ఆన్‌లైన్‌లో పిల్ల తల్లులకు సలహా ఇచ్చే 'కిడ్స్‌ స్టాప్‌ ప్రెస్'

ఆన్‌లైన్‌లో పిల్ల తల్లులకు సలహా ఇచ్చే 'కిడ్స్‌ స్టాప్‌ ప్రెస్'

Sunday August 23, 2015,

4 min Read

ఆన్‌లైన్‌లో పిల్లల పెంపకంపై సలహాలిచ్చే సైట్లు బోలెడు.

కానీ మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉండవు.

చిల్డ్రన్ యాక్టివిటీస్‌కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం ఎలా ?

తనకు ఎదురైన సవాళ్లే సైట్ ప్రారంభానికి కారణమంటున్న మన్సీ జవేరీ.

 

మొదటి సారి ప్రెగ్నెంట్ అయినపుడు ఆనందంతోపాటే ఎంతో ఆందోళన చెందేవారు మన్సీ జవేరీ. చాలా ప్రశ్నలు ఆమె మదిలో తిరుగుతుండేవి. ఒకవేళ బిడ్డ పడిపోతే నాకు తెలుస్తుందా ? పిల్లలకు తక్కువగానో, ఎక్కువగానో పాలు పడితే ఏమవుతుంది ? ఆఫీస్, ఇంటి మధ్య తిరగగలనా ?.. ఇంకా చాలా... ఇలా ఉండేవి మన్సీ ఆలోచనలు.

మన్సీ జవేరీ

మన్సీ జవేరీ


మన్సీకి కూతురు పుట్టిన తర్వాత కూడా... ఆమెకు అవసరమైనవన్నీ ఇస్తున్నానా, లేదా అనే సంశయం ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. ఒక ఉద్యోగం, వేల కొద్దీ పని గంటలు, పార్కులలో ఆటలు, ఇరుగు పొరుగున ఉండే బిడ్డ తల్లులు, అనేక నిద్రలేని రాత్రుల తర్వాత... ఒక అమ్మగా తనపై తనకు నమ్మకం ఏర్పడింది అంటారు మన్సీ. ఆన్‌లైన్‌లో కాంపిటీషన్స్ నిర్వహిస్తూ.. ఒకవైపు తమకు పబ్లిసిటీ చేసుకుంటూనే... మరోవైపు విజిటర్లకు గిఫ్ట్స్ కూడ అందిస్తోంది కేఎస్‌పీ.

ప్రతీ పేరెంట్‌కూ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం మన్సీకి అర్ధమైంది. అందుకే వారికి సహాయపడాలని నిర్ణయించుకున్నారామె. అలా తన ఆలోచనలు అన్నిటినీ ఒక చోటకు చేర్చి ఏర్పాటు చేసినదే కిడ్స్‌స్టాప్‌ప్రెస్.కాం. ఈ వెబ్‌సైట్ ద్వారా పేరెంట్స్‌కు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తామని చెప్పారు మన్సీ.

ఫోటో - కిడ్స్ మార్కెట్ పెరుగుతున్న తీరు

ఫోటో - కిడ్స్ మార్కెట్ పెరుగుతున్న తీరు


కిడ్స్ స్టాప్ ప్రెస్ లోగో

కిడ్స్ స్టాప్ ప్రెస్ లోగో


ఫుడ్, ట్రావెల్, యాక్టివిటీస్, ఈవెంట్స్, సర్వీసెస్, షాపింగ్.. ఇలా పిల్లలకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ కిడ్స్‌స్టాప్‌ప్రెస్ సహాయం చేస్తుంది. తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా.. ఇతరులకు సాయం చేయచ్చు.

“నా బిడ్డకు ఏదైనా చేయాలనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేసిన నేను... చివరకు ఒక విషయం తెలుసున్నాను. మరో బిడ్డకు తల్లి మాత్రమే... నా బాధను, అవసరాన్ని తీర్చగలదు అని అర్ధమైంది”అని చెప్పారు మన్సీ.

ఇదో మమ్మీ బ్లాగ్ కాదు

పిల్లల పెంపకానికి సంబంధించి వన్ స్టాప్ గైడ్ లాంటిది మా సైట్. పిల్లలను పెంచడంలో ఎంతో సంతోషం ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేసేందుకు తగిన అవకాశం కల్పించాలన్నదే తన లక్ష్యంగా చెప్పారు మన్సీ.

“ ఆన్‌లైన్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంటున్నా... ఇందులో భారతీయులకు పనికొచ్చేవి దాదాపుగా లేవు. మన దేశంలో ప్రతీ నగరానికి వేరువేరు పద్ధతులు, అలవాట్లు ఉంటాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పెంచాల్సి ఉంటుంది. నేను వర్కింగ్ మదర్ కావడంతో... పిల్లల మంచి, చెడులు చూడ్డానికి పూర్తి సమయం వెచ్చించే అవకాశం ఉండేది కాదు. నేను చేయగలిగిందల్లా టెక్నాలజీపై ఆధారపడ్డమే. రెండింటినీ ఎలా మేనేజ్ చేయగలననే ఆలోచన మొదలైంది అప్పుడే ” అని గుర్తు చేసుకున్నారు మన్సీ.

