పరుపుల మార్కెట్‌లో దుమ్మురేపుతున్న సండేరెస్ట్‌

పరుపుల మార్కెట్‌లో దుమ్మురేపుతున్న సండేరెస్ట్‌

Wednesday December 02, 2015,

3 min Read

రోజంతా ఎంత కష్టపడినా.. రాత్రికి సుఖంగా నిద్రపోలేకపోతే వేస్ట్. అందుకే.. స్లీపింగ్ మాట్రెస్ మార్కెట్ ఇండియాలో గత దశాబ్దకాలంగా చాలా వేగంగా విస్తరిస్తోంది. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు దీనిపై దృష్టిపెడుతున్నాయి. రకరకాల ప్రొడక్ట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే, రేటు పరంగానూ.. క్వాలిటీ పరంగానూ అన్ని ప్రొడక్ట్స్ మధ్య ఉండే చాలా తక్కువ డిఫరెన్స్ కస్టమర్లను గందరగోళానికి గురిచేసేస్తున్నాయి. ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేయాలన్నా పెద్దగా తేడా కనిపించకపోవడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. అందుకే, అప్పటికే అదే మార్కెట్ని కొట్టాలని ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి కొత్త కాన్సెప్ట్‌తో కేక‌ పుట్టించాడు.

అల్ఫాన్సే రెడ్డి. 2011లో Fabmart అనే మాట్రెస్ తయారుచేసే కంపెనీని మొదలుపెట్టాడు. 2014 మధ్యలో SundayRest అనే కాన్సెప్ట్పై దృష్టిపెట్టాడు. దాదాపు ఏడాదిపాటు దానిపై రీసెర్చ్ చేసి.. ఫైన‌ల్‌గా మార్కెట్లోకి తీసుకువచ్చారు. Pennywise అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కోడైరక్టర్ ఆనంద్ మోర్జారియాతో పాటు మరికొందరు దాదాపు 16 కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేశారు.

image


"అన్ని స్టార్టప్స్ ఎదుర్కొన్న సమస్యలే మాకూ ఎదురయ్యాయి. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ దగ్గర్నుంచి, ఉద్యోగులను తీసుకోవడం, అమ్మకందారులను కలుపుకుని వెళ్లడం, మార్కెటింగ్.. ఇలా ప్రతీచోటా సవాళ్లు ఎదుర్కొన్నాము. చివరగా స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాము. అతిపెద్ద పోటీదారులున్న ఈ మార్కెట్లో.. అతితక్కువ పెట్టుబడితో నెగ్గుకురావాలన్న సంకల్పం బలంగా ఉంది. అందుకు.. మా ఉద్యోగులు, టీమ్ అందరూ సపోర్ట్ చేశారు"

తయారీ వ్యవస్థ

మాట్రెస్ తయారీలో సాధారణంగా కమ్ఫర్ట్ లేయర్, సపోర్ట్ లేయర్, బేస్ లేయర్ అనే మూడు (లేయర్స్) పొరలుంటాయి. అందులో కూడా 30 రకాల కాంబినేషన్లు ఉంటాయంటారు అల్ఫాన్సే రెడ్డి. అయితే, ఈ 30 రకాల కాంబినేష‌న్స్‌లో ఎలాంటిది కావాలన్నా ఈజీగా తయారుచేయగలిగే Prototypeను సండేరెస్ట్ ఇప్పుడు తయారుచేస్తోంది. 2014లో కేవలం హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని కొంతమంది కస్టమర్లను గుర్తించి.. వారి అవసరాలకు తాము తయారుచేస్తున్న మ్యాట్రెస్‌లు ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయో చూసుకున్నారు. ప్రొడ‌క్ట్ త‌యారీలో అయినా డిజైన్ అనేది కీలక పాత్ర పోషిస్తుందంటారు అల్ఫాన్సే రెడ్డి.

