ఆన్‌లైన్ షాపర్స్ రుచితెలుసుకున్న 'నమక్'

నాలుగేళ్ళకే గంగానదిలో దూకేసిన ఈతరాని కుర్రాడు… ఆ తర్వాత ఫ్యాషన్ బిజినస్ లోకి కూడా అలాగే దూకాడు. కొత్త కొత్త ఆలోచనలతో ఉరకలేసే మరి కొంత మంది కుర్రాళ్ళను కూడా తనతో కలుపుకుని పోతూ.. వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు..

0

సమాజంలో వున్న ఇబ్బందుల కంటే, మనలో వుండే భయం వల్లే కొత్త వ్యాపారాల జోలికి వెళ్లాలంటే వెనకాడతామని దేబశిష్ చక్రవర్తి నమ్మకం. మహిళల ప్యాషన్ బ్రాండ్ నమక్ వ్యవస్థాపకుల్లో దేబశిష్ ఒకరు. అనిర్బన్ చక్రవర్తితో కలిసి నమక్ మొదలు పెట్టక ముందు దేబశిష్ పద్నాలుగేళ్ళ పాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసారు.

నిజానికి ధైర్యం కూడా కాదు.. ఓ కృతనిశ్చయం వుండాలి. వీళ్ళు ప్రవేశించిన మార్కెట్లో విజయావకాశాలకు లోటు లేదు. ఇవాళ విమెన్స్ వేర్ మార్కెట్ రూ. 80వేల కోట్లకు చేరింది. ఇది ఏడాదికి 9 శాతం పెరుగుతోంది. ఏ రకంగా చూసినా... ఇందులో వున్న అవకాశాలను అందిపుచ్చుకుంటే, ఇక్కడ విజయాలు చేజిక్కించుకోవడం ఏ మాత్రం కష్టం కాదు.

మారుతున్న ఇండియన్ ఫ్యాషన్ రంగాన్ని దేబశిష్.. నాలుగు అంశాలుగా విశ్లేషిస్తారు. ఇప్పటి వరకూ వున్న నాలుగు రుతువుల (ఆటమ్, వింటర్, స్ప్రింగ్, సమ్మర్) సూత్రానికి కాలం చెల్లింది. ఇప్పుడు ఏ నెలకానెల ఫ్రెష్ మోడల్స్ రావాల్సిందే... జనాలకు కావాల్సిందే..‍!

కోర్ ప్రోడక్ట్స్‌ను జనం ఇష్టపడడం లేదు. కోర్‌లోనే చాలా ఫ్యాషన్‌ను ఆవిష్కరించవచ్చు. ఎథ్నిక్, వెస్ట్రన్ ఫ్యాషన్ల స్థానంలో ఇప్పుడు ఫ్యూజన్ ఫ్యాషన్ రాజ్యమేలుతోంది. మహిళల షాపింగ్ అలవాట్లను టెక్నాలజీ తీవ్రంగా మారుస్తోంది. ఇది బ్రాండ్స్‌కు పెద్ద సవాలుగా మారింది.

మారుతున్న పరిస్థితుల్లోనే సృజనాత్మకతకు అవకాశాలు మెరుగవుతాయి. ఈ అవకాశాలనే నమక్ అందిపుచ్చుకోవాలనుకుంది. ఆన్ లైన్ షాపింగ్ వ్యసనంగా మార్చుకున్న ఈ తరం వినియోగదారులే నమక్ టార్గెట్. అందుకే ఎప్పటి కప్పుడు మారుతున్న కస్టమర్ అభిరుచులను అర్థం చేసుకుంటూ, అంతే వేగంగా తమ డిజైన్లను మారుస్తూ వుంటుంది. ‘‘ ధరలు తక్కువగా వుంచుతాం.. రూ.299 నుంచి రూ.899 వరకు వుంటాయి. సింపుల్ స్టయిల్స్‌తో వుండే ఫ్యాషనబుల్ రెగ్యులర్ వేర్ మా ప్రత్యేకత అని దేబశిష్ అంటారు. మా కస్టమర్లలో ఎక్కువగా 20-24 ఏళ్ల మధ్య వయస్కులే వున్నప్పటికీ, మిగిలిన ఏజ్ గ్రూపుల వారు కూడా మా డిజైన్లను ఇష్టపడుతున్నారు.

