అసలైన డిస్కౌంట్ కూపన్స్ అడ్డా 'షాప్ పైరేట్'

కస్టమర్‌కు ఉపయోగపడే కూపన్స్ ఇప్పిస్తున్న షాప్ పైరేట్ ఆన్ లైన్ విజిటర్ల డబ్బుతో పాటు సమయాన్ని ఆదామొబైల్, వెబ్‌సైట్, ట్యాబ్‌లోనూఅందుబాటులోకి ఇండియాతో పాటు విదేశాల్లో కూడా విస్తరించే ప్రయత్నం

అసలైన డిస్కౌంట్ కూపన్స్ అడ్డా 'షాప్ పైరేట్'

Thursday June 18, 2015,

2 min Read

వివిధ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఆన్‌లైన్ కూపన్స్ ఇచ్చే వాళ్లు చాలా మంది ఉన్నారు. కాని మీ డబ్బును, సమయాన్ని నిజంగా సేవ్ చేసే వాళ్లు తక్కువే. నేను తరచూ షాపింగ్ చేస్తుంటాను, అలాగే కూపన్స్ కోసం కూడా చూస్తాను. కాని ఎప్పుడు చూసినా ఎక్కువ మంది అవే కూపన్లు, ఒక్కరు కూడా విభిన్నంగా ఉండరు.

image


మీరు కూడా కోపన్స్ కోసం చూసే వారైతే, మీ కోసమే ‘షాప్ పైరేట్’. ఇది ఆన్ లైన్ షాపర్స్ డబ్బుతో పాటు వారి సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. మిగితా వారిలా కాకుండా, మీకు నచ్చే విధంగా సర్చ్ చేసుకునే అవకాశంతో పాటు, మంచి యూజర్ అనుభవం, పర్ఫామెన్స్ , అలాగే మొబైల్, వెబ్, ట్యాబ్ లాంటి అన్ని ప్రధాన ప్లాట్ ఫామ్స్ పై అందుబాటులో ఉంది.

“ఓ సారి గతంలో నాతో పని చేసిన ఫ్రెండ్ కోసం ఓ సెల్ ఫోన్ గిఫ్ట్ చేయాలనుకున్నా, కాని ఎక్కడ మంచి డిస్కౌంట్ లభిస్తుందో తెలిదు. అప్పుడు కావాల్సిన సమాచారం కోసం గూగుల్‌లో వెతికా, అయితే అందులో సగానికిపైగా నా ప్రస్తుత పోటీదారుల ప్రకటనలే కనిపించాయి. అప్పుడు వాళ్ల వెబ్‌సైట్స్‌లో వెళ్లి నాకు కావాల్సిన సమాచారం ఏది దొరకలేదంటారు ‘షాప్ పైరేట్’ వ్యవస్ధాపకులు కుల్ ప్రీత్ కౌర్.”

అయితే అసలు కూపన్లు వాడే కస్టమర్లను ఎవరు కూడా టార్గెట్ చేయడంలేదని తెలుకున్నారు.

మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో సుమారు 8 ఏళ్ల ఎక్స్‌పర్ట్ అనుభమున్న కుల్ ప్రీత్, IBEE Solutions లో ఎన్నో సవాళ్లను ఎదురుకుని పని చేసారు. అక్కడ విజయవంతంగా తన విధులను నిర్వహించిన కుల్ ప్రీత్, 2013 నుండి తన బ్రెయిన్ చైల్డ్ ‘షాప్ పైరేట్’ పై పని చేయడం ప్రారంభించారు.

ప్రస్తుతం సుమారు 400 స్టోర్స్ లిస్ట్ ఈ వెబ్ సైట్లో ఉంది. పైగా అన్ని స్టోర్స్ కవర్ చేయమని మిమ్మల్ని ఇప్పంది పెట్టరు. “మా వెబ్ సైట్ విజిటర్స్ సమయం తో పాటు డబ్బు కూడా ఆదా కావాలనేది మా లక్ష్యం, అందుకు నిజంగా లాభపరిచే స్టోర్స్ మాత్రమే కవర్ చేస్తాము. మా క్వాలిటీ అనలిస్టులు ప్రతీ కూపన్ చేక్ చేస్తారు, అవి నిజంగా మా విజిటర్స్‌కు లాభదాయకంగా ఉంటేనే రికమండ్ చేస్తామంటున్నారు కుల్ ప్రీత్”.

మంచి సర్చ్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, వర్గీకరణ, యూజర్ ఫ్రెండ్లీ కంటెంట్‌తో పాటు ‘షాప్ పైరేట్’ ను మొబైల్స్, మరియు బ్రౌజర్లపై కూడా అందుబాటులో ఉంచారు. “చాలా మంది ఆన్ లైన్ స్టోర్స్ గ్రూప్‌లో కొనే విధానాన్ని పాటిస్తారు. కాని మేము మాత్రం ఉచితంగా దొరికే కూపన్స్ మాత్రమే ఇస్తాము. పైగా వాటికి ఎటువంటి షరతులు ఉండవంటున్నారు కుల్ ప్రీత్.”

ఇటీవల, ఈ కంపెనీ కాన్ఫిడెన్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సుమారు 50 లక్షల పెట్టుబడి కూడా సేకరించగలిగింది.

టెక్నాలజీ తో పాటు క్వాలిటీ కంటెంట్ ఇచ్చే విధంగా ఫండ్స్‌ను ఉపయోగించే ప్లాన్స్ లో ఉన్నారు. ఇండియా తో పాటు అమెరికా, కెనెడా, ఆస్ స్ట్రేలియా లో కూడా ‘షాప్ పైరేట్’ తన కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తుంది.

వెబ్ సైట్: Shoppirate.in