లైసెన్స్ తీసుకో.. నచ్చిన డిజైన్ ప్రింట్ చేసుకో... 'జింజర్ క్రష్' కొత్త కాన్సెప్ట్

లైసెన్స్ తీసుకో.. నచ్చిన డిజైన్ ప్రింట్ చేసుకో... 'జింజర్ క్రష్' కొత్త కాన్సెప్ట్

Wednesday September 23, 2015,

4 min Read

మీ మనసుకు ఏది నచ్చుతోందో.. దాన్ని ప్రదర్శించండి.. స్టయిల్‌గా చీర్స్ చెప్పండి.. క్రేజియస్ట్, క్రియేటివ్ మైండ్స్ సృష్టించిన డిజైన్లను మగ్‌లపై ప్రింట్ వేయించుకోండి. మీకు నచ్చిన డిజైన్లనే జీవితంలో భాగంగా చేసుకోండి. ఇదో వ్యాపార ప్రకటనలా ఉందా.. ? అది నిజమే.. ఆన్‌లైన్ పోర్టల్ జింజర్‌ క్రష్ హోంపేజీలో పోస్ట్ చేసిన యాడ్ ఇది. లైసెన్సింగ్, బ్రాండింగ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న జింజర్‌ క్రష్ కస్టమర్లు కోరుకున్న డిజైన్లను వెంటనే అందిస్తోంది. అది టీ-షర్ట్‌పై కార్టూన్ క్యారికేచర్ కావొచ్చు లేదంటే ఏదైనా టీమ్ లోగో కావచ్చు. ఏదైనా సరే కోరుకున్న డిజైన్ లోగోను మనకు అందిస్తోంది ఈ వడోదర బేస్డ్ స్టార్టప్.

image


ఓ రోజు రాజ్వీమాకోల్ రాత్రి ఇంటికొచ్చేసరికి ఆయన ఆరేళ్ల కొడుకు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. అందుకు కారణం మొబైల్‌లో యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడుతుండగా గేమ్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటన ఒకటి పాప్ అపి బాక్స్‌లో ఓపెన్ అయింది. అదే ఆ బాబు ఏడుపుకు కారణం.

‘‘ మా వాడికి యాంగ్రీ బర్డ్స్ గేమ్ అంటే మహా ఇష్టం. గేమ్స్ క్యారెక్టర్ ఫ్లిప్ ఫ్లాప్స్‌ను పెయిర్ చేయాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో మా బాబు కోసం ఆ ప్రాడక్ట్ గురించి ఇంటర్నెట్‌లో ఎంతో వెతికాను. అది ఫిన్లాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడి నుంచి దాన్ని తీసుకురావడంలో అర్థం లేదు. అందుకు రూ. 5 వేలకు పైగా ఖర్చవుతుంది’’ అని రాజ్వీ చెప్పారు.

image


సంస్థ ఆరంభం

దీంతో ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ అవకాశాలు ఉంటే తనకు అవకాశమివ్వమని యాంగ్రీ బర్డ్స్ గేమ్‌ను డెవలప్‌ చేసిన కంపెనీకి రాజ్వీ అదే రోజు ఈ-మెయిల్ చేశారు. అయితే కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్‌ను వెతకడంలో కంటే లైసెన్సింగ్ పార్టనర్లను నియమించుకోవడంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నదని రాజ్వీకి అర్థమైంది. దీంతో రాజ్వీ లైసెన్సింగ్ రంగంలోకి ప్రవేశించారు.

లైసెన్సింగ్ ఉంటే సంస్థ ఉత్సత్తుల బ్రాండ్ డిజైన్లను, ఇమేజ్‌లను వాడుకునే అవకాశం ఉంటుంది. కాపీరైట్ హక్కులు మాత్రం కంపెనీ వద్దే ఉంటాయి. లైసెన్స్ అనేది లెసెన్సర్-లైసెన్సీకి మధ్య జరిగే లీగల్ అగ్రిమెంట్. తమ బ్రాండ్‌ డిజైన్లు, ఇతర ఉత్పత్తులు, ఒక ప్రాంతంలో లైసెన్సీ వాడుకునేందుకు, కొంతకాలానికి లైసెన్సర్ అనుమతి ఇస్తారు.

