మొదట్లో చిన్న సెలూన్.. ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్..

Wednesday March 09, 2016,

2 min Read


తక్కువ పెట్టుబడితో పెద్దగా నష్టంలేని వ్యాపారం ఈ దేశంలో ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా సెలూన్ షాపే . అయితే ఈ సెలూన్ షాప్ లకే అదనపు హంగులద్ది స్పా అండ్ వెల్ నెస్ సెంటర్ గా మారిస్తే… ఊహించని లాభాలు వస్తాయి. అందం ఇప్పుడు దేశంలో వేలకోట్ల వ్యాపారమైంది. అందుకే రాశి నుంచి ఇలియానా వరకు ఎంతోమంది సెలబ్రిటీలు ఈ బిజినెస్ లోకి వచ్చారు. ఈ సూత్రాన్నే వంటపట్టించుకున్నాడు పుణె కుర్రాడు దర్శన్ రావల్. 

వ్యాపారం అనేది దర్శన్ రావల్ బ్లడ్ లోనే ఉంది. అతని ముత్తాతకు 1923లోనే పుణెలో చిన్న లాడ్జ్ ఉండేది. అక్కడ సెలూన్ నడిపేవారు. ఆ తర్వాత దర్శన్ తాత ఆ వారసత్వాన్ని కొనసాగించారు. 1975లో మరోచోట సెలూన్ ఏర్పాటు చేశారు. దర్శన్ రంగంలోకి దిగేవరకు అది కేవలం చిన్న ఫ్యామిలీ బిజినెస్ గా… పొట్టపోసుకోవడానికే అన్నట్లు ఉండేది. దర్శన్ థాయిలాండ్ ట్రిప్స్ కు వెళ్లినపప్పుడు సెలూన్ ను స్పా అండ్ వెల్ నెస్ సెంటర్ గా మార్చాలన్న ఆలోచన వచ్చింది. 

undefined

undefined


ప్రారంభం ఇలా…

50 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. తొలినాళ్లలో చాలా సవాళ్లే ఎదురయ్యాయి. ఉద్యోగుల జీతాలు, తర్వాత, అతిపెద్ద సమస్య షాప్ అద్దె. స్పా అంటేనే భారతీయ సమాజంలో ఓ దురభిప్రాయం ఉంది. ముందుగా ఈ రెండు సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. తక్కువ స్పేస్ లో స్పా ప్రారంభించాలని ప్లాన్ వేశాడు. పరిమితమైన స్టాఫ్ ను నియమించాడు. ఫ్రెషర్స్ కు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. దానివల్ల ఖర్చులు తగ్గాయి. ఆటోమేటిగ్గా లాభాలు వచ్చాయి.  

ఆకాశమే హద్దుగా ఎదుగుదల

ముంబై, పుణె,మాథెరాన్, మహాబలేశ్వర్, సిల్వస్సా, లోనావాలో మొత్తం 17 స్పాలను ఏర్పాటు చేశారు. టర్నోవర్ ఆరుకోట్ల రూపాయలు దాటింది. 2015లోనే జజెన్ స్పాను జజెన్ వెల్ నెస్ అండ్ హాస్పిటాలిటీ కార్పొరేషన్ గా విస్తరించారు. 

“స్పా బిజినెస్ కోసం ముందుగా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాం. తర్వాత బిల్డర్లు , ప్రోపర్టీ ఓనర్లతో పార్టనర్స్ అయ్యాం. వారి హోటల్స్ , ఆస్తులను మేమే నిర్వహిస్తున్నాం. వచ్చిన ఆదాయంలో మాకు కొంత భాగం ఇస్తున్నారు. ఆదాయం ఇవ్వకపోతే మేనేజ్ మెంట్ ఫీజును తీసుకుంటున్నాం.” దర్శన్

మార్కెట్ – పోటీ

కేపీఎంజీ అంచనాల ప్రకారం… 2012-13లోనే దేశంలో స్పా అండ్ సెలూన్ మార్కెట్ విలువ 41 వేల 224 కోట్లు. 2017-18 నాటికిది 80 వేల 370 కోట్లకు పెరగనుంది. 30 లక్షలమందికి ఈ రంగం ప్రత్యక్షంగానో… పరోక్షంగానో ఉపాధి కల్పిస్తోంది.

ప్రజలకు అందం, ఆరోగ్యంపై ఆసక్తి పెరిగింది. ఈ ట్రెండ్ ఇంకా పెరుగుతుంది అంటారు దర్శన్. ఈ రంగంలో తనకు అపారమైన అనుభవం ఉందని చెబుతున్నారు. గుజరాత్ లోనూ వ్యాపారాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాదే హాస్పిటాలిటీ రంగంలోకి వచ్చామని నష్టాల్లో ఉన్న హోటల్స్ ను కొని లాభాల్లోకి తీసుకొస్తామన్నారు.

గత కొన్నాళ్లుగా స్పా అండ్ సెలూన్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. ఏటా 25 శాతం వరకు పెరుగుతోంది. యూత్ లైఫ్ స్టైల్ మారడమే అందుకు కారణం. ఆయుర్వేదిక్ అండ్ నేచురల్ ప్రోడక్ట్స్ కు మంచి డిమాండ్ రాబోతుంది. మహిళలతో సమానంగా పురుషులుకూడా ఈ రంగంపై దృష్టిపెట్టారు. అందుకే సెలబ్రిటీలు సైతం ఈ రంగంలోకి వస్తున్నారు.