డిజిటల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్

డిజిటల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్

Saturday April 01, 2017,

2 min Read

సెకండ్ ఇన్నింగ్స్ ఏ రూపంలో మొదలుపెడతాడా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు- పండగ చేసుకోండి అన్నట్టు బంపర్ ప్లాట్ ఫాం తీసుకొచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. క్రికెట్ దేవుడు మళ్లీ మనమధ్య 100 ఎంబీ అనే యాప్ రూపంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. అంటే సచిన్ కెరీర్ కి సంబంధించిన సమస్త సమాచారం ఆ యాప్ లో వుంటుందన్నమాట. ఇన్నాళ్లూ ఏ ప్రేక్షకులైతే దేవుడిలా ఆరాధించారో- ఆ ప్రేక్షకుల మధ్యనే ఉండేలా డిజిటల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

image


రిటైరైన తర్వాత నేనేం చేస్తానా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఏం చేయబోతున్నావని పదేపదే అడిగారు. నా మొదటి ఇన్నింగ్స్ మీకు తెలిసిందే. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ని నేనెంత ఆస్వాదించానో- మీరు అంతకంటే ఎంజాయ్ చేశారు. ఆ విశేషాలన్నీ మళ్లీ మీతో పంచుకునేందుకు డిజిటల్ రూపంలో యాప్ తీసుకొచ్చాం. అందులో నాకు సంబంధించిన విషయాలన్నీ పొందు పరిచాం- సచిన్

డిజిటల్ ఇన్నింగ్స్ కి సంబంధించిన యాప్ గురించి ట్విటర్ లో 30 సెకన్ల వీడియో పోస్ట్ చేశాడు సచిన్. యాప్ స్టోర్ నుంచి 100 ఎంబీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారికంగా తెలిపాడు.

డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టయిన్మెంట్ అనే సంస్థ ఈ యాప్ ని డెవలప్ చేసింది. వంద అంటే సెంచరీ అని, ఎంబీ అంటే మాస్టర్ బ్లాస్టర్ అని అర్ధం వచ్చేలా పేరు ఖరారు చేశారు. కావల్సిన ఇన్ పుట్స్ అన్నీ సచిన్ సమకూర్చాడు. యాప్ విడుదలకు సంబంధించిన ఒక పాట కూడా కంపోజ్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే- సోనూ నిగమ్ తో పాటు సచిన్ కూడా గొంతు కలిపాడు. ఈ సాంగ్ ఆదివారం రాత్రి పది గంటల నుంచి వెబ్ సైట్లో కనిపిస్తుంది.

ఫ్యాన్ ఎంగేజ్మెంట్ యాప్స్ అనేవి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. విరాట్ కోహ్లీ, శిల్పాశెట్టిలాంటి సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వారివారి సొంత ప్లాట్ ఫామ్స్ యాప్ రూపంలోనో, మరో వేదికల ద్వారానో అభిమానులను అలరిస్తున్నారు. ఆ కోవలోకి వచ్చిందే సచిన్ టెండూల్కర్ హండ్రెడ్ ఎంబీ యాప్. సో లేటెందుకు డౌన్ లోడ్ చేస్కోండి.. పండగ చేస్కోండి