వెండితెర మీద మాలావత్ పూర్ణ జీవితగాథ

మార్చి 31న రిలీజ్ కాబోతున్న బయోపిక్

0

బాలీవుడ్ లో మరో బయోపిక్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. అతిచిన్న వయస్సులోనే ఎవరెస్టును అధిరోహించిన మాలావత్ పూర్ణ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు బాలీవుడ్ దర్శక నిర్మాత రాహుల్ బోస్. మార్చి 31న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లడ్కియా కుచ్ భీ కర్ సక్తేహై అని ఈ మూవీకి ట్యాగ్ లైన్ పెట్టారు.

బేసిక్ గా పూర్ణ స్టోరీలోనే దమ్ముంది కాబట్టి.. ఈ సినిమాను ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు దర్శక నిర్మాతలు. తెలంగాణ రాష్ట్రంలోని పాకాల, భువనగిరిలో సినిమా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత డార్జిలింగ్, సిక్కింలో తెరకెక్కించారు. వీఎఫ్ఎక్స్ కూడా స్టోరీని మరింత ఎలివేట్ చేశాయి. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ జనాన్ని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ కు చెందిన అదితి అనే అమ్మాయి పూర్ణ పాత్రలో ఒదిగిపోయింది. ప్రస్తుతం తొమ్మిది తరగతి చదువుతున్న అదితి… ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మురిసిపోతోంది.

ఈ సినిమా ట్రైలర్ చూసిన పూర్ణ ఫుల్ ఖుషీగా ఉంది. ట్రైలర్ ను చూస్తే తన జర్నీ గుర్తుకు వచ్చిందని చెబుతోంది. ఈ సినిమా ఎంతోమందికి ఇన్ స్పిరేషన్ గా నిలవాలని కోరుకుంటోంది. మూవీ రిలీజ్ కోసం పూర్ణ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

Related Stories