ఆన్ లైన్ డెంటల్ సేవలకోసం మైడెంటిస్ట్ చాయిస్

ఆన్ లైన్ డెంటల్ సేవలకోసం మైడెంటిస్ట్ చాయిస్

Tuesday May 03, 2016,

3 min Read


ఆన్ లైన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇప్పుడు అంత్యంత వేగంగా దూసుకుపోతున్న రంగం. ఇందులో హైదరాబాద్ నుంచి ఎంట్రీ ఇచ్చిన మైడెంటిస్ట్ చాయిస్ ఫండ్ రెయిజ్ చేసి తాను కూడా తక్కువేం కాదంటోంది. డెంటల్ కి సంబంధించిన అన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చిందీ ఆన్ లైన్ పోర్టల్ .

ఇది మొదలు

అమెరికాలో దాదాపు 15 ఏళ్లపాటు సాఫ్ట్ వేర్ రంగంలో అనుభవం ఉన్న ఇద్దరు మిత్రులు ఇండియాలో మొదలు పెట్టిన వెంచర్ ఇది. 2013లో శివ ప్రసాద్ ఇండియాలో స్టార్టప్ పెట్టాలని మార్కెట్ రీసెర్చి మొదలు పెట్టారు. హెల్త్ కేర్ రంగం అయితే భవిష్యత్ తో కూడా బాగుంటుందని అనుకున్నారు.

“2014లో మా స్టార్టప్ తుది రూపం వచ్చింది, అప్పుడప్పుడే భారత్ లో స్టార్టప్ కల్చర్ బాగా వ్యాపిస్తోంది” శివప్రసాద్

తాను మార్కెట్ రీసెర్చి చేస్తున్నప్పుడే సునీల్ కూడా ఇలాంటి కంపెనీ ప్రారంభిచాలని అనుకుంటున్నట్లు అనడంతో ఇద్దరు కలిశారట. అయితే ఈరంగంలో అనుభవం ఉన్న డాక్టర్ ని కో ఫౌండర్ గా తీసుకుని దీన్ని మొదలు పెట్టారు. టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోందీ స్టార్టప్.

మై డెంటిస్ట్ చాయిస్ పనితీరు

భారతదేశంలో హెల్త్ కేర్ మార్కెట్ వాటా 14 బిలియన్ డాలర్లు. ఇందులో మూడింట ఒకింత డెంటల్ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ లో ప్రవేశించిన రోజు నుంచే మై డెంటిస్ట్ చాయిస్ తన దైన పంథాలో దూసుకుపోతుంది. 60 బ్రాండ్ లు, 6వేలకు పైగా ప్రాడక్టులు అందుబాటులోకి తెచ్చారు. పెట్టిన మొదటి ఏడాది 80 లక్షల ఆదాయం సంపాదించిందీ స్టార్టప్. ఈ ఏడాది చివరికి 6 నుంచి 7 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రతి నెలా ఆదాయం 10నుంచి 15 లక్షలు ఉండటం తమకు అడ్వాంటేజీ అంటున్నారు శివ.

image


“క్లినిక్, టెక్, మెషినరీ, కాస్మటిక్స్ లాంటి సేవలను మా సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చాం” సునీల్

ఈ సంస్థకు మరో కో ఫౌండర్ అయిన సునీల్.- సేవలను బట్టి తమకు విజిటర్స్ పెరుగుతుండటం తమకు అడ్వాంటేజీ అంటున్నారాయన.

మై డెంటిస్ట్ చాయిస్ టీం

టీం విషయానికొస్తే శివ ప్రసాద్ సీఈఓ, కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. సిబిఐటి నుంచి బీఈ సివిల్ పూర్తి చేశారు. సాఫ్ట్ వేర్ రంగంలో దేశ విదేశాల్లో 16 ఏళ్ల అనుభవం ఉంది. సునీల్ కూడా సీబీఐటీ నుంచి ఈసీఈ పూర్తి చేశారు. వీళ్లిద్దరూ ఒకే బ్యాచ్ కావడం విశేషం. సునీల్ కు కూడా 14 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఎక్స్ పీరియన్స్ ఉంది. డాక్టర్ చంద్రశేఖర్ టీంలో మరో కీలక వ్యక్తి. కో ఫౌండర్ అయిన చంద్రశేఖర్ సీనియర్ డెంటల్ సర్జన్. 10ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. ముగ్గురు కో ఫౌండర్లకు కలిపి 40 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. వీరితో పాటు 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ప్రధాన సవాళ్లు, పోటీ దారులు

1.కస్టమర్ ని గుర్తించడం ప్రధాన సవాల్ అని శివ ప్రసాద్ అంటున్నారు. లాజిస్టిక్స్ కూడా ఓ పెద్ద సమస్య ఆయన చెప్పుకొచ్చారు.

2.టాలెంట్ ఉన్న ఉద్యోగులను అపాయింట్ చేయడం కూడా పెద్ద రిస్క్ అన్నారు.

3.హెల్త్ కేర్ రంగంలో తమకు పోటీ ఉన్నప్పటికీ తమ రంగంలో మాత్రం లేరని శివ ప్రసాద్ అంటున్నారు. ఆఫ్ లైన్ స్టోర్ల నుంచి పోటీ ఎలాగూ తప్పదని అంటున్నారు.

4.ఈ రంగంలో ఎవరూ పోటీ లేకపోవడం కూడా పెద్ద సవాలే అంటున్నారు సునీల్. జానాని కి కొత్త ప్రాడక్టు అలవాటు చేయించాలి. అదో పెద్ద తలనొప్పి ఆయన అభిప్రాయపడ్డారు.

భవిష్యత్ ప్రణాళికలు

అన్ని మెట్రో నగరాల్లో సేవలున్నాయి. దేశంలో ఎక్కడికైనా ఆర్డర్లు సప్లై చేస్తున్నారు. టియర్ టు సిటీల్లో మరింత విస్తరించాలని చూస్తున్నారు. యాప్ రూపంలో సేవలను అందిచాలని చూస్తున్నారు. టీం విస్తరణ లాంటివి ముందున్న ప్రణాళికలుగా చెప్పారు శివ ప్రసాద్. గడిచిన ఏడాది కంటే ఇది మరింత ప్రాధాన్యం గల సంవత్సరమని, సేల్స్ లో 150శాతం గ్రోత్ ఉండాలని టార్గెట్ పెట్టుకున్నామని అన్నారాయన.

ఫండింగ్

అమెరికాకు చెందిన ఏంజిల్ ఇన్వెస్టర్ నుంచి 150 వేల డాలర్లను ఈ స్టార్టప్ రెయిజ్ చేసింది. దీన్ని టెక్నాలజీ సేవలను మెరుగుపరచడంతో పాటు టీం సైజ్ పెంచడానికి ఉపయోగిస్తున్నారు.

ఆఫ్ లైన్ స్టోర్ లతో అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ గా ఉన్న డెంటల్ స్టోర్ రంగాన్ని పూర్తి వ్యవస్థీకరించడమే తమ ముందున్న లక్ష్యమని ఫౌండర్లు తెలిపారు.
image


website