‌ను మ‌నీత్ సంద‌ర్శించారు. అన్ని గ్రామాల్లో కామ‌న్‌గా ఉన్న స‌మ‌స్య విద్యుత్ కోత‌లు. చాలా గ్రామాల్లో క‌రెంట్ లేక‌పోవ‌డంతో లాంత‌ర్లు వెలిగిస్తున్నారు. లాన్‌త‌ర్‌ అన్న పేరును ధ్వ‌నించేలా లాల్‌టెన్‌(లాల్‌10) అని త‌న సంస్థ‌కు పేరుపెట్టార‌య‌న‌. ఓ వైపు ధూష‌ణ‌లు భ‌రిస్తూ కూడా మ‌హిళా క‌ళాకారిణులు త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం ఎలా క‌ష్టిస్తారో కూడా త‌న ప్ర‌యాణంలో మ‌నీత్ తెలుసుకున్నారు.

"మ‌న గ్రామీణ క‌ళాకారుల జీవితాల్లో వెలుగులు నింపాల‌న్న ఉద్దేశంతోనే సంస్థ‌కు లాల్‌10 అనే పేరు పెట్టాను" అని మ‌నీత్ వివరించారు.
తాము త‌యారు చేసిన హ్యాండ్‌బ్యాగ్‌ల‌తో రాజ‌స్థానీ మ‌హిళ‌లు

తాము త‌యారు చేసిన హ్యాండ్‌బ్యాగ్‌ల‌తో రాజ‌స్థానీ మ‌హిళ‌లు


ఏంటి వీళ్ల మోడల్ ప్రత్యేకత

లాల్‌10కు ఓ స్టూడెంట్ క‌మ్యునిటీ ఉంది. అది ఉత్ప‌త్తులు, విక్ర‌య‌దారుల గురించి ప‌రిశోధ‌న జ‌రిపి వారిని చేరుకుంటుంది. అలా త‌మ ఇన్వెంట‌రీని వృద్ధి చేసుకుంటుంది. అలాగే ఆర్టిసన్స్ ఫొటోలు, వీడియో ఇంట‌ర్వ్యూల‌ను విద్యార్థులు తీసుకుంటారు. మార్కెటింగ్ కోసం వాటిని సోష‌ల్‌మీడియాలో పెడ్తారు. " తాము కొనుగోలు చేసిన క‌ళాకృతి ఎక్క‌డ నుంచి వ‌చ్చిందో క‌స్ట‌మ‌ర్ తెలుసుకోవ‌డం కూడా ముఖ్య‌మే. ఏ ప‌రిస్థితుల్లో, ఏ ఉద్దేశంతో క‌ళాకారులు దాన్ని రూపొందించారో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం వారికి ఉంది "

డిజైన్ ఇన్‌పుట్స్‌

నిఫ్ట్‌కు చెందిన స్టూండెంట్ ఎంప్లాయిస్ మ‌రింత అందంగా ఉత్ప‌త్తుల‌ను తీర్చి దిద్ది పోర్ట‌ల్లో మ‌రింత సౌంద‌ర్యంగా క‌నిపించేలా చేస్తారు. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్న స్టూడెంట్ క‌మ్యునిటీ సాధార‌ణంగా సోర్సింగ్‌ను మ్యానేజ్ చేస్తుంది.

జీవ‌న పోరాటం

"జీవితం కుటుంబ పోష‌ణ కోసం క‌ళాకారులు ప‌డుతున్న శ్ర‌మ అంతా ఇంతా కాదు. ఈ ప‌నుల‌తోనే వారికి స‌మ‌యం గ‌డిచిపోతున్న‌ది. అభివృద్ధి, భ‌విష్య‌త్‌ల గురించి ఆలోచించే తీరికే వారికి ఉండ‌దు. ఈ వెంచ‌ర్‌లో చేరిన త‌ర్వాత ఈ విష‌యం నాకు అర్థ‌మైంది. లాల్‌10 లాంటి అవ‌కాశాలు ఇప్పుడు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఇలాంటి సంస్థ‌లు క‌స్ట‌మ‌ర్ల‌ను చేరుకునేందుకు కొద్దిస్థాయిలో స్థిరంగా స‌హ‌క‌రిస్తున్నాయి" అని స‌య్య‌ద్ వివ‌రించారు. క‌ళాకారులు స్థిర‌మైన ఆదాయం పొంది, పోరాట సంకెళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు లాల్ టెన్ సాయం చేస్తున్న‌ది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌టాలోని మ‌హిళా క‌ళాకారిణులు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌టాలోని మ‌హిళా క‌ళాకారిణులు


