మీ పోయిన వస్తువులు ఇక్కడ దొరకొచ్చు !

పోగొట్టుకున్న, దొరికిన వస్తువుల జాబితా అంతా ఆన్‌లైన్‌లోఒక్క సైట్‌లో 60 లక్షల వస్తువులు, వాటి వివరాలు !లాస్ట్ అండ్ ఫౌండ్ వస్తువులకు గూగుల్ లాంటి సైట్ !

మీ పోయిన వస్తువులు ఇక్కడ దొరకొచ్చు !

Tuesday May 05, 2015,

3 min Read

ప్రతీ రోజూ లక్షలాది మంది అనేక వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటారు. వాటిలో చాలా వస్తువులు ఎవరికో దొరుకుతుంటాయి. వాటిని దాచేసుకునేవారిని పక్కనపెట్టి... అసలువారికి చేర్చాలని అనుకునేవారి గురించే మాట్లాడుకుందాం మనం కాసేవు. ఒకవేళ ఇలా దొరికిన వస్తువులను ఆయా ఓనర్లకు చేర్చాలని మనసులో ఉన్నా... వాటి యజమానులెవరో తెలీక చాలామంది మిన్నకుండిపోతారు. ఇలా పోగోట్టుకున్నవారు, దొరికిన వారిని ఒకే ప్లాట్‌ఫాం తేవాలనే ఆలోచన కలిగింది కొంతమంది వ్యక్తులకు. అంతే లాస్ట్ క్లిక్ ఫౌండ్ మొదలుపెట్టారు. వీళ్ల లక్ష్యమంతా ఒకటే... "పోయిన, దొరికిన వస్తువులకు సంబంధించి మేం గూగుల్‌లా గుర్తింపుపొందాలంటా"రు ఈ టీం.

image


పోయిన, దొరికిన వస్తువులతో ఒక ఆన్‌లైన్ డేటాబేస్ తయారు చేస్తే ? క్లౌడ్‌లో వీటికి సంబంధించిన అన్ని వివరాలు ఉంచగలిగితే ? ఇలాంటి వస్తువుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచగలిగితే? ఆలోచన వచ్చిందే తడవు.. ఆచరణలో పెట్టేశారు లాస్ట్ క్లిక్ ఫౌండ్ టీం. వ్యవస్థాగత భాగస్వాముల సహాయంతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. .


వస్తువులు పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్నకొద్దీ... జనాలు బ్రెయిన్ వాడకం తగ్గిపోతోందనే చెప్పాలి. అందుకే పోగొట్టుకుంటున్న వస్తువుల లిస్ట్ కూడా చాంతాడంతలా సాగే అవకాశాలే ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో తమ సైట్‌లో 60 లక్షల వస్తువుల లిస్ట్ ఉండేలా ప్రణాళికలు రూపొందించామంటోంది లాస్ట్ క్లిక్ ఫౌండ్. అలాగే 2 కోట్ల వెబ్ క్లిక్స్ సాధించడమే లక్ష్యంగా చెబ్తోంది.

image


పోగొట్టుకోవడం కామనే

రోజువారీ బిజీ జీవితాల్లో వస్తువులు పోగొట్టుకోవడం కూడా కామన్ అయిపోయింది. అయితే చాలా సార్లు ఆయా డివైజ్‌లు పోవడం కంటే... వాటిలో ఉండే డేటా పోవడమే పెద్ద లాస్‌గా పరిణమిస్తోంది చాలా మందికి. ఈ విలువ ఆయా వస్తువులు, వాటిలో ఉండే సమాచారం, పోగొట్టుకున్న వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఆత్మీయులెవరైనా గిఫ్ట్‌గా ఇచ్చిన కళ్లజోళ్ల లాంటి చిన్న వస్తువులు పొగొట్టుకుని బాధపడుతుంటారు కొందరు. ల్యాప్‌టాప్ పోవడంతో.. అందులో ఉన్న డేటా లాస్ అయినందుకు చింతించేవారు మరికొంత మంది.

ఇక్కడ పోతాయ్! ఇలా పోతాయ్ !

రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, ట్యాక్సీలు, కాఫీ షాప్స్... ఇలా చాలా ప్రాంతాల్లో వస్తువులు పోయే అవకాశాలున్నాయి. వాలెట్స్, మొబైల్స్, పెన్ డ్రైవ్స్ లాంటి వస్తువులు మనకు తెలీకుండానే జేబుల్లోంచి జారిపోయే అవకాశాలూ ఎక్కువగానే ఉంటాయి. అయితే వీటిలో చాలా వస్తువులు తిరిగి దొరుకుతాయి. కానీ వాటిని ఆయా ఓనర్లకు అప్పగించడం ఇబ్బందిగా మారుతుంది. అసలు ఓనర్లెవరో తెలుసుకోవడమే ప్రధాన సమస్య. ఈ సమస్యకు పరిష్కారమే లాస్ట్ క్లిక్ ఫౌండ్ అనే కాన్సెప్ట్. ఇలా పోగొట్టుకున్నవారికి, దొరికిన వారికి మధ్య వారధే లాస్ట్ క్లిక్ ఫౌండ్.కాం వెబ్ సైట్. దొరికినవారి నుంచి కలెక్ట్ చేసి.. పోగోట్టుకున్నవారికి అందించేందుకు వీళ్లు వసూలు చేస్తున్నది చాలా చిన్న మొత్తమే కావడం విశేషం.

కంపెనీ ట్యాగ్స్

కంపెనీ ట్యాగ్స్


సౌకర్యవంతంగా వెబ్ సైట్

అటు యజమానులు, ఇటు దొరికిన వస్తువు అప్పగించేవారు.. ఇరు వర్గాలు అత్యంత సునాయాసంగా వాటి వివరాలుంచేలా ఈ వెబ్‌సైట్ డిజైన్ చేశారు. స్కూల్ పిల్లల నుంచి కార్పొరేట్ల వరకూ అందరూ ఊఫయోగించేలా, అందరినీ ఆకట్టుకునేలా పోర్టల్ తయారైందిప్పటికే. ఆయా వస్తువుల ఇన్ఫర్మేషన్ పొందుపరచేప్పడు... వాటికి లాస్ట్ క్లిక్ ఫౌండ్ అందించే టాగ్స్‌ను తగిలించడం ద్వారా.. మరింత సులువుగా వాటిని వెతుక్కునే వెసులుబాటు లభిస్తుంది.

పోయిన వస్తువు వివరాలు, దొరికిన ఆర్టికల్ డీటైల్స్‌తో మ్యాచ్ అయితే.... దొరికిన వ్యక్తికి వాటిని ఓనర్‌కి ఎలా అప్పగించాలో వివరాలందిస్తుంది లాస్ట్ క్లిక్ ఫౌండ్. ఓనర్‌ని సంస్థ ద్వారా కాంటాక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే ఇరువర్గాలకు లాభదాయకంగా డీల్ కూడా సెట్ చేసుకోవచ్చిక్కడ.


పరం, లాస్ట్ అండ్ ఫౌండ్ డైరెక్టర్

పరం, లాస్ట్ అండ్ ఫౌండ్ డైరెక్టర్


టీం, పార్ట్‌నర్స్, క్లయింట్స్

డైరెక్టర్ పరమ్ నేతృత్వంలో ఈ టీం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగాలను ప్రశాంత్ చూసుకుంటుండగా... ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్‌ను మైథిలి హ్యాండిల్ చేస్తున్నారు. సాంకేతి భాగస్వామిగా కాట్‌ప్రో టెక్నాలజీస్ వ్యవహరిస్తుండగా... ప్రింటింగ్ పార్ట్‌నర్‌గా కిన్ ఎలక్ట్రో లైన్స్ ఇండియా పాలుపంచుకుంటోంది. వెస్ట్ బ్రిడ్జ్ అడ్వైజర్స్, యూబీ గ్రూప్ వంటి కార్పొరేట్ కంపెనీలు లాస్ట్ క్లిక్ ఫౌండ్‌కి ఇప్పటికే క్లయింట్స్ కావడం విశేషం.