హెల్త్‌కేర్ రంగానిదే భవిష్యత్తు -రతన్ టాటా

హెల్త్‌కేర్ రంగానిదే భవిష్యత్తు -రతన్ టాటా

Friday November 06, 2015,

2 min Read

టీ హబ్ లాంచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రతన్ టాటా.. స్టార్టప్ కమ్యూనిటీతో కాసేపు ముచ్చటించారు. వాళ్ల ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చారు. స్టార్టప్ ఈకో సిస్టంలో వచ్చే ప్రాధాన్యతా క్రమంలో తర్వాతి స్థానం దేనికి ఉండబోతోంది ? సమీప భవిష్యత్ లో ఏరంగం వైపు స్టార్టప్ ఇన్నోవేషన్లు వస్తాయని అడిగిన ప్రశ్నకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని సమాధానం ఇచ్చారు.

image


“మెడికల్‌కు సంబంధించిన అన్ని కోణాల్లో టెక్నాలజీ విస్తరిస్తుందని నేను నమ్ముతున్నా.” రతన్ టాటా

మెడికల్ బ్రేక్ త్రూని మనం గతంలో చూడనంతగా స్టార్టప్ ఈకో సిస్టంలో మనం చూడబోతున్నామన్నారు. మెడికల్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లు భారత్‌తోపాటు ఆఫ్రికాలో కూడా గమనించదగిన మార్పు తీసుకొస్తుందని చెప్పుకొచ్చారు. వీటితోపాటు అన్ని వర్థమాన దేశాల్లో మెడికల్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయని, టెక్నాలజీ విస్తరించి, అందరికీ అందుబాటులోకి మెడికల్ సౌకర్యాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టార్టప్ సంస్థలు సక్సస్ కావడానికి మీరు ఏ సందేశం ఇస్తారంటూ స్టార్టప్ కమ్యూనిటీ అడిగిన ప్రశ్నకు జవాబుగా మేక్ ది డిఫరెన్స్ అని సూచించారు రతన్ టాటా. మనమంతా యాపిల్ ప్రోడక్టులను కొనాలనుకుంటున్నమంటే అది స్టీవ్ జాబ్స్ గొప్పతనమే. ఒక ప్రాడక్ట్ లాంచ్ అయినా మొదట్లో సక్సస్ అయినా కాకపోయినా కొంతకాలంలో అది సక్సస్ అవుతుందనే నమ్మకం మనకుండాలి. అప్పుడే సక్సస్ వస్తుంది.

image


నాన్నమ్మ పిలుపుతో పారిశ్రామికవేత్త నయ్యా!

ఆర్కిటెక్ట్‌గా అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న రతన్ టాటా వ్యాపార రంగంలోకి ఎలా ప్రవేశించారని స్టార్టప్ కమ్యూనిటీ అడిగిన ప్రశ్నకు, రతన్ టాటా తన గ్రాండ్ మదర్‌ కారణమని చెప్పుకొచ్చారు. 

వ్యాపార రంగంలో రతన్ ప్రవేశం ఎలా జరిగిందనే దాన్ని ఆయనిలా వివరించారు. గ్రాండ్ మా ఇండియాలో ఉండిపోమని చెప్పిందని, ఆమె మాట కాదనలేక ఇక్కడ ఉండిపోయానని, తర్వాత ముంబై వెళ్లి కంపెనీ వ్యవహారాల్లో భాగస్వామ్యం అయ్యానని అన్నారాయన. అలా మొదలైన ప్రస్థానం దశాబ్దాల పాటు కొనసాగుతోంది. గడిచిన పదేళ్లుగా స్టార్టప్ ఈకో సిస్టమ్ కు టాటా ఎనలేని సేవలందిస్తున్నారు.

image


రతన్ టాటా ఇన్వస్ట్ చేయాలంటే ఏం చూస్తారు?

అందరికీ వచ్చే సందేహమే ఇది. రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్ కంపెనీలన్నీ సక్సస్ అయినవే. అదెలా సాధ్యం ? అనే ప్రశ్నకు సమాధానం టీ హబ్ స్టార్టప్ కమ్యూనిటీ క్వచన్ అండ్ ఆన్సస్ సెషన్‌లో లభించింది. కంపెనీ ఫౌండర్‌కు ఉన్న ప్యాషన్, సిన్సియారిటీ నచ్చితేనే ఆ సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారట. స్టార్టప్ ఐడియాని విన్నప్పుడు తనకు ఆశ్చర్యంగా(ఎక్సైట్ మెంట్) కలిగిస్తే వెంటనే ఇన్వెస్ట్ చేసేస్తారట. తనకు కలిగించిన ఆశ్చర్యం కచ్చితంగా ఆ కంపెనీ సక్సస్ కాగలదనే సూచనలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

image


పబ్లిగ్గా ఆ విషయం నెనెలా బయట పెడతా?

రతన్ టాటాను మోస్ట్ ఎగ్జైట్ చేసే అంశం ఏదైనా ఉందా అని స్టార్టప్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రశ్నకు.. ఆయన చెప్పిన సమాధానం ఇది.. 'నేను ఇంతమంది ముందు పబ్లిగ్గా ఆ విషయం ఎలా చెబుతానంటూ' అందరినీ నవ్వులతో ముంచెత్తారు. ఒక్క సారిగా హాల్ మొత్తం చిరునవ్వులు చిందించారు.