ఇలా ప్రపంచవ్యాప్తంగా డజనుకు పైగా కంపెనీలతో లైసెన్సింగ్ వ్యాపార ఒప్పందం చేసుకున్నారు రాజ్వీ. అలా వడోదర బేస్డ్ కంపెనీ ‘స్వదేశ్ ఎస్‌ఫిల్’ ఆవిర్భవించింది.

జింజర్‌క్రష్ ఏర్పాటు

యాంగ్రీబర్డ్స్, హెలో కిట్టీ, డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్ వంటి కంపెనీలతో రాజ్వీ దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. డ్రీమ్‌వర్క్ యానిమేషన్ హౌజ్‌ నిర్మించిన కుంగ్‌ఫూ పండా, ష్రెక్, మడగాస్కర్ వంటి చిత్రాలకు చెందిన డిజైన్లను వీరు ఉపయోగించుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

అలా 2012లో రాజ్వీ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని బ్యాక్ టు స్కూల్ సేల్స్‌తో ఈ - కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టారు. తొలిరోజే రూ. 10 వేల విలువ చేసే లెసెన్స్‌డ్ వస్తువులను సంస్థ విక్రయించగలిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రూ. 40 లక్షల వ్యాపారం చేసింది.

రాజ్వీ భార్య సౌమ్యా ఓ మెమొరీ గేమ్.. చింప్ చాలెంజ్‌ను 2013లో డెవలప్ చేశారు. ఈ గేమ్‌ను యూనివర్సిటీ ఆఫ్ ఆక్సఫర్డ్ లైసెన్స్ కింద ఆవిష్కరించారు. అలాగే ఆలిండియా టాయ్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (టీఏఐటీఎంఏ) ‘బెస్ట్ ఎడ్యుకేషన్ టాయ్ ఫర్ ది ఇయర్’కూడా ఈ గేమ్‌ను 2013లో వరించింది.

యురేకా మూమెంట్

ఇలా లైసెన్స్‌డ్ ప్రాడక్ట్‌ల విక్రయం ద్వారా ఏడాదికి దాదాపు రూ.9 కోట్ల రూపాయాలను ఆర్జించారు. చాలామంది ప్రయత్నించని చాలా బ్రాండ్స్ ఉన్నాయని వారు గుర్తించారు. ‘‘కస్టమర్లు వారికి కావాల్సిన ప్రాడక్ట్స్‌ను వారే సృష్టించుకుని, లైసెన్స్డ్ ఆర్ట్ ద్వారా కస్టమైజేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించాం’’ అని రాజ్వీ చెప్పారు.

అలా ఆగస్టు 1న ఈ జంట జింజర్‌క్రష్‌ను ఆవిష్కరించింది. కస్టమర్లు తమ అభిరుచికి తగిన విధంగా ఉత్పత్తులను ఎంచుకుని, నచ్చిన డిజైన్లను కొనుగోలు చేయడానికి ముందే కస్టమైజ్ చేసుకునే అవకాశం ఈ ప్లాట్‌ఫామ్‌తో కస్టమర్లకు లభిస్తుంది.

జింజర్‌క్రష్ స్పెషాలిటీ

85 లైసెన్డ్స్ ప్రాడక్ట్‌లకు సంబంధించిన డిజైన్లు, 25 అంతర్జాతీయ ఆర్టిస్టులు కాన్వాస్‌లు జింజర్‌క్రష్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. డిస్నీ, పిక్సర్ మూవీస్, మార్వెల్, లూకాస్ ఫిల్మ్స్, హిట్ ఎంటర్‌టైన్‌మెంట్, మాటెల్, ఫిషర్ ప్రైజ్, పీనట్స్, షాన్ ది షీప్, నికెలోడియన్, డోరా, ఫిడో డిడో, తదితర అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన డిజైన్లు జింజర్‌క్రష్ సైట్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు.

చిన్నారులను బాగా ఆకట్టుకున్న కార్టూన్ క్యారెక్టెర్ ఫిడో డిడో అదృశ్యమైపోయిందని అంతా అనుకున్నప్పటికీ జింజర్‌క్రష్ ద్వారా ఇది మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అభిమానులందరికీ తీపి జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చింది.

‘‘ఫిడో డిడో సృష్టికర్తలను సంప్రదించాం. వారి లైసెన్సింగ్ తీసుకోవాలని ఉంది అని మేం చెప్పినప్పుడు వారెంతో సంతోషించారు’’ అని రాజ్వీ వివరించారు.

