వినూత్న ఆలోచనలతో సిలికాన్ వ్యాలీలో మధురై అమ్మాయి స్టార్టప్

ఏం సాధించాలన్నా ఆలోచనలే కీలకంవ్యవసాయంలో వినూత్నత కోసం రతన్ టాటాకు మెయిల్ఇన్నోవేషన్ ల్యాబ్‌కు రావాలంటూ ఆహ్వానంసింగ్యులారిటీ యూనివర్సిటీలో ప్రావీణ్యత సాధించిన దివ్యవ్యాలీలో స్టార్టప్ ప్రారంభించేవరకూ సాగిన జర్నీ

వినూత్న ఆలోచనలతో సిలికాన్ వ్యాలీలో మధురై అమ్మాయి స్టార్టప్

Sunday August 23, 2015,

4 min Read

దివ్య సొర్నరాజా... ఈ యువతి స్టార్టప్ ఆంట్రప్రెన్యూర్‌గా మారకపోతేనే ఆశ్చర్యపోవాల్సి ఉండేది. మధురైలో ఓ సాంప్రదాయ కుటుంబం, వాతావరణంలో పెరిగిన ఈమెకు.. సాధారణ తమిళ యువతికి ఉండేటి బంధనాలు, బాధ్యతలు ఉండేవి కావు. చిన్నపుడు దివ్య చూసినవల్లా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంతే. వాటిని చూస్తూనే పెరిగారామె. ప్రింటెడ్ సర్య్యూట్ బోర్డ్స్‌ను స్టడీ చేసేందుకు అవసరమైన గాడ్జెట్స్ అందుబాటులోనే ఉండేవి.

“ ఓ కాలిక్యులేటర్ నా కంటే వేగంగా ఎలా లెక్కలు కడుతుందో తెలుసుకోవాలని అనిపించేది నాకు ” అన్నారు దివ్య. ఇందుకోసం కాలిక్యులేటర్‌ని బద్దలుకొడితే.. ఆమెకు కనిపించినదల్లా మూడు లేయర్స్ ఉన్న ఎల్‌సీడీ డిస్‌ప్లే, కొంత లిక్విడ్, సర్క్యూట్ బోర్డ్ కనిపించాయి తనకు. దివ్య చేసే ఈ పనులు తల్లిదండ్రులకు చిరాకు, విసుకు తెప్పించినా... తన ఆతృతను మాత్రం తొలగించలేకపోయారు.

దివ్య సొర్నరాజా, పిథ్ ల్యాబ్స్ ఫౌండర్

దివ్య సొర్నరాజా, పిథ్ ల్యాబ్స్ ఫౌండర్


దివ్యకు 15 ఏళ్ల వయసు ఉన్నపుడు నానో టెక్నాలజీ ఆమెను విపరీతంగా ఆకట్టుకుంది. నానో ట్యూబ్స్‌పై ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చేది. మాధమెటిక్స్‌లో ఉన్న పరిజ్ఞానంతో.. కాలేజ్‌లో స్నేహితులను ఆశ్చర్యానికి గురిచేసేది దివ్య. మ్యాధ్స్, ఫిజిక్స్‌లలో వచ్చే ప్రాబ్లెమ్స్ ఆమెకు బాగా ఉత్సాహాన్నిచ్చేవి.

వేలామ్మల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో దివ్య విద్యాభ్యాసం చేశారు. అక్కడ ఇంక్యుబేషన్ సెల్ ఉండేది. దీన్నీ నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ ప్రమోట్ చేస్తుండడం విశేషం. వ్యవస్థాపకురాలిగా మారడానికి.. దివ్య అడుగులు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. ఈ సెల్‌కు ఆమె పెట్టిన పేరు లెమన్. 

“విసుగు పుట్టించే క్లాసులను లెమన్ పీరియడ్స్ అని పిలిచేవారం. నేను ఈ సెల్‌ను తీసుకున్నపుడు అది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న స్థాయిలో ఉంది. అందుకే సెటైరిక్‌గా పేరు పెట్టాలని ఆలోచించి.. లెమన్ ఐఎన్‌సీకి మొగ్గు చూపాం. దాదాపు తిరిగి ప్రాణం పోయాల్సిన స్టేజ్‌లో ఉంది ఆంట్రప్రెన్యూర్‌షిప్ సెల్” అని దివ్య చెబ్తున్నారు.

