పార్ట్ టైం ఉద్యోగాన్ని ఫుల్ టైం జాబ్‌గా మార్చుకున్న డాక్టర్‌ప్రెన్యూర్

పార్ట్ టైం ఉద్యోగాన్ని ఫుల్ టైం జాబ్‌గా మార్చుకున్న డాక్టర్‌ప్రెన్యూర్

Thursday July 09, 2015,

4 min Read

ఢిల్లీలో పుట్టి పెరిగిన అమిత్ డాంగ్ డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఈయన సింగర్, గిటార్ ప్లేయర్ కూడా. తన కుటుంబంలో తొలితరం ఆంట్రప్రెన్యూర్ కూడా ఈయనే. గోవా మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్, ఫార్మకాలజీలో ఎండీ పూర్తి చేసి జెరోనిమో హెల్త్‌కేర్‍ను ప్రారంభించారు. ఫార్మా కంపెనీలకు రెగ్యులేటరీ, మెడికల్ కంటెంట్, మెడికో మార్కెటింగ్, క్లినికల్ రీసెర్చ్, హెల్త్‌కేర్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో సేవలందించే స్టార్టప్ ఇది. మొదట్లో ఫార్మాకీజ్‌గా పేరు పెట్టినా... తర్వాత జెరోనిమో హెల్త్‌కేర్‌గా మార్చారు. తాను వారాంతాల్లో ఫ్రీలాన్సర్‌గా చేసిన పనులే... ఓ కంపెనీ ప్రారంభానికి దారి చూపాయంటారు అమిత్. ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభించి ఇప్పటికి నాలుగేళ్లకు పైగానే.

ఫార్మకాలజీ ఎందుకంటే ?

"ఎండీ చేసేందుకు ఫార్మకాలజీ విభాగాన్ని ఎంచుకున్నప్పుడు.. నా స్నేహితులు, బంధువులు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు నాకు క్లినికల్ బ్రాంచెస్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ముందునుంచీ నాకు పరిశోధనల విభాగంపై మక్కువ. దీంతోపాటు ఆర్థికంగా త్వరగా సెటిల్ అవాలని భావించాను. ఫార్మకాలజీ ఎంచుకోవడం... నా రెండు కోరికలను తీర్చుకునేందుకే. ఎంబీబీఎస్ చదివేటపుడే.. ఫార్మకాలజీ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా"నంటారు అమిత్.

ఫార్మకాలజీని ఎంచుకోవడం ఒక ఛాయిస్ అయినా.. ఆంట్రప్రెన్యూర్‌షిప్ మాత్రం ముందు నుంచీ అమిత్ మనసులో ఉన్నదే. ఎండీ కోర్స్ పూర్తి చేశాక... ఉద్యోగం చేసేందుకు రంగం సిద్ధమైంది కూడా. నెలకు ₹6000 స్టైఫండ్‌తో ఒక చోట ఉద్యోగానికి కుదిరారు అమిత్. మరింత సంపాదన కోసం ఫ్రీలాన్స్ మెడికల్ రైటర్‌గా చేసేవారు. అయితే... సాధారణ రోజుల్లో పని తీవ్రత ఎక్కువగా ఉండడంతో... వారాంతాల్లోనే ఇతర విధులు చేసేందుకు కుదిరేది. ఉద్యోగం చేస్తుండగానే.. మెడికల్ రైటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలకు డిమాండ్ బాగా ఉందనే విషయం అమిత్‍‌కు అర్ధమైంది. జెరోనిమో ప్రారంభానికి బీజం పడింది ఇక్కడే. డ్రగ్ డెవలప్మెంట్, ప్రమోషన్, వాటి జీవిత కాలం పొడిగింపు వంటి సర్వీసులు అందిస్తుంది ఈ కంపెనీ.

