బ్రాండ్ హైదరాబాద్ కోసం స్టార్టప్స్ కలసి రావాలి!!

0

టీ హబ్ లాంటి మరిన్ని ఇంక్యుబేట్ సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బ్రాండ్ హైదరాబాద్ పేరుతో ఐటీ , స్టార్టప్ కమ్యూనిటీతో ముఖాముఖి జరిపిన ఆయన హైదరాబాద్ లో సెక్టార్ వైజ్ ఇంక్యుబేటర్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామన్నారు.

“డిజిటల్ ఇండియాను నూటికి నూరు పాళ్లు అమలు చేస్తోంది తెలంగాణ మాత్రమే,” కేటీఆర్

ఫైబర్ ఆప్టిక్స్ ని లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ మొత్తం ఫైబర్ ఆప్టిక్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారాయన.

ఆంత్రప్రెన్యువర్షిప్ కు మద్దతు

అమెరికాలో హార్వార్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో వ్యాపారవేత్తలు, ఆంత్రప్రెన్యువర్లు, లీడర్స్ ను తయారు చేసే మెకానిజం ఉందని, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని అన్నారాయన.

“ప్రైవేట్ బి స్కూళ్లతో టై అప్ అయి ఈకో సిస్టమ్ కు మద్దతిస్తున్నాం,” కేటీఆర్

ఐఎస్ బీ లాంటి బి స్కూళ్లతో కలసి ఇక్కడ ఆంత్రప్రెన్యువర్షిపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారాయన. హైదరాబాద్ లో స్టార్టప్ కు అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే ఆంత్రప్రెన్యువర్షిప్ ను పెంచడానికి సాధ్యమైన అన్ని సంస్థలతో కలసి పనిచేయడానకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టీ హబ్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్ర్రాస్ట్రక్చర్ ను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

దశలవారీగా ఇంక్యుబేషన్ సెంటర్లు

టీ హబ్ ఏర్పాటు జరిగిన 15రోజుల్లోనే అది నిండిపోయిందని. కొత్త స్టార్టప్ లకు చోటు లేకుండా పోయిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

"స్టార్టప్ లకోసం ప్రైవేట్ ఇంక్యుబేషన్ లతో కలసిపనిచేస్తాం," కేటీఆర్

సెక్టార్ వైజ్ కొత్త ఇంక్యుబేషన్ లకు అంకురార్పణ చేస్తున్నామన్న ఆయన ఇప్పటికే యానిమేషన్ స్టార్టప్ లకోసం మరో ఇంక్యుబేషన్ గచ్చిబౌలిలో సిద్ధం చేశామన్నారు. దీంతో పాటు ప్రైవేట్ సంస్థలతో టై అప్ అవుతున్నామని, నగరంలో అన్ని చోట్లా ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రశ్నోత్తరాలకు జవాబులు

2014 కంటే ముందు ఏర్పాటైన స్టార్టప్ లకు మీరెలాంటి బరోసా ఇస్తారని, స్టార్టప్ కమ్యూనిటీ నుంచి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇంక్యుబేషన్ లను కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా అందరినీ అకామిడేట్ చేయగలమని చెప్పుకొచ్చారాయన. ఐటి ఆధారిత సేవలకు ఎలాంటి ఢోకా లేదని, కొత్తగా సంస్థను ఏర్పాటు చేయాలనుకే వారికి టీఎస్- ఐపాస్ ద్వారా అన్ని క్లియరెన్స్ అందిస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ బిల్డింగ్ లో స్టార్టప్ లు కలసి రావాలని, టీ హబ్ నుంచి మరో గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్ లాంటి సంస్థలు పుట్టుకు రావాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories