మింత్రా వ్యవస్థాపకుడు ముకేష్ భన్సల్‌ విజయం వెనుక ఇన్వెస్టర్ వాణీ కోలా

ఈ కామర్స్‌లో కొత్త శకానికి నాంది పలికిన మింత్రా-ఫ్లిప్‌కార్ట్ డీల్నాణ్యతకు మించిన వ్యాపార సూత్రం లేదంటున్న వాణి కోలాముఖేష్ విజన్‌తోనే టాప్‌ప్లేస్‌కి చేరిన మింత్రా వ్యాపారానికి సూత్రాలే కాదు వ్యూహాలూ అవసరమే

మింత్రా వ్యవస్థాపకుడు ముకేష్ భన్సల్‌ విజయం వెనుక ఇన్వెస్టర్ వాణీ కోలా

Thursday July 02, 2015,

4 min Read

మింత్రా-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌. మింత్రా సక్సెస్‌కు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు గతంలో మింత్రాలో పెట్టుబడులు పెట్టి... స్టార్టప్‌ను ఓ రేంజ్‌కు తీసుకువెళ్ళిన టీంమేట్ వాణి కోలా. ఈ మింత్రా ఒప్పందం సక్సెస్‌లో వాణికోలాకు చెందిన కలారి టీం ప్రత్యేక భూమిక నిర్వహించింది.

image


పరిణతి చెందిన వ్యాపారవేత్త

మింత్రాకు సంబంధించి అన్ని విషయాల్లోనూ ప్రధాన పాత్ర పోషించిన ముఖేష్‌భన్సాల్‌ను ఎంతో పరిణతి చెందిన వ్యాపారవేత్తగా అభివర్ణిస్తారు వాణి. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా పనిచేయించాలో ముఖేష్‌కు బాగా తెలుసంటారు. పెట్టుబడిదారులు, యజమానులు, ఉద్యోగుల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పడం, సంస్థను విజయపథాన నడిపించడంలో ఆయన స్టయిలే వేరంటారు వాణి. ఉన్నతమయిన లక్ష్యాలను నిర్దేశించి వాటిని చేరుకునేందుకు ఆయన ఎంతో చేశారు.

మింత్రాలో పనిచేసేటప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను వాణి చెబుతున్నారు. మింత్రా చిన్నగా ఉన్పప్పుడే మా అనుబంధం ప్రారంభమయింది. మింత్రా మొదటి సంవత్పరం పూర్తయ్యే సమయంలో ముఖేష్ చాలా అప్‌సెట్ అయ్యారు. మేం నిర్దేశించుకున్న లక్ష్యాలలో కేవలం 20 శాతంమాత్రమే ముఖేష్ సాధించగలిగారు. ఆ టైంలో ముఖేష్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. 

నన్ను కలిసి ‘‘మీరిచ్చిన టార్గెట్‌ను చేరుకోలేకపోయాను. నేను. నా టీం విఫలమయ్యాం. నన్ను మీరు క్షమించాలి. ఈ విషయంలో నేనో నిర్ణయానికి వచ్చాను. జరిగిందానికి బాధ్యత నాదే. నేను విఫలం అయినందును నాకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ని తగ్గించండి’’ అని తనతో చెప్పారన్నారు వాణి.

అపజయాన్ని అంగీకరించే తత్వమే అసలు బలం

ఇది చాలా చిన్నవిషయమే. కానీ వ్యక్తిలోని అంతర్గత విషయానికి సంబంధించి మానసిక సంఘర్షణకు ఇది అద్దం పడుతుంది. అయితే వ్యక్తిలోని అంకితభావానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. ఏదో సాధించాలని ఉన్నా ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అంత మాత్రాన మనం సక్సెస్ కాలేదని బాధపడకూడదని ముఖేష్‌కి సర్దిచెప్పారు వాణి కోలా.

అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ముఖేష్ ఎంతో శ్రమించారు. అన్నింటికంటే ముఖ్యమయినది క్వాలిటీ. మన సంస్థ నుంచి వినియోగదారులకు చేరే ప్రతి వస్తువు విషయంలో నాణ్యతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలు ఎవరైనా నాణ్యతపైనే దృష్టి పెట్టాలి. మనం సరఫరా చేసే వస్తువులు ఏవైనా నాణ్యతగా ఉంటే కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారంటారు వాణికోలా.

‘‘వినియోగదారులకు అదే టైంలో పెట్టుబడిదారులను సంతృప్తి పరిచేలా ఎలా వ్యవహరించాలి. మన సంస్థలో మనం సప్లై చేసే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. మనకున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. కొత్త కొత్తసవాళ్ళు వస్తుంటాయి. వాటిని స్వీకరించాలి’’ అంటారు వాణి.

లాంగ్ వర్సెస్ షార్ట్ టెర్మ్ కాదు... లాంగ్ అండ్ షార్ట్

ముఖేష్ దీర్ఘకాలిక లక్ష్యాలను బాగా అర్థం చేసుకోగలరు. ఒక సీఈవో కి ఎలాంటి విజన్ ఉండాలో ముఖేష్‌కి బాగా తెలుసు. ఒక సంస్థ ముందుకి నడవాలంటే ఎలాంటి టార్గెట్స్ ఉండాలో ఆయనకు స్పష్టమయిన విజన్ ఉంది. ఆయనకు ఈ విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సంస్థ ఎలా ఉంది, రేపటినుంచి సంస్థ ఎలా ఉండాలో ఆయన బాగా ఆలోచిస్తారు. భవిష్యత్ సవాళ్ళపై ఆయన బాగా ఆలోచిస్తారు.

బిజినెస్‌ టు బిజినెస్ (బీ2బి) కంటే బిజినెస్ టు కస్టమర్ (బి 2 సి) కి ముఖేష్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒక్కోసారి బీ2బి ని ఆయన ఎంతో ముందుకి తీసుకువెళ్లేవారు. ఏ బిజినెస్ అయినా క్వాలిటీ ముఖ్యమంటారు వాణి.

బిజినెస్ టు కష్టమర్ (బి2సి) పై ప్రతి ఆన్‌లైన్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నలుగురు ఆలోచించేదాని కంటే బాగా ఆలోచించాలి. కస్టమర్‌కు ఏం కావాలో పరిస్థితులను బట్టి వారి వ్యక్తిగత అవసరాలు, ప్రత్యేక అవసరాలను, వారి ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకోవాలని చెబుతారు వాణి. ఎక్కువకాలం నాటు మన్నిక ఉన్న వస్తువులను వినియోగదారులకు అందించడం అంటే ముఖేష్‌కి ఇష్టం అంటారు వాణి. .

సంస్థకు అయ్యే ఖర్చు, వినియోగదారులకు అందించే డిస్కౌంట్లపై ఏ రోజుకారోజు వ్యత్యాసం ఉంటుంది. అయితే చిన్న కంపెనీలు ఖర్చుల్ని అదుపుచేయలేకపోతున్నాయి. మింత్రాకొక స్పష్టమయిన విధానం ఉండడంతో దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆధునిక ధోరణులను అందుబాటులోకి తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకునే వినియోగదారులకు విదేశీ ఫ్యాషన్లను అందిస్తున్నాం. భారతీయుల లైఫ్‌స్టయిల్ బాగా మారిపోయింది. వారి అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని మేం భావిస్తున్నాం, ముందే చెప్పినట్టుగా నాణ్యతలో రాజీలేకుండా చెప్పిన టైంకి కస్టమర్లకు డెలివరీ చేస్తాం అంటారు ముఖేష్.

‘‘ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి. ప్రతి విషయాన్ని ముఖేష్ చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. ఈ కామర్స్‌లో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తాం. కస్టమర్లకు వాటిని పరిచయం చేస్తాం. కస్టమర్లకు ఎక్కువ లాభం వచ్చేలా మేం చేస్తున్నాం. మార్జిన్ తగ్గినా బిజినెస్ పెంచుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం’’ అంటారు వాణి.

