మీ వ్యాపారాన్ని డిఫరెంట్ యాంగిల్‌లో విశ్లేషించే లాటెంట్ వ్యూ

వ్యాపారంలో సమస్యా ..? లాటెంట్ వ్యూ (LATENT VIEW) తోడుతోనే పరిష్కారం...కంపెనీకి అండగా కంపెనీ (తోడు) ఇస్తామంటున్న.. ‘లాటెంట్ వ్యూ’వెనకుండి నడిపిస్తాం.. వ్యాపారాన్ని నేర్పుతామంటున్న ప్రమద్ జంధ్యాలకంపెనీలకు అనుభజ్ఞులైన నిపుణుల సలహాలు, సాంకేతిక సహకారంచిన్న గమ్యాలతో సరిపెట్టి .. భారీ లక్ష్యాలను చిదిమేయొద్దు: ప్రమద్

మీ వ్యాపారాన్ని డిఫరెంట్ యాంగిల్‌లో విశ్లేషించే లాటెంట్ వ్యూ

Tuesday July 21, 2015,

5 min Read

ఆత్మవిశ్వాసంతో కూడిన ఆహార్యాన్ని ప్రదర్శించడం, మనసుకు తోచిన విధంగా చేయాలని నిశ్చయించుకోవడం, సమాధానాలు, పరిష్కార మార్గాలను ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వగలగడం.. ఇదంతా అంత సులభమైన పనేం కాదు. ప్రమద్ జంధ్యాలలో వున్న అద్భుతమైన గుణాలివి. ఆమెను కలిసిన ఎవరైనా సరే అభినందించకుండా వెనుదిరిగి రావడం అసాధ్యమంటే అతిశయోక్తి కాదు.

ఫోటోలో ప్రమద్ జంధ్యాల

ఫోటోలో ప్రమద్ జంధ్యాల


బిట్స్ పిలానీ (BITS Pilani ) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమెను కలిశాం. అక్కడ కాటన్ చీర, షార్ట్ హెయిర్ తో సింపుల్‌గా నిలబడి ఉన్నారు ప్రమద్ జంధ్యాల. బిట్స్ పిలానీ (BITS Pilani )లో తన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కోల్‌కతా ఐఐఎమ్(IIM) లో ఆర్థిక విశ్లేషణ, సేవల విభాగంలో పనిచేశారు. ఇదంతా లాటెంట్ వ్యూ (LATENTVIEW) సంస్థకు సహ వ్యవస్థాపకరాలు అవక ముందు పదేళ్లనాటి మాట. సమాచార విశ్లేషణ మరియు సమాచార నిర్వహణ రంగాల్లో అప్పటివరకు ప్రమద్ జంధ్యాల పెను మార్పులు ఏమీ చేయాలనుకోలేదు. ఇక్కడే ప్రమద్ ప్రయాణం లాటెంట్ వ్యూ స్థాపన దిశగా అడుగులు వేయడానికి దారిని ఏర్పరిచింది. ఆర్థిక, మానవవనరుల, పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే శాఖలో డైరెక్టర్ గా తన కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.

కాలేజీ రోజుల్లోనే .. బలమైన పునాదులు..

మూడు విశిష్టమైన లక్షణాలు ప్రమద్ జంధ్యాలపై ప్రభావాన్ని చూపాయి. అవే:

1. క్రమ శిక్షణ

2. కృషి

3. నమ్మినదానిపై కచ్చితంగా నిలబడటం

బిట్స్ పిలానీ కాలేజీ రోజుల్లో నేర్చుకున్న విషయాలను ఇలా చెప్పుకొచ్చారు ప్రమద్....

“నేను broad-based అనే పదంపై పాఠ్యాంశాన్ని తయారు చేసి.. కాలేజీ orientation sessionలో ప్రదర్శించాను. సహకరించుకుంటూ నేర్చుకోవడమనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా ఆతృతతో స్వాగతించడాన్ని అభివృద్ధి చేసుకున్నాను. బిట్స్‌లో బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయడం, సహకారాన్ని అందించడమనే వ్యాపారాన్ని తెలుసుకున్నా. విద్యా ప్రపంచానికి వెలుపల కూడా చాలా విజ్ఞానం వుంటుంది. ఎలాంటి కలతలు లేని పిలానీలో చదువులు అద్భుతమైన అందాల ప్రపంచాన్ని నాకు అందించింది. అది నా భవిష్యత్ కు విశాలవంతమైన పునాదులనే వేసింది”
(ఫోటోలో...సహోద్యోగులతో ప్రమద్ జంధ్యాల, లాటెంట్ వ్యూ సహ వ్యవస్థాపకురాలు( కుడివైపు చివరన)

(ఫోటోలో...సహోద్యోగులతో ప్రమద్ జంధ్యాల, లాటెంట్ వ్యూ సహ వ్యవస్థాపకురాలు( కుడివైపు చివరన)


లాటెంట్ వ్యూ గురించి క్లుప్తంగా….

ప్రమద్ వ్యాపార, వాణిజ్య భద్రతా విభాగంలో (సెక్యూరిటీస్ మార్కెట్లో) పనిచేశారు. ఆర్థిక సేవలు, పరపతి నిర్ధారణ ఇవన్నీ కూడా డేటా అనలిటిక్స్‌లో వుంటాయి. ప్రజాసంబంధమైన వ్యవహారాలపై కూడా ఆమె ప్రత్యేకమైన దృష్టి పెట్టేది. కస్టమర్లు సులభంగా పనిచేయడానికి స్ఫూర్తిని కలిగించే విషయాలను పరిశీలించి అర్థం చేసుకునేవారు. ఈ అనుభవాలన్నీ కూడా 2006 ఏడాదిలో లాటెంట్ వ్యూ (Latent view) పురుడుపోసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి 320 మంది బలమైన , సామర్థ్యవంతమైన బృందం ఐదు ప్రాంతాల్లో పనిచేస్తోంది.

(లాటెంట్ వ్యూ (Latent view) కంపెనీ లోగో)

(లాటెంట్ వ్యూ (Latent view) కంపెనీ లోగో)


లాటెంట్ వ్యూలో ఉన్న టాలెంట్ ఏంటి ?

లాటెంట్ వ్యూ అంటే.. ‘నిగూఢమైన దృశ్యం’ లేదా ‘రహస్యమైన దృశ్యం’ అని అర్థం. వినియోగదారులకు, కంపెనీ క్లయింట్లకు వ్యాపారపరమైన సమస్యలను విశ్లేషించి వాటికి తగిన పరిష్కారాలను చూపుతుంది లాటెంట్ వ్యూ సంస్థ. ఇలా సమాచార విశ్లేషణ అందించడం ద్వారా క్లయింట్లు తమ వ్యాపారాల్లో నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు.

లాటెంట్ వ్యూ ఇచ్చే వ్యాపార పరిష్కారాలతో ఆయా కంపెనీలు తమ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాయి. వారి వారి వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను అందించడంలో పురోగతి సాధిస్తాయి. వినియోగదారులకు ఆర్థికపరమైన సేవలను, బీమా, వినియోగ వస్తువులు, రిటైల్, సాంకేతిక రంగాల్లో నిపుణుల ద్వారా వ్యాపార అండదండలను కల్పిస్తోంది లాటెంట్ వ్యూ.

లాటెంట్ వ్యూ పలు కంపెనీలకు వ్యాపార విశ్లేషణలు అందిస్తోంది. సమాచార సహాయంతో పాటు మంచి బిజినెస్, మార్కెటింగ్ నిర్ణయాలను అత్యుత్తమ సాంకేతిక విలువలతో వినియోగదారులకు అందిస్తోంది. ఆశయం, సొంత నమ్మకం అనే రెండు విలువలపై ఆధారపడి కంపెనీ పనిచేయడమే కాకుండా ఏటికేడు విజయవంతంగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటోంది.

పోటీ అవకాశాలు, అవసరాల గురించి మాట్లాడితే.. లాటెంట్ వ్యూ కి ఇతర కంపెనీలకు ఎంతో తేడా వుంది.

“ మేము కల్పించే వ్యాపార సంబంధమైన పరిష్కారాలు, గణిత సమస్యల్లో కూడా చూసుండరు. మా క్లయింట్స్ తో సత్సంబంధాలు కలిగి నడుచుకుంటాము. ఈ రెండు అంశాల కారణంగా ఇతర కంపెనీలతో మా కంపెనీని పోల్చి చూడలేము.” అంటారు ప్రమద్ జంధ్యాల. తమ సేవలను విస్తరించుకుంటూ కంపెనీ ముద్రను మార్కెట్ లో చెరిగిపోనీయకుండా సమీప భవిష్యత్ లో కొత్త క్లయింట్లను కూడా కలుపుకుని వెళ్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారామె.


2015 కంపెనీ ఆఫ్ ద ఇయర్ –అనలిటిక్స్ అవార్డు

అందుబాటులో వుండే అపరిమితమైన ప్రపంచ స్థాయి వ్యాపార విశ్లషకులు, సమాచార నిర్వాహక నిపుణుల సహకారంతో క్షేత్రస్థాయి నుంచి సమస్యలను పరిష్కరించడంలో లాటెంట్ వ్యూ అనుభవం గల సంస్థగా పేరును సంపాదించుకుంది. అంతేకాదు 2015 ఏడాది గాను కంపెనీ ఆఫ్ ద ఇయర్ –అనలిటిక్స్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు లాటెంట్ వ్యూ .. వ్యాపార ప్రపంచంలో ఎలాంటి సేవలను అందిస్తోందో అని.

అనుభవపూర్వకమైన మాటలు(Experience speaks ...) :

సమాచారం, విశ్లేషణ లో రెండు దశాబ్ధాల అనుభవంతో ప్రమద్ ఈరంగంలో ముందెన్నడూ లేని మార్పులను తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఈ మధ్యే చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, మార్పులను కూడా మనతో పంచుకుంటున్నారామె.

