దేశంలోనే అతి తక్కువ ధరకు దొరికే వెల్డింగ్ సిమ్యులేటర్ 

8 కోట్ల ఏ-సిరీస్ ఫండ్ రెయిజ్ చేసిన స్కిల్ వెరి

1

సాధారణంగా మనం వెల్డింగ్ షాపుల దగ్గర చూస్తుంటాం. ఎంత గందరగోళంగా వుంటుందంటే.. ఎక్కడ పడితే అక్కడ ఇనుప ముక్కలు. చువ్వలు. యాంగిల్స్. వాడిపడేసిన ఎలక్ట్రోడ్స్. పనిచేసేవాళ్ల డ్రస్సింగ్. అన్నిటికి మించి వెల్డింగ్ చేసేటప్పుడు ఎగజిమ్మే నిప్పు రవ్వలు. ఎంత గ్లాస్ పెట్టుకుని చేసినా కళ్లమీద పడే స్ట్రెయిన్ పడుతునే ఉంటుంది. అక్కడి సీన్ వర్ణనాతీతం. కాసేపు పక్కన నిలబడితేనే కళ్లు మసకలు బారినట్టు అనిపిస్తుంది. ఐటీఐ వర్క్ షాపుల్లోనూ స్టూడెంట్ల బాధలు చెప్పతరం కాదు. వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్ తో చెక్ పెట్టింది స్కిల్‌వెరి.

శబరినాథ్‌, కన్నన్ అనే ఇద్దరి ఆలోచనలకు ప్రతిరూపమే వెల్డింగ్ సిమ్యులేటర్. 2012లో దీనికి రూపకల్పన చేశారు. ఐఐటీ మద్రాస్ రూరల్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌లో సిమ్యులేటర్‌ ను డెవలప్ చేశారు. అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా డిజైన్ చేసిన ఈ డొమైన్ వెల్డింగ్ నేర్చుకునే ప్రాసెస్ సులభతరం చేసింది. ఎలక్ట్రోడ్స్, యాంగిల్స్, ఇనుప ముక్కల అవసరం లేకుండానే, కంటిచూపు మీద ఏ మాత్రం ప్రభావం పడకుండా వెల్డింగ్ స్కిల్ డెవలప్ చేసే మిషన్ ఇది. కంప్యూటర్ తెరమీదనే సోల్డరింగ్ చేస్తూ, తప్పుపోతే మళ్లీ దిద్దుకుంటూ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు.

కంప్యూటర్ తెర అన్నాం కదాని అదేదో హై టెక్నాలజీ డివైజ్ అనుకుంటే పొరపాటే. గ్రామీణ ప్రాంత విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేశారు. ఎలాంటి టెక్స్ట్ ఇన్ పుట్స్ అవసరం లేదు. సిమ్యులేటర్‌లో లోకల్ లాంగ్వేజీ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ వెల్డింగ్ నేర్చుకోవడమే.

వర్క్ షాప్ మెయింటెనెన్స్ తో పోల్చుకుంటే దీని ఖరీదు చాలా తక్కువ. సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది. 100 శాతం స్కిల్ ఔట్ పుట్ వస్తుంది. అరకొర పరిజ్ఞానం అన్నమాటే ఉండదు.

స్కిల్ వెరి తయారుచేసిన ఈ డొమైన్ ను బడాబడా మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు కొనుగోలు చేశాయి. గతనెలలో యూఏఈ, భూటాన్ లాంటి దేశాలకు సిమ్యులేటర్లను ఎగుమతి చేశారు. గత మార్చినాటికి సంస్థ నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సాధించింది. ఈ వెల్డింగ్ సిమ్యులేటర్ల ద్వారా 12వేల మంది విద్యార్ధులు మెరుగైన శిక్షణ పొందారు. ఐటీఐ విద్యార్ధులు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, స్కూల్ డ్రాపవుట్స్ స్కిల్ ఫుల్ మాన్ పవర్ గా తయారయ్యారు.

2015లో అంకుర్ క్యాపిటల్ రేమా సుబ్రమణ్యం స్కిల్ వెరికి సీడ్ ఇన్వెస్టరయ్యాడు. ఈ క్రమంలోనే మార్కెట్ మీద పట్టుసాధించింది స్కిల్ వెరి. ఇప్పుడు స్ప్రే పెయింటింగ్, గోల్డ్ జివెల్రీ సోల్డరింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేశారు.

అంకుర్ కేపిటల్, మైకేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్ల నుంచి స్కిల్ వెరి కంపెనీ రూ. 8 కోట్ల ఏ-సిరీస్ ఫండ్ రెయిజ్ చేసింది.ఇంత భారీ మొత్తంలోలో పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో స్కిల్ వెరి వచ్చే ఐదేళ్లలో దాదాపు 5లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు కంపెనీని పె యింటిగ్, పారామెడిలక్ ప్రొసీజర్స్, జివెలరీ మేకింగ్ లాంటి ఆరు విభాగాలకు విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేసుకుంది.

Related Stories