వినియోగదారులకు మరింత చేరువ కావడానికి పెట్టుబడులు పెంచాలని నిర్ణయించాం. ఈ రంగంలోకి ప్రవేశించేవారిని మేం నిరుత్సాహ పరచడం లేదు. మా సంస్థ సాధించిన ప్రగతి, మేం ఎదుర్కొన్న ఇబ్బందులను మేం అందరికీ తెలియచేస్తున్నాం. ధైర్యంగా, ఒక వినూత్నమయిన పద్ధతుల్లో ఇందులోకి ప్రవేశించాలని కోరుతున్నాం. ఇదే మంచి తరుణం. దీర్గకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలంటారు వాణి.

టాప్ 3లో మింత్రా

ఈ కామర్స్ రంగంలో మేం అందరికంటే ముందున్నామంటే దానికి కారణం మా షేర్‌హోల్డర్స్, మమ్మల్ని నమ్మిన వినియోగదారులే. వారికి మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, మింత్రాలు ఇప్పుడు టాప్‌3 ఈ కామర్స్ కంపెనీలుగా మారాయి. ఆరేళ్ళ క్రితం మా సంస్థ ప్రారంభం అయినప్పుడు మాపై ఎంతో విశ్వాసం అప్పటినుంచి ఇప్పటివరకూ అలా కొనసాగుతూనే ఉంది. మింత్రాతో పాటు ఫ్లిప్‌కార్ట్ విషయంలోనూ అదే విశ్వాసం చూపించారు. భారతదేశంలోని మంచి ఈ కామర్స్ కంపెనీలుగా ఇవి ఎదగాలని అంతా కోరుకుంటున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్‌లో మింత్రా ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 2007-2008 లో సంస్థ ప్రారంభమయినా అనతికాలంలోనే తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. బి2సి కంపెనీగా దీన్ని తీర్చిదిద్దడంలో ముఖేష్ తనదైన పాత్ర పోషించారు. సాధారణంగా దుస్తులతో పాటు స్పోర్ట్స్ దుస్తులను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. ఐపిఎల్ మేనియా కూడా బాగా పనిచేసింది. కస్టమర్ల అభిరుచులు తెలుసుకుని వాటి ప్రకారం ముందుకు వెళ్ళేందుకు ముఖేష్ ప్రయత్నిస్తున్నారు. సర్వేల ద్వారా మా కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఆయన అనుసరించే పద్ధతులు అందరూ ఆచరించవచ్చు అంటారు వాణి.

క్వాలిటీయే ప్రధానం

భారతదేశం ఇప్పుడు ప్రపంచదేశాలకు మంచి మార్కెట్‌గా మారింది. హై క్వాలిటీ ప్రొడక్ట్‌కు ఆన్‌లైన్‌లో మంచి ఆదరణ ఉంది. ఎన్నో కొత్త కొత్త కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి దాని ప్రకారం ముందుకెళ్ళలేకపోతున్నాయి. ముఖేష్ మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించారు. పోటీకూడా విపరీతంగా వుంది. ఫండింగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. వినియోగదారులు ఏం కావాలో కోరుకుంటున్నాం. వాటిని అందించే ప్రయత్నం చేయాలి. ఆధునిక టెక్నాలజీని అన్వయించడంలో ముఖేష్ అందరికంటే ముందున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముఖేష్ కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. సరైన సమయంలో సరైన పెట్టుబడిదారుడిని ఆకర్షించాలంటారు. సరైన టైంలో పెట్టుబడి పెట్టకపోతే మార్కెట్‌లో విఫలం కాకతప్పదంటారు ముఖేష్. చాలామంది చిన్న పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తున్నారు. అలాగే కొత్త కొత్త కాన్సెప్ట్‌లను భారతీయులు ఎక్కువగా వాడుతున్నారు. కొత్త బ్రాండ్‌లను ఓపికగా అందరికీ పరిచయం చేయాలంటారు వాణి. ఈ కామర్స్ కంపెనీలు మింత్రా-ఫ్లిప్‌కార్ట్ జాయింట్ డీల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటారు వాణి.