వెజ్జీ ఉత్పత్తులతో దూసుకుపోతున్న ‘యూనివెడ్’

ఆదర్శ జీవనమంటే శాఖాహారమేఆరోగ్యం కావాలంటే అంతా శాఖాహారులు కావాల్సిందేవెజిటేరియన్ నినాదంతో దూసుకుపోతున్న స్టార్టప్మాంసాహారానికి దూరం పెట్టడమే సక్సస్ మంత్రం అంటున్న ఫౌండర్

వెజ్జీ ఉత్పత్తులతో దూసుకుపోతున్న ‘యూనివెడ్’

Thursday May 28, 2015,

3 min Read

కొన్ని దశాబ్దాలకు ముందు.. జీవితం ఎంతో సాధారణ౦గా ఉంది. దేనికైనా సమయం, తీరిక ఉండేవి. జనం తమ ఆఫీసుల్లోనే వాకింగ్, వ్యాయామం చేయడానికి టైం ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. చేసేంత సమయమూ లేదు. చేయడానికి స్థలమూ లేదు. మరీ ముఖ్యంగా జనానికి శ్రద్ధ తగ్గిపోయింది. సమావేశాలు వాయిదా వేయడం సాధ్యం కాదు. మీటింగ్‌లు మస్ట్‌గా అటెండ్ కావాలి, మెయిల్ చెక్ చేయాలి, మరికొన్ని పంపాలి. ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనం తీసుకున్న ఆహారంలో అదనపు క్యాలరీలు ఉన్నాయా లేదా? మన రోజువారీ పనులకు సరిపడే పోషక ఆహారం తీసుకొంటున్నామా ? , కొన్ని సార్లు మనం రెగ్యులర్‌గా ఆహారం తీసుకోవడం వీలుకాకపోవచ్చు. అలాంటప్పుడు ఆహార సమతుల్యత కోసం కొన్ని మందులు అవసరమవుతాయి. ఇదే యూనివెడ్ పురుడుపోసుకోడానికి కారణం అయింది.

యూనివెడ్ ప్రాడక్టులు

యూనివెడ్ ప్రాడక్టులు


యూనివెడ్ ప్రొడక్ట్స్ :

భారత దేశ ప్రజలు రోజూ పోషక ఆహారం తీసుకొనేటట్లు చేసి ,వారిని ఆరోగ్యంగా ఉంచటమే లక్ష్యంగా 2010లో ముంబై కేంద్రంగా యూనివెడ్ స్టార్టప్ ప్రారంభమైంది. వినూత్న౦గా, సహజ౦గా తయారు చేసే శాకాహార ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడం, పరిశోధనలు ఆధారంగా ఆరోగ్య ఉత్పత్తులు తయారీపై దృష్టి పెట్టిన సంస్థ ఇది. దీని ఫౌండర్,CEO అమిత్ మెహతా. క్రీడలు ,పోషక ఆహారాలు కలిగిన వాతావరణంలో పెరగటం వల్ల దీనిపై అమిత్ ఆసక్తి పెంచుకున్నారు. సిటీలో గల్లీ క్రికెట్ ఆడటం, జీవితమంతా ఫుట్‌బాల్ కోసం పరితపించటం , బాడీబిల్డింగ్‌లో తన తండ్రిలాగే తానూ ఇష్టం పెంచుకోవడం లాంటివి అతనిలో ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ , అమెరికాలోని విలియమెటి యూనివర్సిటీ నుండి యం.బి.ఎ పూర్తి చేశారు. దీంతో అతనికి అంతర్జాతీయంగా గుర్తింపు, అనుభవం సంపాదించుకున్నారు.

విదేశాల్లో ఉన్నప్పుడే వెజిటబుల్ ఫుడ్ కి దగ్గరయ్యారాయన. శాకాహారంతోనే జీవనం సాగించాలని నిర్ణయించుకున్నారు. ఫిట్‌నెస్, పోషకాహార రంగంలోకి దిగటానికి ఉత్సాహం చూపించారు అమిత్. ఇదే ముంబైలో యూనివెడ్ స్థాపించడానికి నాంది పలికింది. 

సంస్థ ప్రారంభమైన మూడు రోజులకే అమేయా గవన్‌దల్కర్ అనే హెర్బల్ సైన్స్ గ్రాడ్యుయేట్ తనవద్ద చేరారు. యూనివెడ్ సాంకేతికత పర్యవేక్షణ టీమును బయట దేశాల్లోనూ ఏర్పాటు చేసుకున్నారు. పరిశోధన అనంతరం ఇద్దరూ కలిసి ఓ ఔట్‌లైన్‌ తయారు చేశారు. దాని పేరే 'ప్రకృతి ప్రేరణ'. ప్రాకృత్రిక వస్తువులతో శాఖాహార ఉత్పత్తులు తయారు చేసి వినియోగదారుల జీవన ప్రమాణం పెంచే రోడ్ మ్యాప్ సిద్ధమైంది.

యూనివెడ్ బ్రాండ్ డైరెక్టర్ సిద్ధార్థ సంస్థకు విజువల్ లాంగ్వేజ్ ద్వారా ప్యాకేజింగ్ నమూనాలను తయారుచేశారు.