ఉదాహరణకు భారత వాతావరణంలో పరుపులపై చెమట మరకలు చాలా కామన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని పరుపులపై రిమూవబుల్ జిప్‌క‌వ‌ర్‌ను ఏర్పాటుచేశాం అంటారు అల్ఫాన్సే

ఇక మెటీరియల్ విషయానికొస్తే..బెల్జియంలో అత్యాధునిక పద్ధతులతో తయారయ్యే కంపెనీల నుంచే వందశాతం దిగుమతులు జరుగుతాయని అంటున్నారు అల్ఫాన్సే. మ్యాట్రిస్ తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన Oeko-Tex 100 సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్‌ని వినియోగిస్తున్నారు. సండేరెస్ట్ మొట్టమొదటగా తయారుచేసిన LatexPlus, LGA సర్టిఫికేషన్ సొంతం చేసుకుని 100కి 90మార్కులు తెచ్చుంది. పెద్దమొత్తంలో ముడిపదార్థాలను యురోపియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుని, హిరోకో షిరాటోరీ అనే ప్రఖ్యాత డిజైనర్ ఆధ్వర్యంలో తయారీ మాత్రం భారత్లో చేస్తోంది సండేరెస్ట్.


image


ధరలు

ప్రస్తుతానికి సండేరెస్ట్ రెండురకాల పరుపులను తయారుచేస్తోంది. అందులో ఒకటి రూ.17,990 విలువగల Ortho Plus మ్యాట్రెస్. రెండవది Latex Plus. దీని ధర రూ.34,490. సర్టిఫికేషన్ పొందని ఇతర కంపెనీల Latex మ్యాట్రెస్ ధర మార్కెట్లో రూ.75వేల నుంచి రూ.80వేల వరకూ ఉందంటోంది కంపెనీ.! కొన్ని కంపెనీలు చేస్తున్నట్టు ధర తగ్గించి డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించే పద్ధతికి తాము విరుద్ధమని అంటారు అల్ఫాన్సే రెడ్డి. డిజిటల్ అడ్వ‌ర్ట‌యిజింగ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టకుండా టీవీ, న్యూస్‌ పేప‌ర్ల‌ ద్వారా తమ Products అడ్వర్టయిజ్ చేస్తున్నారు. బెంగళూరులో Shippr, Portr లాంటి సంస్థలతో కలిసి డెలివరీ చేస్తోంది సండేరెస్ట్. బెంగళూరులో అయితే అదే రోజు డెలివరీ చేస్తుంటే.. మిగతా ప్రాంతాలకు వారంలోగా పంపుతున్నారు.

మిగతా కంపెనీలకంటే భిన్నంగా 100రోజుల పాటు మ్యాట్రెస్ వాడుకున్న తర్వాత నచ్చకపోతే పూర్తిగా డబ్బులు తిరిగి చెల్లిస్తోంది సండేమ్యాట్రెస్.


image


కంపెనీ పనితీరు - ఉద్యోగులు

ఫైనాన్స్, డిజైన్, మార్కెటింగ్‌కు ప్రస్తుతానికి 100మంది ఉద్యోగులు ఉన్నారు.ఇక మ్యాట్రెస్‌ల‌ తయారీకోసం ఖర్చు తగ్గించుకునేలా మరో 100మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వినియోగిస్తోంది కంపెనీ. సంస్థలో పనిచేసే ఉద్యోగులంతా గతంలో Fabmart, Flipkart, KFC, Peter England, Delta Partnersలాంటటి పెద్దపెద్ద కంపెనీల్లోExperience ఉండి..BITS Pilani and INSEAD, Franceలాంటి విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్లు పూర్తిచేశారు.

ఫ్యూచర్ ప్లాన్స్

Sunday Sleep Loungeపేరుతో బెంగుళూరులో ఒక Experience Centre ఏర్పాటుచేశారు.రాబోయే రోజుల్లో మరో మూడు నాలుగు ప్రాంతాల్లో ఇలాంటి సెంటర్లు ఓపెన్ చేయాలన్నది ప్లాన్.! మరికొద్దికాలంలో హైదరాబాద్, చెన్నయ్, కొచ్చి, ముంబై ప్రాంతాలకు కూడా తమ కంపెనీని విస్తరించాలని భావిస్తున్నారు.