దేశీ లుక్‌

భార‌త దేశ క‌ళాకండాలంటే చాల‌మందికి చాలా ఆస‌క్తి ఉంది. అంద‌మైన ఎత్నిక్ క్లోతింగ్స్, కేన్‌, టెర్ర‌కోట జ్యుయ‌ల‌రీల‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త‌మ గృహాల‌కు దేశీ లుక్ ఇవ్వాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. అయితే స‌రైన‌, నాణ్య‌మైన ఉత్ప‌త్తులు ల‌భించ‌క‌పోవ‌డ‌మే అన్నిటికంటే పెద్ద స‌మ‌స్య‌. ఐతే ఇలాంటి నాణ్య‌మైన, దేశీయంగా త‌యారైన ఉత్ప‌త్తుల‌ను ఒకే చోట‌, అది కూడా ఇంటివ‌ద్దే ఉండి కొనుగోలు చేసే అవ‌కాశాన్ని లాల్‌10 క‌ల్పిస్తోంది" అని స‌య్య‌ద్ వివ‌రించారు.

స‌మిష్టి కృషి..

తానొక్క‌డినే క‌ళ‌కారులంద‌రినీ ఒకేచోట‌కు చేర్చ‌డం సాధ్యం కాద‌ని వ్యాపారంలోకి ప్ర‌వేశించిన‌ ఆరంభంలోనే మ‌నీత్ గ్ర‌హించారు. ఉద్యోగులు, పార్ట్‌న‌ర్స్ కోసం బిజ‌నెస్ స్కూల్స్‌, ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల చుట్టూ తిరిగారాయ‌న‌. ప్ర‌స్తుతం లాల్‌10లో 28 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఎంటీలు, ఐఐఎంల‌కు చెందిన విద్యార్థులే.

రెవెన్యూ మోడ‌ల్‌, చాలెంజెస్‌

లాల్‌10కు ప్ర‌తిరోజు వెయ్యి విజిట్స్ న‌మోద‌వుతాయి. అందులో 4 నుంచి 5 శాతం ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇక సంస్థ సొంత మూల‌ధ‌నంతోనే ఆరంభ‌మైంది. సంస్థ‌ను ఆరంభించిన కొత్త‌లో కొన్ని క‌ష్టాలు ఎదురైనా ఇప్పుడు మాత్రం మంచి లాభాల‌ను ఆర్జిస్తున్న‌ది. ప్రామాణిక‌త క‌లిగిన ఉత్ప‌త్తులను త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యిస్తూ పోటీదారుల‌పై పైచేయి సాధిస్తున్న‌ది. మ‌రింత‌ సుల‌భంగా నిధుల ప్ర‌వాహం కోసం ఇటీవ‌లే బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) విధానంలోకి ప్ర‌వేశించింది.

"ప్ర‌తినెలా 6 వేల ఉత్ప‌త్తుల‌ను ఇచ్చేందుకు ఇటీవ‌లే ఒప్పందం కుదుర్చుకున్నాం. అలాగే బీ2బీ విధానంలోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాం" అని మ‌నీత్ తెలిపారు. ఈ సంస్థ‌కు అటు ప్ర‌భుత్వం నుంచి కానీ ఇటు వేరే సంస్థ‌ల నుంచి ఎలాంటి నిధులు రావ‌డం లేదు.

" అయితే ఇత‌ర సంస్థ‌ల నుంచి భ‌విష్య‌త్‌లో మ‌ద్ద‌తు తీసుకుంటాం" అని మ‌నీత్ తెలిపారు.

గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లు రూపొందించిన పేప‌ర్ ప్రాడొక్ట్స్‌తో చిన్నారులు

గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లు రూపొందించిన పేప‌ర్ ప్రాడొక్ట్స్‌తో చిన్నారులు


ఉత్ప‌త్తుల‌ను తీసుకునే ద‌గ్గ‌రి నుంచి లాజిస్టిక్స్‌కు పేపెంట్ జ‌రిపే వ‌ర‌కు ప్ర‌తి అడుగులోనూ మ‌నీత్‌, స‌య్య‌ద్ ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొన్నారు. వాటికి ప‌రిష్కారాలు క‌నుగొంటూ స‌వాళ్ల‌ను ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేశారు. ఈ అవ్యవస్థీకృత రంగంలో నిధులు కూడా చాలా ప‌రిమితం. నిధుల ప్ర‌వాహం పెరిగితే ఒక్క రాష్ట్రానికి చెందిన క‌ళాకారుల‌ను ఒకే సారి ఆదుకోవ‌డంపై ప్ర‌య‌త్నాలు జ‌రుపుతామంటున్నారు వారు. " ఏడాదిన్న‌ర నుంచి ఈ రంగాన్ని ప‌రిశీలిస్తున్నాం, ప‌రిశోధిస్తున్నాం, ప‌నిచేస్తున్నాం. స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుంటూ, ప‌రిష్కారాల‌ను క‌నుగొంటున్నాం" అని మ‌నీత్ తెలిపారు.

క‌ళాకృతుల‌ను సిద్ధం చేస్తున్న గుజ‌రాతీ మ‌హిళ‌

క‌ళాకృతుల‌ను సిద్ధం చేస్తున్న గుజ‌రాతీ మ‌హిళ‌


లాల్‌10ను ఏర్పాటు చేసిన యువ‌కులిద్ద‌రికీ ఓ క‌ల ఉంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న 70 ల‌క్ష‌ల మంది క‌ళాకారుల‌ను ఒకే వేదిక మీద‌కు తీసుకొచ్చి, వారి ఉత్ప‌త్తుల‌ను ప్రపంచ‌స్థాయిలో ప్ర‌ద‌ర్శించాల‌ని. త‌ద్వారా ఆదాయాన్ని ఆర్జించి, క‌ష్టాల్లో ఉన్న కార్మికుల‌ను ఆదుకోవాల‌న్న‌దే వారి ల‌క్ష్యం. చాలామంది క‌ళాకారులు జీవ‌నోపాధి కోసం త‌మ సొంత గ్రామాల‌ను వ‌దిలి ఉద్యోగాలు చేసేందుకు ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వెళ్తున్నారు. " మా టెక్నిక‌ల్ ఉద్యోగులు, స‌ప్ల‌య్ చైన్ ఉద్యోగుల స‌హ‌కారంతో ఈ అసంఘ‌టిత రంగాన్ని సంఘ‌టిత రంగంగా మారుస్తాం. ఈ కామ‌ర్స్ రంగంలో పెద్ద స్థానంలో ఉన్న కంపెనీల మాదిరిగానే మా సంస్థ భ‌విష్యత్ కూడా బాగుంటుంద‌ని నా ప్ర‌గాఢ న‌మ్మ‌కం"‌ అని మ‌నీత్ అన్నారు.

చీర‌ నేస్తున్న అసోం నేత కార్మికుడు

చీర‌ నేస్తున్న అసోం నేత కార్మికుడు


ఓ సారి త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని మ‌నీత్ యువ‌ర్‌స్టోరీతో పంచుకున్నారు."రాంచీకి స‌మీపంలోని ఓ గ్రామంలోని క‌ళాకారుడితో స‌మావేశం నాకు ఇప్ప‌టికీ గుర్తింది. మాతో క‌లిసి ప‌నిచేసేందుకు అత‌నెంతో ఉత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. బీ2బీ కార్పొరేట్ గిఫ్టింగ్ ఆర్డ‌ర్ల‌ను ఒప్పుకోవ‌డం వెనుక అత‌ని ఒత్తిడే ఉంది. ఆ ఒప్పందం కార‌ణంగా ఆ గ్రామంలోని స‌గం మంది క‌ళాకారుల‌కు జీవనోపాధి ల‌భించింది. ఒక క‌ళాకారుడి నుంచి ఆ వ్య‌క్తి ఇప్పుడు ఎలాంటి క‌మీష‌న్ తీసుకోని మ‌ధ్య‌వ‌ర్తిగా మారిపోయాడు. త‌మ ఉత్ప‌త్తుల‌కు మంచి విలువ క‌ట్టే వ్య‌క్తుల‌కు తాము త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించేందుకు అత‌ను, ఆ గ్రామ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు" అని మ‌నీత్ తెలిపారు.

వెబ్‌సైట్ఃhttp://lal10.com/