సవాళ్ళను అధిగమించి

మొదటి ప్రోడక్ట్ “ది లైట్ బల్బ్ మూమెంట్”. అతని తల్లి మందులను రోజు ఉదయం తాగే “టీ” లో తీసుకోవడం గమనించాడు. లక్షల మంది భారతీయులకు టీ అనేది డైలీ లైఫ్‌లో సర్వసాధారణం . టీ ద్వారా వీరిలో మెరుగైన ఆరోగ్య ఫలితాలు సాధించవచ్చునని తెలుసుకొన్నాడు. ట్రయల్స్, పరిశోధన అనంతరం హెర్బల్ హెల్త్ టీ కోసం మూడు స్పష్టమైన ఫార్ములాలను రూపొందించారు. జ్ఞాపక శక్తి, జీర్ణ శక్తి, మెరుగైన లై౦గిక ఆనందంకోసం యూనివెడ్ అధికారికంగా యాక్టివ్ టీ(Activitea), డైజెస్ట్ టీ(Digestea), విటాలి టీ(Vitalitea) లను ప్రారంభించారు. 

సంస్థ కొంచెం పుంజుకొన్న తర్వాత అందరూ కలిసి బయో, సహజ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయడం, ఇప్పుడు మార్కెట్లో ఉన్నవాటికి ప్రత్యామ్నాయాలుగా ఉన్నతమైన ఆహారాలు తయారీ చేయడంపై దృష్టి సారించారు. కొద్దికాలానికే యూనివెడ్ ఒమెగా ప్రారంభించింది. చేప నూనెల ఉత్పత్తులతో నిండిపోయిన మార్కెట్లో శాకాహారపు ఒమేగా-౩ కి మూలమైన మైక్రో ఆల్గేనుంచి తీసిన ప్రాథమిక ధాతువు దీనికి వనరు.

యూనివెడ్ టీం

యూనివెడ్ టీం


2013లో యూనివెడ్ కాల్- డి వెజ్ ప్రారంభించింది.ఇది కాల్షియం, విటమిన్ డి-౩ కి ప్రత్యామ్నాయం. రసాయనిక కాల్షియం ఉత్పతులు రాజ్యమేలే భారతీయ మార్కెట్లో దీని తయారీకి నాచులో ఉండే కాల్షియంను, మొక్కలలో దొరికే విటమిన్ డి౩ ని వాడారు.

యూనివెడ్ ప్రత్యేకత ?

యూనివేడ్ అయిదు మార్గదర్శకాలను కోర్ ఫిలాసఫీగా చూస్తుంది. అవి ఇన్నోవేషన్, క్వాలిటీ, రీసెర్చ్, నేచురల్, వెజిటేరియన్. భారతదేశంలోవున్న పెటా(PETA) సర్టిఫికేట్ పొందిన సంస్థే కాకుండా యూకేలో వున్న వేగన్ సొసైటీ నుండి సర్టిఫికెట్ కూడా పొందింది. అంతేకాదు ఇక్కడున్న సంస్థలన్నింటిలో మొదటి స్థానానికి చేరింది. నాణ్యమైన ఆహర ఉత్పత్తులు తయారీ కోసం తమకు ఒకటి నుండి రెండేళ్లు పడుతుందన్నారు అమిత్ .

యూనివెడ్ టీం

ఉత్పత్తుల జోరు మాత్రం 2012 నుండి 2015 మధ్య కాలంలో జరిగింది. ఇప్పుడు వివిధ అంశాల వారిగా ౩౩ ప్రొడక్ట్స్ సంస్థ దగ్గరున్నాయి. ఆరోగ్య కరమైన మందులను తయారీ చేయడంలో, నిల్వవుంచడంలో ప్రత్యేక శ్రద్ధను సంస్థ కనబరుస్తోంది.

చర్మ సంరక్షణ కోసం యూనివెడ్ డియర్ అర్త్(Dear Earth) ను సేంద్రీయ పద్ధతుల ద్వారా తయారు చేశారు. ఇది తలనుండి పాదాల వరకు ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యంత నాణ్యత గల స్కిన్ కేర్ బ్రాండ్ అని కంపెనీ చెబ్తోంది. యూనివెడ్ ఇప్పుడు స్పోర్ట్స్ రంగంవైపు దృష్టిసారించింది. తాము క్రీడాకారుల అభివృద్ధికి సాధ్యమైనంత కృషిచేస్తున్నట్టు వివరించారు. అథ్లెట్లు కోసం నాణ్యమైన ఆహార౦తో పాటు పోషక విలువలున్న ప్రాడక్టులను సిద్ధం చేశారు. RRUNN అనేది దేశంలోనే మొదటి వేగన్ పోషక విలువలు కలిగిన వ్యవస్థ. అథ్లెట్ రన్ ప్రారంభించినప్పటినుండి చివరి వరకు శారీరక౦గా ఎంత న్యూట్రిషన్ అవసరమో ఇది అందజేస్తుంది.

భవిష్యత్తులో...

యూనివెడ్ ఇతర విభాగాల్లోనూ విస్తరించడానికి శ్రమిస్తోంది. మధుమేహం నియ౦త్రణ వైపు కూడా దృష్టి సారించింది. ఆర్ వై ఆర్ (RYR) ఇది వినియోగదారులకు చాలా సంతృప్తినిచ్చిన ప్రాడక్టని యూనివెడ్ చెబ్తోంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ మొదటి వరుసలోఉన్న విషయం మనం గుర్తించాలి. దీనికి సరైన మందు ఆర్ వై ఆర్ అని, ఇది సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే కృత్రిమ మందులకు ప్రత్యామ్నాయని వివరిస్తోంది.