నమక్ ఎక్కువగా సొంత డిజైన్లనే మార్కెట్ చేస్తుంది. అయితే, కొత్త డిజైనర్లు ఎవరైనా.. తమ డిజైన్లను మార్కెట్ చేయడానికి అవస్థలు పడుతుంటే, వాటిని నమక్ బ్రాండ్ కింద మార్కెట్ చేసే అవకాశం కూడా ఇస్తుంది.

తమ వెబ్ సైట్ ద్వారా గానీ, ఇతర మార్కెటింగ్ వెబ్ సైట్ల ద్వారా గానీ, ఆన్ లైన్ షాపింగ్ మీదనే నమక్ ఆధారపడుతుంది. ఇప్పుడిప్పుడే, చిన్న పట్టణాల్లో మహిళల ద్వారా తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు, గ్రామాలకు కూడా విస్తరించడానికి వున్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు.

తమ సంస్థ ఉత్పత్తులతో దేబశిష్
తమ సంస్థ ఉత్పత్తులతో దేబశిష్

‘‘కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన మూడేళ్ళకు గానీ బ్యాంకుల నుంచి ఎలాంటి ఆర్ధిక సాయం అందదు’’ అని తన అనుభవాన్ని చెప్పారు దేబశిష్. కనక ఈ వ్యాపారంలో నిధుల కొరత ప్రధానమైన అడ్డంకిగా వుంటుంది. అయితే, ఈ అడ్డంకుల గురించి కూడా పూర్తి అవగాహన పెంచుకుంటే, వాటిని అధిగమించడం, వ్యాపారంలో ముందడుగు వేయడం పెద్ద కష్టమేం కాదు. పాత ఆలోచనలతోనే వ్యాపారాలు పెడితే, ఫండింగ్ అసాధ్యం.. సరికొత్త ఆలోచనలకు మాత్రం ఫండింగ్ దొరుకుతోందని దేబశిష్ అంటారు.

మొత్తం మీద ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ, నమక్ చెప్పుకోదగ్గ మైలురాళ్లు దాటింది. బెంగళూరు, జైపూర్ నగరాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ ఆరుగురు సభ్యుల టీమ్‌లో ఎక్కువగా ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చిన కుర్రాళ్లే ఉన్నారు. 

వార్ బై పార్కర్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నీల్ బ్లూమాంథాల్ చెప్పినట్టు... . నిపుణుల దగ్గర పరిష్కారాలుంటాయి.. కొత్త వారి దగ్గరే ప్రశ్నలుంటాయి.. ఈ ప్రశ్నలే మరింత మెరుగైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. దేబశిష్ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతారు. 

‘‘కొత్త కుర్రాళ్ళు టీమ్‌లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తారు. అందుకే మా సంస్థ కార్యకలాపాలు విస్తరించే కొద్దీ మేం కొత్తవారినే తీసుకుంటున్నాం. నేను నాలుగేళ్ళ వయసప్పుడే ఈత అంటే ఏంటో తెలియకుండానే గంగానదిలోకి దూకాను. ఎప్పటికైనా ఈత నేర్చుకోగలనని నమ్మేవాడిని. నమక్‌ను మొదలు పెట్టినప్పుడు కూడా నాకు అదే విషయం గుర్తుకొస్తూ వుంటుంది. ’’ అని చెప్పారు దేబశిష్.

ఫ్యాషన్ అంటేనే ప్రతిక్షణం మారేది. అందుకే ఇక్కడ అనుభవం కంటే, కొత్తదనానికే డిమాండ్ ఎక్కువ.