రతన్ టాటాకు మెయిల్

2010లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన దివ్య.. రైతుల జీవితాలను సమూలంగా మార్చాలని తలచారు. వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు చేరడంలో మధ్యలో ఉండే దళారీ వ్యవస్థను అంతం చేయడానికి.. టెక్నాలజీని ఉపయోగించాలన్నది ఆమె ఆలోచన.

“ ఇప్పుడున్న సప్లై వ్యవస్థను బద్దలుకొట్టి ఓ ఆలీబాబా లాంటి సైట్‌ని ఏర్పాటు చేయాలని అనుకున్నా. అందుకే చుట్టుపక్కల గ్రామాలు తిరిగి, అనేక మంది రైతుల అభిప్రాయాలు సేకరించాను. ఓ యువతి తమ జీవితాలను మార్చే ఆలోచనలు చేయడంపై వారు ఎంతో ఆశ్చర్యపోయేవారు, ప్రోత్సహించేవారు, వివరాలు చెప్పేవారు. కానీ ఎప్పుడైతే బిజినెస్ డీల్స్ మాటల్లోకి వస్తాయో... వెంటనే వారి అడుగు వెనక్కుపడేది ” అంటారు దివ్య.

రైతులతో నెట్వర్క్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు చాలా నిధులతోపాటు... అవి అందించే మంచి మనసున్న వ్యక్తుల సహకారం కూడా అవసరమనే విషయం ఆమెకు తెలుసు. అందుకే తన బిజినెస్ ప్లాన్‌ను రతన్ టాటాకు మెయిల్ పంపారు. ఆయనకే ఎందుకు అనే ప్రశ్నకు ఆమెకు తరచుగా ఎదురయ్యేది. “ ఆయనకు ఇతరులపై కరుణ ఎక్కువ. ఇతరుల ఆలోచనకు విలువనిచ్చే వ్యక్తి రతన్ టాటా. వీటితోపాటు.. టాటా అనే పేరుకు గ్రామాల్లో చాలా విలువ ఉంటుంది ” అని చెప్పారు దివ్య. అయితే ఈమె పంపిన మెయిల్‌కు కంపెనీ నుంచి రిప్లై వచ్చింది. ముంబైలోని ఇన్నోవేషన్ ల్యాబ్‌లో పని చేయాల్సిందిగా ఆహ్వానం అందింది.

image


కళ్లుతిరిగే టెక్నాలజీ

విద్యావిధానంలో వినూత్న మార్పులు చేసేలా పలు విభిన్నమైన కోర్సులను అందిస్తుంది సింగ్యులారిటీ యూనివర్సిటీ. ప్రతీ టెక్నాలజిస్ట్‌కు సిలికన్ వ్యాలీకి చేరాలన్నది ఓ కల. సింగ్యులారిటీలో 10వారాల కోర్స్ చేసేందుకు.. జూన్ 2012లో పూర్తి స్కాలర్‌షిప్‌తో కూడిన అవకాశం లభించింది దివ్యకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, డిజిటల్ ఫ్యాబ్రికేషన్(3డీ ప్రింటింగ్), బయోటెక్(సింథటిక్ బయాలజీ), న్యూరోసైన్స్, నెట్వర్క్ & కంప్యూటింగ్, స్పేస్ & ఫిజికల్ సైన్సెస్ విభాగాల్లో విశేషమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దివ్య ఇక్కడే పెంచుకున్నారు.

“మునుపెన్నడూ మనం చూడనంత వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఉన్నాం మనమిప్పుడు. మరికొన్ని దశాబ్దాల్లో మనం చూడని, ఊహించని స్థాయికి ప్రపంచం చేరబోతోంది” అంటారు దివ్య.

ఐఓటి & బ్లూటూత్ 4.0

సింగ్యులారిటీ నుంచి వచ్చి తిరిగి ఇన్నోవేషన్ ల్యాబ్‌కు చేరేసరికి.. ఆమె దగ్గర కుప్పలు తెప్పలుగా బిజినెస్ ‌ఐడియాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ & బ్లూటూత్ 4.0.

“ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు అవకాశాలు చాలా ఎక్కువ. కొన్ని పనుల్లో మనిషి తోడు అవసరం లేదు. కేవలం స్మార్ట్‌నెస్ ఒకటే సరిపోతుంది. చిన్న పట్టణాలు, తయారీ రంగం, హెల్త్ కేర్ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఇంధన పొదుపును అదనంగా జత చేయచ్చు. ఎప్పుడు ఆన్ ఆఫ్ చేయాలి, ఎప్పుడు స్లీప్, హైబర్నేట్ మోడ్‌లు ఉపయోగించాలో తెలిస్తే ఆదా స్థాయి పెరుగుతుంది. వీటికి మనిషి ఉపయోగించే శక్తితో పోల్చితే, మెషీన్‌కు ఉపయోగించే పవర్ చాలా తక్కువ. దీన్నే నెస్ట్(తర్వాత దీన్ని గూగుల్ కొనుగోలు చేసింది) సాధించింది.”-దివ్య

బ్లూటూత్ 4.0 ప్రధాన లక్షణం బ్లూటూత్ లో ఎనర్జీ. రెండు డివైజ్‌ల పెయిరింగ్ సమయంలో ఇది అతి తక్కువ పవర్ ఉపయోగించుకుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అంటే.. రెండు డివైజ్‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడమే అంటారు దివ్య. బల్క్ బ్యాటరీస్‌కి బదులుగా.. మినిట్ సెల్స్ ఉపయోగించడం దీని ప్రత్యేకత. ఐఓటీలో ఇది చాలా కీలకం.

హెల్త్‌కేర్ ‌ఐఓటీ ద్వారా వ్యాలీలో స్టార్టప్

ఆగస్ట్ 2013లో తన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టార్టప్‌ని సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు దివ్య. “ ఇక్కడ అభివృద్ధి చేసిన వ్యవస్థ చాలా వినూత్నమైనది, మరెక్కడా కనిపించనిది కూడా. ప్రపంచాన్ని మార్చాలనే ఆలోచనలున్నవారు, ప్రస్తుతం ఉన్న వ్యవస్థల్లో సమూలంగా ఛేంజ్ తీసుకురావాలని భావించేవారే ఇక్కడ కనిపిస్తారు. మార్పు కోసం ఇలా జీవితాన్ని పణంగా పెట్టేందుకు... చాలా ప్రోత్సాహం అవసరం. దాన్ని అందించే బాధ్యత తీసుకున్నాం ” అంటారు దివ్య.

వేరబుల్, ఎంబెడెడ్ డివైజ్‌లలో టెక్నాలజీ వాడకంపై.. ఐఓటీలో విభాగాలున్నాయని వివరించారు దివ్య. ఇందులో రెండు సెగ్మెంట్స ఉండగా... సెన్సర్స్ ద్వారా తగిన ఇంటర్వెల్స్‌లో డేటాను కాప్చర్ చేసి.. రిఫరెన్సుల కోసం ఉపయోగించేది వాటిలో ఒకటి. పర్సనల్ ఫిట్నెస్, వెల్నెస్‌లను ట్రాక్ చేసి ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించేది రెండవది.

పిత్ ల్యాబ్స్ లోగో

పిత్ ల్యాబ్స్ లోగో


తన స్టార్టప్‌కు ఆమె పెట్టిన పేరు పిథ్. “ మా ప్రోటోకాల్స్‌, విధానాల్లో చాలావరకూ ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నాయి. వీటిని మరింత సమర్ధవంతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఐఓటీని మరిన్ని డివైజ్‌లలోకి చేర్చేందుకు.. ఐపీవీ6(ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్6)ను ఉపయోగించుకుంటున్నాం. ఇంటర్నెట్ యుగంలో ప్రతీ వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ”

ఈ సంస్థ కుర్చీలకు అమర్చే ఒక ప్రొడక్ట్‌ను తయారు చేసింది. మనం కుర్చీలో కూర్చునే విధానం ద్వారా సమాచారాన్ని సేకరించి, బ్యాక్ పెయిన్‌తో సహా ఇతర సమస్యలు వచ్చే అవకాశాలను మనకు ముందుగానే తెలియచేస్తుంది పిథ్.

టెక్నాలజీ, సైన్స్‌లపై ఉన్న ఉత్సుకతే... దివ్యను పిథ్ సంస్థ ప్రారంభించేలా చేసింది. కొత్త ఆలోచనల కోసం సైన్స్ ఫిక్షన్‌ని ఈమె ఎక్కువగా చదువుతుంటారు. కానీ తన ప్రయాణంలో పిథ్ ప్రారంభం మాత్రమే అని చెబ్తున్నారు దివ్య.