image


ప్రారంభం చిన్నపాటిదే

2010లో కంపెనీ ప్రారంభించినపుడు ఒక ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉండేవి. ప్రాజెక్టుల పెరుగుదలను అనుసరించి.. టీం మెంబర్ల సంఖ్య కూడా పెరిగింది. ఆదాయ, వ్యయాల నిర్వహణపై అమిత్‌కు పట్టు ఉండడంతో... కంపెనీ అభివృద్ధి కొంత సులభమైందనే చెప్పాలి. ప్రస్తుతం ఫ్రీలాన్సర్స్, ఫుల్ టైమర్స్‌తో కలిపి... మొత్తం 12మంది జెరోనిమో కోసం పని చేస్తున్నారు. జెరోనిమోకు వచ్చే ఆదాయాల్లో చాలావరకూ ఇండిపెండెంట్ ప్రాజెక్టులే.. అతి కొద్దివాటికి మాత్రమే పొడగించుకునే అవకాశముంటుంది.

"ఫార్మా పరిశ్రమలో పనిచేసే కొందరు సీనియర్లు... మొదట్లో క్లయింట్లను పరిచయం చేశారు. ఇవి తర్వాత పుంజుకునేందుకు సహాయపడ్డాయి. మా క్లయింట్లు చేసిన మౌత్ పబ్లిసిటీయే... తర్వాత క్లయింట్లు వచ్చేందుకు కారణమైంది. వ్యక్తిగతంగా నాకున్న పేరు కూడా... డాంగ్‌ను ఇతర క్లయింట్లకు రిఫర్ చేయడానికి కారణంగా చెప్పుకోవాలి. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత... సంతోషంగా ఉన్న క్లయింట్లతో లీడ్స్ విషయాన్ని డిస్కస్ చేసేవాణ్ని. ఫార్మా ఇండస్ట్రీలో వ్యక్తులు తమ పొజిషన్లను నిరంతరం మార్చుకుంటూ ఉండడం... మాకు అన్నిటి కంటే కలిసొచ్చే విషయం.

"మేం సాధారణంగా ఫార్మా కంపెనీలకు చెందిన మార్కెటింగ్, మెడికల్ డిపార్ట్‌మెంట్స్‌తో డీల్ చేస్తాం. వీరు కొత్త ఉద్యోగాల్లోకి చేరినపుడు... ఆ కంపెనీలు కూడా మాకు ఆటోమేటిగ్గా క్లయింట్స్‌గా మారుతున్నాయి. దేశ, విదేశాలకు చెందిన ఫార్మా, న్యూట్రాస్యూటికల్స్ కంపెనీలతో పని చేస్తున్నాం. వీటిలో ర్యాన్‌బ్యాక్సీ, డాక్టర్ రెడ్డీస్, ఫ్రెషెనియస్ కబి, మెర్క్ సొరెనో, సనోఫి పాస్టర్, బేయర్ హెల్త్‌కేర్, బెసిన్స్ హెల్త్‌కేర్, బయోకాన్ వీటిలో కొన్ని"అని చెప్పారు అమిత్

సమాచారం సగం కాదు.. పూర్తి బలం

ఇప్పుడున్నదంతా సమాచార విప్లవం. ఇలాంటి సమయంలో ఫార్మా కంపెనీలు డాక్టర్లకు నిక్కచ్చి సమాచారం ఇవ్వడం చాలా అవసరం. ఇలా చేయడంతో వారు ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అయ్యేందుకు అవకాశముంటుంది. ఇలాంటి లేటెస్ట్ సమాచారంతో.. పేషెంట్లపైన నేరుగా ప్రభావం చూపే అంశం. జెరోనిమో చేసేది ఇదే. సైంటిఫిక్ కమ్యూనికేషన్‌ను పంచే మెడికల్ కమ్యూనికేషన్స్ ఏజన్సీ జెరోనిమో. ఏ పేషెంట్ కేస్‌లో అయినా... లేటెస్ట్ లిటరేచర్‌ ఆధారంగా... రిపోర్ట్ తయారు చేయడం చాలా ముఖ్యం. ఫార్మా కంపెనీలకు న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీకి ఇలాంటి సర్వీసులు అందిస్తోంది జెరోనిమో.

"హెల్త్‌కేర్ పరిశోధనల కాంట్రాక్టులను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చే రంగంలో ఉన్నాం. ఆఫర్ చేసే సర్వీసులను అనుసరించి క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ సర్వీసెస్, మెడికల్ రైటింగ్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ వంటి పలు రకాలుగా వర్గీకరించచ్చు. ఈ మార్కెట్ ఇప్పుడు బూమ్‌లో ఉంది. మరో ఐదేళ్లలో 65 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకునే అవకాశాలున్నాయి. ఇలాంటి సర్వీసులకు ముఖ్యంగా మెడికల్ రైటింగ్ విషయంలో భారత్ ఇప్పుడు హబ్‌గా మారుతోంది. కార్మిక్ లైఫ్‌సైన్స్, సొరెంటో హెల్త్‌కేర్, కాక్టస్ కమ్యూనికేషన్స్, పబ్లిసిస్ హెల్త్‌కేర్ కమ్యూనికేషన్స్, మెడుల్లా, పాయింట్ బ్లాంక్, బయోక్వెస్ట్ వంటి కంపెనీలు... ఇప్పటికే ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. అయితే సరళీకృతం చేసిన కార్యకలాపాలు, తగిన స్పందన, పోటీ మార్కెట్‌కు అనుగుణంగా ధరల నిర్ణయం వంటి అంశాలు... భారతీయ క్లయింట్లతో అనుబంధాన్ని పెంచాయి" అంటున్నారు అమిత్.

చిన్నగా మొదలైన జెరోనిమో.. ఇప్పటివరకూ సొంత నిధులతోనే నడుస్తుంది. క్లయింట్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి, విస్తరణలపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ వ్యాప్తి చెందేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ ప్రవేశించేందుకు జెరోనిమో సిద్ధమవుతోంది. ఆర్థికంగా మరింత పుంజుకునేందుకు... అనుభవజ్ఞులైన నిపుణులను బోర్డ్‌లోకి తెచ్చుకునేందుకు ఇది సహాయపడ్తుందని అంటున్నారు అమిత్. పలు విభాగాలను శాఖలుగా మార్చేందుకు యత్నిస్తున్నారు.

"వ్యాపారం అంటే రోజూ కొన్ని తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం తప్పనిసరి. ఇన్వాయిస్ డేట్ నుంచి 90రోజుల తర్వాత మాత్రమే పేమెంట్ చేయాలనే నిబంధన ఏ స్టార్టప్ కంపెనీకయినా చాలా ఇబ్బందికరం. అయినా సరే ఈ రంగంలో నిలబడాలంటే దీనికి సిద్ధపడాల్సిందే. మనదేశంలో చాలా పోటీ ఉంది. క్లయింట్లు మమ్మల్ని విక్రయదారులుగా చూస్తారు తప్ప... వ్యూహాత్మక భాగస్వాములుగా భావించే పరిస్థితి లేదు. ప్రొఫెషనలిజం లేని క్లయింట్ల విషయంలో కొన్నిసార్లు చికాకు తప్పదు"అంటున్నారు అమిత్.

నిజానికి ఫార్మా సెక్టార్ మొత్తం చాలా తక్కువ మార్జిన్లతో నడుస్తోంది. దీంతో సర్వీసులు ఆఫర్ చేసే సమయంలో వీలైనంత తక్కువ ధరకే కోట్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారంలో విలువలు కూడా చాల ముఖ్యమే. క్లయింట్స్ అభిప్రాయాలు అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. వారు తప్పుగా అనుకున్నాసరే దాన్ని ధైర్యం చెప్పగలగాలి. ప్రతీ అంశాన్ని పేపర్‌పై ఉంచక తప్పదని, సరైన సమయంలో ఒప్పందాలు చేసుకు తీరాలన్నది... తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలుగా చెబ్తున్నారు అమిత్.

జెరోమినో హెల్త్‌కేర్ గురించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి: http://geronimohealthcare.com/

మ్యూజిక్ రంగంలోనూ ఈ డాక్టర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారని ముందు చెప్పుకున్నాం. కాలేజ్ బ్యాండ్‌లో గిటారిస్ట్ కం లీడ్ సింగర్ ఈయన. ఈ బ్యాండ్ పేరు డ్రగ్ ఆఫ్ ఛాయిస్.