సహజసిద్ధమైన నైపుణ్యానికి గుర్తింపు తీసుకొచ్చే దిశగా

ఆర్ఎస్పీసిటి కోసం చేతులు కలిపిన జాగా,ఐస్పిర్ట్దేశవ్యాప్తంగా ఈవెంట్ పెట్టే దిశగా అడుగులుసమస్యలు అధిగమిస్తూ ముందుకు పోతోన్న ఆర్ఎస్పీసిటి

0

కంపెనీలు పెట్టడం కాదు.. ఆ కంపెనీ లాభాల్లో నడవాలంటే నైపుణ్యం గల ఉద్యోగులు అవసరం. ఇటీవల కాలంలో ఈ నైపుణ్యం కోసం కంపెనీలు పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదు. కానీ యాజమాన్యాలు ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. సాఫ్ట్ వేర్ డెవలపర్స్ లోని అలాంటి వారి కోసం ఏర్పాటైందే ఆర్ఎస్పీసిటి అనే ఈ సంస్థ. ఈవెంట్లను కండక్ట్ చేసి క్రియేటివిటీ ఉన్న ఉత్సాహవంతులను ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తోంది. వారికి సరైన ట్రైనింగ్ ఇచ్చి వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది.జాగా బెంగళూరు కేంద్రంగా ప్రారంభించిన క్రియేటివ్ స్పేస్. టెక్నాలజిస్ట్, స్టార్టప్ కంపెనీలకు సలహాదారుడైన ప్రీమ్యాన్ ముర్రే దీని కో-ఫౌండర్. ఐస్పిర్ట్(ఇండియన్ సాఫ్ట్ వేర్ ప్రాడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్) దేశంలోని ఈకోసిస్టమ్ పాలసీ సంబంధించిన విషయాలపై పనిచేస్తుంది. ఈరెండు కంపెనీలు కలసి ఆర్ఎస్పీసిటి ని ప్రారంభించాయి. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వరుసగా ఈవెంట్లను చేస్తోందీ సంస్థ. స్టార్టప్ లకు సాయం చేస్తూ ముందుకు పోతోంది. ఆర్ఎస్పీసిటి ఆలోచనపై ఫ్రీమ్యాన్ ఏమన్నారంటే..

ప్రీమ్యాన్ ముర్రే
ప్రీమ్యాన్ ముర్రే

దీనివెనకున్న ఐడియా సీనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్స్ , కొత్తవారిని ఎన్నుకోవడం దగ్గరి నుంచి వారిని ఇంటర్న్ షిప్ లో తీసుకొనే దాకా ముందుకు సాగడమనే ఐడియా ఆర్ఎస్పీసిటి వెనకుంది. కొత్త ఆశయాలతో పనిచేయాలనుకునే వారిని కంపెనీలోకి తీసుకోవడానికి ఈ సంస్థ సహకరిస్తుందన్న మాట. స్పీడ్ డేటింగ్ సెషన్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒకరితో మరొకరు అభిప్రాయాలు పంచుకొనే వెసులుబాటును కల్పిస్తారు.

ఈఏడాది జనవరి 10న మొదటి సెషన్ బెంగళూరులో జరిగింది. బాబాజాబ్,మండోవోడాట్ కామ్,బుక్ మై స్పా, హ్యాపీ విజిటర్ డాట్ఇన్, తల్వ్యూ,రియాల్టికార్ట్,విజారిటి, ఏస్ హ్యాకర్, షీల్డ్ స్క్వేర్, ఫన్ గురూ, ఫ్యూజన్ చార్ట్స్, డేటా వేవ్, ద్రిష్టిసాష్ట్, నౌఫ్లోట్ లు లాంటి ఎన్నో కంపెనీలు ఈ సెషన్ లో పాల్గొన్నాయి.

“ ఇంజనీరింగ్ కాలేజి నుంచి అప్పుడే రిలీవ్ అయిన వారినే డెవలపర్స్ గా తీసుకోవాని మేం అనుకోవడం లేదు. స్వతహాగా ఆలోచన శక్తి ఉన్న వ్యక్తులైతే మంచిదనేది మా అభిప్రాయం. వారిపైనే మేం,” అని ఆర్ఎస్పీసిటి ఆర్గనైజర్స్ లో ఒకరైన టతఘట్ వర్మ అన్నారు. ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఆంథ్రపెన్యువర్లకు నైపుణ్యంతో కూడిన వ్యక్తులను అందించడం. అదేవిధంగా డెవలపర్స్ కు నేర్చుకోడానికి ఓ గొప్ప అవకాశం. వారి స్కిల్స్ తో కెరియర్ మల్చుకోడానికి వారు పడే కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఆర్ఎస్పీసిటి అనుకున్న విషయం అంత సులువైనదైతే కాదు. సంస్థకు భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు కానీ కొత్తలో మాత్రం ఇది ఒక పెద్ద సమస్యే. అయితే మొదటి ఈవెంట్ లో 70కి పైగా మంచి అప్లికేషన్లు రావడం విశేషం. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆర్ఎస్పీసిటి మాత్రం ఇప్పటి దాకా సరైన మార్గంలోనే ప్రయాణిస్తోందని చెప్పాలి. దేశంలో గొప్ప నైపుణ్యం కలిగిన క్యాండెట్లను ఎంచుకొని వారిని కంపెనీలకు అందించడంలో తనదైన పాత్ర ప్రారంభించింది. అదే సమయంలో ఆ టాలెంట్ కు తగిన గుర్తింపు ఇవ్వడమే కాదు దాన్ని నిరూపించుకోడానికి అవకాశం ఇస్తుండం ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. ఈ రకంగా చూస్తే ఆర్ఎస్పీసిటి తాను అనుకున్న ప్రకారం విజయం సాధించినట్లే. భవిష్యత్ లో మన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik