ఫార్మా సేల్స్‌మెన్‌కు స్వాస్ ఓ వరం

టెక్నీలజీ ఎంత మారుతున్నా.. ఫార్మాలో మార్కెటింగ్ మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే సాగుతోంది. ఇప్పటికీ సేల్స్ రిప్రజెంటేటివ్స్ హాస్పటల్స్‌కు తిరుగుతూ డాక్టర్లను కలిసి తమ ఉత్పత్తుల గురించి వివరిస్తారు. ఎన్నో మార్పులకు అవకాశం వున్న ఈ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది స్వాస్..(SWaaS)

ఫార్మా సేల్స్‌మెన్‌కు స్వాస్ ఓ వరం

Saturday April 25, 2015,

2 min Read

ఓ ఫార్మా కంపెనీకి కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు మొత్తం ఫార్మా రంగం సేల్స్‌లో వున్న లోపాన్ని గమనించిన ఆనంద్ నటరాజ్ మెదడులో ట్టిన ఆలోచనే స్వాస్ సిస్టమ్స్. ఫార్మా రంగంలో కస్టమర్ రిలేషన్స్ మేనేజ్‌మెంట్ ( సి ఆర్ ఎమ్) వ్యవస్థను ఓ మలుపు తిప్పాలని స్వాస్ నిర్ణయించుకుంది. ఈ దిశగా తీవ్రంగా కృషి చేసిన తర్వాత స్వాస్ సిస్టమ్స్ మార్కెట్‌లోకి తెచ్చిన ప్రాడక్ట్.. హాయ్ డాక్టర్ (Hi doctor) ఈ Hi doctor ద్వారా సేల్స్ రెప్స్.. నేరుగా కంపెనీ వెబ్ సైట్‌లో లాగిన్ అయి, తమ రిపోర్ట్స్‌ను ఫైల్ చేయొచ్చు. దీని వల్ల వాళ్ళకు పేపర్ వర్క్ తగ్గుతుంది. సమయం కూడా వృధా కాదు.

స్వాస్ టీమ్

స్వాస్ టీమ్


ఫార్మా కంపెనీల ఉద్యోగుల్లో ఎక్కువ శాతం సేల్స్ టీమ్స్ వుంటాయి. దీనివల్ల కంపెనీ సిబ్బందిలో 85 శాతం మంది ఆఫీసు బయటే వుంటారు. కనుక ఫీల్డ్‌లో వున్న సమాచారం ఆఫీసుకు అందజేయడం, ఫీల్డ్ స్టాఫ్‌కు అందాల్సిన ఆదేశాలను వారికి అందజేయడం చాలా అవసరం. ఇక్కడే టెక్నాలజీ అవసరం. ఫీల్డ్ స్టాఫ్‌కి హెడ్ క్వార్టర్స్‌కి మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు సమాచారాన్ని , డాటాని సమగ్రంగా విశ్లేషించే అనలిటిక్స్ మీద దృష్టి సారించాలి. ఇప్పటి దాకా ఫార్మా రంగంలో సి.ఆర్.ఎమ్.ను సేల్స్ టీమ్‌కి సంబంధించి ఆటోమేషన్ లాగే చూస్తున్నారు తప్ప, వారికి హెడ్ క్వార్టర్స్‌కు మధ్య వారధిలా చూడడం లేదు.

స్వాస్ సిస్టమ్స్ తన పనితీరును కూడా కొంత భిన్నంగా డిజైన్ చేసుకుంది. క్లయింట్ల దగ్గరకెళ్ళి తమ ప్రోడక్ట్‌ను ఇన్ స్టాల్ చేయడం కంటే, సాస్ (SaaS )పద్ధతిలోనే వాటిని అందజేస్తోంది. Hi doctor మార్కెట్ లోకి విడుదలైన 18 నెలల్లోనే 30 మంది కస్టమర్స్‌ను కూడగట్టుకోగలిగింది. ప్రస్తుతం 80 ఫార్మా కంపెనీలు, 30 వేల మంది సేల్స్ రిప్రజెంటేటివ్‌లు ఈ సొల్యూషన్‌ను వాడుతున్నారు.

‘‘సాధారణంగా అనలిటిక్స్ అనేవి కంపెనీలోని టాప్ మేనేజ్ మెంట్‌కు మాత్రమే అందుబాటులో వుంటాయి. అయితే, Hi doctor ఇటు ఫీల్డ్ స్టాఫ్‌కు, అటు మేనేజ్‌మెంట్ కు కూడా అనలిటిక్స్‌ను అందుబాటులో వుంచుతుంది. దీని వల్ల ఫార్మా కంపెనీలకు చాలా ఉపయోగం. సాధారణంగా ఫార్మా కంపెనీల్లో 45రోజులకొకసారి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు Hi doctor వల్ల వారానికొకసారి తీసుకుంటున్నారు..’’ అని తమ ప్రోడక్ట్ ఉపయోగాలని చెప్పుకొచ్చారు.. అనంద్.

స్వాస్ సిస్టమ్స్ ఇంకో ప్రోడక్ట్‌ను కూడా మార్కెట్ లోకి తెచ్చింది. అదే వైడ్ యాంగిల్. ఇదో డిజిటల్ బ్రోచర్ అని చెప్పుకోవచ్చు. డాక్టర్ల దగ్గరకెళ్ళే సేల్స్ రిప్రజెంటేటివ్స్ టాబ్ మీదనే తమ ప్రోడక్ట్స్‌ను వివరించడానికి ఉపయోగించే యాప్ ఈ వైడ్ యాంగిల్. దీని వల్ల ఏ ప్రోడక్ట్ గురించి డాక్టర్లు ఎంత సేపు తెలుసుకుంటున్నారనే సమాచారం .. కంపెనీలకు చేరుతుంది. అలాగే కె యాంగిల్ K-angle అనేది స్వాస్ తయారు చేసిన ఇంకో ప్రోడక్ట్. ఇది ఫార్మా కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లన్నిటినీ కొన్ని రూల్స్‌కు అనుగుణంగా సెక్యూర్ చేసే నాలెడ్జి బేస్ సొల్యూషన్.

బడ్జెట్ లో 5శాతం మార్కెటింగ్ మీద ఖర్చుపెడుతున్న స్వాస్.. త్వరలో మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కూడా విస్తరించాలనుకుంటోంది.