1. Social Media: ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సామాజిక మాధ్యమం లేదా సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగకరంగా వుంటుంది. వ్యాపారంలో వినియోగదారులు చెప్పే విషయాలను తెలుసుకుని.. మార్కెట్ కు ఏది అవసరమో, అనుగుణంగా వుంటుందో దాన్ని పసిగట్టగలుగతాము.

2. Big Data : సంప్రదాయ సర్వర్లన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ కు సరిపోవు. కంపెనీలన్నీ సౌకర్యవంతంగా వ్యాపార విశ్లేషణలు పొందగలగాలంటే క్లౌడ్ అవసరమవుతుంది. ఈ విషయంలో లాటెంట్ వ్యూ అందరికీ సులభతరమైన సేవలనే అందిస్తోంది.

3. Mobile : మొబైల్ లేదా చరయాంత్రిక శాస్త్రం ప్రభావం ఇప్పటి మార్కెట్ పై చాలా వుంది. ఇదో ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడ అంటిపెట్టుకుని వుండే సాధనం మొబైల్. పైగా వ్యక్తిగత సమాచారాన్ని జతచేసేందుకు ఈ పద్ధతి చాలా తెలివైనది కూడా.

4. Visualization: సమాచార విశ్లేషణకు సంబంధించిన సందేశాలను పొందేందుకు సహాయపడుతుంది. మనదగ్గరున్న పూర్తి సమాచారం లోతుల్లోకి తలమునకలై వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

(ప్రమద్ జంధ్యాల, లాటెంట్ వ్యూ సహ వ్యవస్థాపకురాలు)

(ప్రమద్ జంధ్యాల, లాటెంట్ వ్యూ సహ వ్యవస్థాపకురాలు)


మహిళగా వుండటం

ఇవాళ్టి మహిళలు జీవితంలోని పలు స్థాయిల్లో అనేకరకాలైన సవాళ్లను ఎదుర్కొంటూనే వుంటున్నారని నమ్ముతున్నారు ప్రమద్. ఇవన్నీ కూడా కొన్ని సంక్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడానికి దోహదపడుతాయంటారు.

1. ఇంటికైనా, వృత్తికైనా ఏదో ఒకదానికి ప్రాధాన్యతనిచ్చి దానికి కట్టుబడి వుండాలి. అప్పుడే మనం ప్రతిసారి బాగా పనిచేసుకోగలం.

2. లింగ వయోబేధం లేకుండా కొన్ని విషయాల్లో ప్రాముఖ్యతను బట్టి రాజీపడాల్సి వుంటుంది. ప్రతిసారీ పోరాటం లేకుండా విజయాన్ని సొంతం చేసుకోవడం కుదరదు. ఇది అనుభవం మీద తెలుసుకుంటారంతా. అయితే ముందుగానే గ్రహించడం ఉత్తమం.

నమ్మినదాన్ని ఆచరించి సాధించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందనే విషయాన్ని ప్రమద్ కూడా ఒప్పుకుంటున్నారు. అందుకే దీన్ని స్ఫూర్తిగా తీసుకునే చాలామంది మహిళలు ఇలాంటి రంగాలవైపు అడుగులు వేస్తున్నారు. రాత్రికిరాత్రే పెను మార్పులను తీసుకురాలేం. మనమున్న సామాజిక పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. కానీ నెమ్మదిగా వీటిలో మార్పు తీసుకురావడం మాత్రం తథ్యం.

గతం నుంచి నేర్చుకుని.. భవిష్యత్ కు ఇచ్చే సందేశం...

వ్యాపార, వాణిజ్య భద్రత నుంచి ఆర్థిక ఖాతాల నిర్వహణ లాంటి రంగాలకు ప్రతి చోటా ఉద్యోగావకాశాలు వుంటాయనే నమ్మకాన్ని కలిగించింది. ఎవరైతే రకరకాల అనుభవాల్లోకి సులభంగా లీనమై , వాటిని స్వీకరిస్తారో.. ప్రత్యేకంగా కేటగిరీలుగా వాటిని విడదీసీ చూడరో.. అలాంటి వాళ్లు సమాచార విశ్లేషణారంగంలో నిలదొక్కుకోగలుగుతారు.

యువ మహిళా వృత్తినిపుణులకు ముఖ్యమైన గమనికను అందిస్తూ ప్రమద్ ముగించారిలా...

“సౌకర్యవంతమైన పరిధుల్లోంచి ఓసారి బయటకు వచ్చి చూస్తే .. ఎన్నో మంచి అవకాశాలను అందుకోగలం. అనుభవాలను , పాఠాలను నేర్చుకోగలం. కాబట్టి మీ కలలను సాకారం చేసుకునే దిశగా పనిచేయాలి. తప్పులు చేశామని భయపడి కూర్చోకుండా దూర దృష్టితో లక్ష్యం వైపు అడుగులు వేయాలి. సుదూర గమ్యాన్ని చేరాలంటే ముందు చిన్న చిన్న లక్ష్యాలను ఛేదించి తీరాలి. అక్కడే కాసేపు ఆగి విశ్లేషించుకుంటూ మళ్లీ ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న గమ్యానికి వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. “ అంటూ భావి మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, యువతకు సందేశాన్నిచ్చారు ప్రమద్.