గత ఏడాదే జింజర్‌క్రష్ పనులు ప్రారంభమైనప్పటికీ, ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ సంస్థ పేటెంట్ సాఫ్ట్‌వేర్ తొమ్మిది నిమిషాల్లోనే 28 వేల ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రస్తుతానికైతే టీ-షర్ట్స్, మగ్స్, కోస్టర్స్, మొబైల్ కవర్స్ వంటి ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే షాట్ గ్లాసెస్, స్పోర్ట్స్ వాటర్ బాటిల్స్, పోస్టర్స్, హూడీస్, రాంపర్స్‌లు కూడా అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు చెప్తున్నారు. కస్టమర్లు తాము సొంతంగా ఏదైనా డిజైన్‌ను సృష్టించి ఇస్తే దాన్ని కూడా ప్రింట్ చేసి ఇచ్చేందుకు జింజర్‌క్రష్ సిద్ధంగా ఉంది.

ఫుల్ డిమాండ్

జింజర్‌క్రష్ ఇప్పటికే పదిలక్షల అమెరికా డాలర్ల ఫండ్‌ను సమీకరించకగిలింది. అలాగే పది రోజుల్లోనే లక్షలాది రూపాయల విలువ చేసే ప్రాడక్ట్స్‌ను విక్రయించింది. టీ-షర్ట్స్, మగ్స్, కోస్టర్స్‌పై స్టార్ వార్స్, బీ క్రియేటివ్, ఫిడో డిడో వంటి డిజైన్లకు ఇప్పుడెంతో డిమాండ్ ఉందని రాజ్వీ అంటున్నారు.

విస్తృతమైన మార్కెట్

గ్లోబల్ లైసెన్సింగ్, బ్రాండింగ్ ఇండస్ట్రి లీడింగ్ అథారిటి అయిన లిమా ప్రకారం కార్టూన్ క్యారెక్టర్లు, కార్పొరేట్ లోగోలు, బ్రాండ్స్, మేజర్ స్పోర్ట్స్ టీమ్స్ వంటి వాటి ట్రేడ్ మార్క్ నేమ్స్ కోసం కస్టమర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని... 2014లో వీటి రిటైల్ అమ్మకాల విలువ 241.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉందని పేర్కొంది. అలాగే వాటి రాయల్టీ రెవెన్యూ 13.4 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా లిమా అంచనా వేసిందంటే మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

image


గట్టిపోటీ

ఈ రంగంలో భారత్‌లో ఇప్పటికే గట్టి పోటీ ఉంది. లైసెన్సింగ్ అండ్ కస్టమైజేషన్ ఇండస్ట్రీలో ప్రింట్‌వెంచర్, జూమ్ ఇన్, విస్టాప్రింట్, వాక్స్ పాప్ వంటి అతి పెద్ద కంపెనీలు బరిలో ఉన్నాయి. రాకెట్ ఇంటర్నెట్ కంపెనీ ప్రమోట్ చేస్తున్న ప్రింట్ వెంచర్ ప్రతిరోజు వెయ్యికి పైగా ఆర్డర్లపై పనిచేస్తుంది. గత ఏడాది ఈ సంస్థ ఆదాయం రూ. 7.8 కోట్లు. ఇటీవలే ఈ సంస్థ 4.5 మిలియన్ల అమెరికా డాలర్లను పెట్టుబడిగా సమీకరించింది.

ఇక జూమ్ ఇన్‌కు 13 లక్షల మంది యూజర్లున్నారు. దీని వార్షిక ఆదాయం రూ. 38 కోట్లు. గత ఆగస్టులో లైట్ బాక్స్ వెంచర్ నుంచి 80 లక్షల అమెరికన్ డాలర్ల పెట్టుబడిని ఈ సంస్థ సమీకరించింది.

నాస్‌డాక్‌లో లిస్టయిన విస్టాప్రింట్ ఇటీవలే భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థను ప్రింట్‌బెల్ అనే ఇండియన్ కంపెనీ సొంతం చేసుకుంది. ఈ సంస్థ గత ఏడాది వార్షికాదాయం రూ.11.5 కోట్లు.

బ్లూమ్ వెంచర్స్ సంస్థకు చెందిన వాక్స్ పాప్ ప్రతి నెలా రెండు నుంచి రెండున్నర కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా.

వెబ్‌సైట్‌