“మనకు అందుబాటులో చాలా సర్వీసులు ఉన్నాయి. రెస్టారెంట్స్, మీడియా, ఈవెంట్స్‌పై వార్తలు అందించే మీడియా కూడా లెక్కకు మించి ఉంది. కానీ ఓ పార్క్ ఎప్పుడు తెరిచి ఉంటుందో, హంసలు ఎప్పుడు ఎక్కడ కనపడతాయో, చిల్డ్రన్ మ్యూజియంలో ప్రత్యేక షో ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారో, పార్కుల్లో పిల్లలకు బాగా నచ్చేవి ఏవో చెప్పేందుకు ఒక్కరంటే ఒకరు కూడా ప్రయత్నించరు. ఇలాంటి వాటిని డీల్ చేసేందుకే కిడ్స్‌స్టాప్‌ప్రెస్. పిల్లల ఉత్పత్తులు ఖరీదైనవి కావడంతో.. వాటిని కొనుగోలు చేసేముందు ఇతర తల్లుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను” అని మాన్సీ చెప్పారు.

చిన్నపిల్లలాట కాదు

తొలి కాన్పులో కూతురు పుట్టిన రెండేళ్ల తర్వాత.. 2011 జూన్‌లో మన్సీ జవేరీ కిడ్స్‌స్టాప్‌ప్రెస్.కాంను ముంబైలో తన సొంత నిధులతో ప్రారంభించారు. ఈ బ్లాగ్ సైట్‌కు సంబంధించి బ్లాగర్ ఇన్ చీఫ్ ఆమే. అడ్వర్‌టైజింగ్ అండ్ బ్రాండింగ్, రిటైల్ అండ్ లైఫ్ స్టైల్ విభాగాల్లో మన్సీకి 8 ఏళ్ల అనుభవం ఉంది. చివరగా ఫ్రెంచ్ కనెక్షన్-యూకే సంస్థకు ఇండియాలో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే.. ఒక వెబ్‌సైట్ బిల్డింగ్ మాత్రం విభిన్న అనుభవం అంటారామె. సైట్ ఏర్పాటు చేయడం కంటే నిర్వహణ పెద్ద సవాల్ అనేది అనుభవం నేర్పింది.

మామీ బ్లాగ్ గానో, బేబీ సెంటర్‌లానో కాకుండా పిల్లలు సంబంధించిన లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్‌గా ప్రాచుర్యం పొందింది కేఎస్‌పీ (కిడ్స్‌స్టాప్‌ప్రెస్). దేశవ్యాప్తంగా ఈ రంగంలో లేటెస్ట్ బ్రాండ్స్, సర్వీసెస్, ఈవెంట్స్‌కి సంబంధించిన వివరాలు అందిస్తుంది. దీంతో ఇదే విభాగానికి చెందిన ఆంట్రప్రెన్యూర్స్... తమ ప్రొడక్ట్ సరైన వారికే ప్రచారం చేసుకునే అవకాశం ఉండడంతో... కేఎస్‌పీ వైపు మొగ్గు చూపేవారు.

ఆన్‌లైన్ మార్కెట్, డిజిటల్ మీడియా ప్రజలపై ఎంత ప్రభావం చూపుతాయో.. మొదట్లో ఒప్పించడం కష్టమైంది అన్నారు మన్సీ. అయితే.. క్రమంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పారు.

“ఇప్పుడు తమ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో లిస్టింగ్ కావడం ఎంత ముఖ్యమో చాలా మందికి అవగాహన ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ఉండడం కారణంగా.. తొందరగా పబ్లిసిటీ వస్తుందని తెలుసుకున్నారు. ఓ మంత్లీ మేగజైన్‌‌లో యాడ్ ఇవ్వడం కంటే.. ఆన్‌లైన్ ద్వారా మరింతమంది కస్టమర్లకు చేరువకావచ్చని అర్ధమైంది వారికి” అని మన్సీ చెబ్తున్నారు.

ఫుల్ టైంగాను, పార్ట్ టైంగాను టెక్నాలజీ నిపుణుల సహాయంతో ఈ సైట్ నిర్మించారు. ఈ సైట్ పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రెండేళ్ల సమయం పట్టింది.

“మొదట్లో రోజుకు వంద మంది విజిటర్స్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు లక్షపైగా విజిటర్స్ ఉన్నారు ఈ సైట్‌కి. మా సైట్‌ని విజిట్ చేస్తున్నవారిలో 35 శాతం రిపీట్ విజిటర్లే”అన్నారు మన్సీ.

అనేక నగరాల్లో చిల్డ్రన్ ఈవెంట్స్ నిర్వహించేవారితో భాగస్వామ్యం ఉంది కేఎస్‍‌పీకి. మార్కెట్‌పై అవగాహన ఏర్పడ్డాక.. తమ పరిజ్ఞానం ఉపయోగించి ఆదాయం పెంచుకునేందుకు కిడ్స్ ఇండస్ట్రీకి కన్సల్టెన్సీ సర్వీసులు కూడా ప్రారంభించారు. 2012లో మొదటిసారిగా దీపావళికి ఆన్‌లైన్ కిడ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. సమ్మర్ కేంప్స్‌నుంచి, బిడ్డకు తల్లి పాలు పట్టడం వరకూ అనేక టాపిక్స్‌ని వీరు డీల్ చేస్తుంటారు.

కిడ్స్‌స్టాప్‌ప్రెస్.కాం పిల్లలకు సంబంధించిన అనేక నిర్ణయాల్లో తమకు ఎంతగానే ఉపయోగపడిందని.. చాలమంది తల్లులు మాకు రాస్తుంటారు. అదే మాకు పెద్ద రివార్డ్ అన్నారు మన్సీ.

వెబ్‌సైట్