హాట్ హాట్ బ్రేక్ ఫాస్ట్ చిరునామా 'బ్రెక్కీ'

టిఫిన్.. ! ప్రతీ ఇంట్లో ఇదో పెద్ద ప్రహసనం. ఉదయాన్ని లేచి ఏదైనా వేడివేడిగా రూచిగా చేసుకుని తినడం ఉద్యోగులకు ఇప్పుడు ఓ కల ! ఒకవేళ రాత్రి లేట్ అయినా లేక ఏదైనా ప్లానింగ్ లేకపోతే ఇంట్లో గృహిణులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. అలా అని ఎప్పుడైనా బయట టేస్ట్ చేద్దామంటే అక్కడి రేట్లు, వాతావరణం, టేస్ట్ మన మూడ్ ఆఫ్ చేస్తాయి. ఇది ఎవరో ఒకరిద్దరి సమస్య కాదు. ప్రతీ ఇంట్లో నిద్రలేవగానే ఎదురయ్యే మొదటి సమస్య. ఇలాంటి వాటికి పరిష్కారం చూపిస్తూ వేడిగా రుచి,శుచికర బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తోంది ఓ బెంగళూరు సంస్థ. ఈ స్టోరీ చూస్తే.. ఇలాంటి సేవలు మన ఊళ్లో ఎప్పుడొస్తాయబ్బా అని అనకమానరు.

0

బ్రహ్మచారులు, ముఖ్యంగా సాఫ్టువేర్ రంగంలోనూ.. ఇతర పరిశ్రమల్లోను ఉద్యోగాలు చేస్తూ.. నగరాల్లో బతుకుతున్న వారిని కదిలిస్తే వినిపించే వ్యథ ఇది. ఇలాంటి ఆవేదన నుంచే అద్భుతమైన ఆలోచనను సృష్టించి.. విజయపథాన సాగుతున్నారు.. అశ్విన్ చంద్రశేఖరన్, హరిప్రియరాజా, నిఖిల్ భెల్ అనే మిత్రత్రయం. తమకు ఎదురైన సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా.. వీరు చేసిన ప్రయత్నమే.. బ్రెక్కీ! శుచి, శుభ్రత, పోషక విలువలతో కూడిన ఉదయపు ఆహారాన్ని నేరుగా వినియోగదారుల ఇంటిముంగిటికే చేర్చడమే లక్ష్యంగా.. ఈ మిత్రులు బ్రెక్కీని ప్రారంభించారు. ఇలా ఇంటింటికీ టిఫిన్ ను చేర్చడమే కాదు.. వీరు... ఇందిరానగర్ వద్ద హండ్రెడ్ ఫీట్ రోడ్ 9 ఎ మెయిన్ వద్ద ఓ తోపుడు బండినీ నిర్వహిస్తున్నారు.

“ దీన్ని ప్రారంభించడానికి రెండు కారణాలున్నాయి. వినియోగదారులకు అవసరమైన మంచి టిఫిన్ దగ్గరలో అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే.. చాలామంది ప్రజలు ఏకంగా భోజనం చేద్దామని భావిస్తుండడం రెండో కారణం” అంటారు అశ్విన్. ఈయన నెదర్లాండ్స్ లో పెరిగినా.. భారత్ లో స్థిరపడాలని మూడేళ్ళ క్రితం బెంగళూరు వచ్చారు.

ప్రతి బ్రెక్కీ బ్యాగ్, మూడు అంశాలతో కూడి ఉంటుంది. పరాఠాలు, ఊతప్పం, శాండ్ విచ్, ఛీలా, ఉడికించిన ఇడ్లీలు, ప్యాంకర్స్, కుకీస్ లాంటి పదార్థాలను తీసుకు వెళ్ళేందుకు ప్రధానమైన సంచీని ఉపయోగిస్తారు. పక్క భాగంలో.. సలాడ్ లాంటివి ఉంచొచ్చు. ట్రీట్ భాగంలో బ్రెడ్ ముక్కలు, కేకు ముక్కలు లాంటివి ఉంచేందుకు అనువుగా ఉంటుంది.

రోజువారీ టిఫిన్ మెనూ చాలా భిన్నంగా ఉంటుంది. “ మా టిఫిన్ మెనూ రోజురోజుకీ సరికొత్తగా ఉంటుందని ప్రజలూ గుర్తించారు” అని అశ్విన్ వెల్లడించారు. మేమేమీ పూర్తిగా ఆరోగ్యానికే ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. అయితే.. శుచి, శుభ్రతలతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పదార్థాలను వండి ప్రజలకు అందిస్తూ.. వారు టిఫిన్ ఎగ్గొట్టకుండా చూస్తూ.. వారి ఆరోగ్యాన్నీ పరిరక్షించ గలుగుతున్నాము. అని తెలిపారు.

నేను సాగర్స్ లో జిడ్డుతో కూడిన టిఫిన్ ను తినలేక సతమతమయ్యేవాడిని. వేకువ జామునే మంచి ఆహారాన్ని అందించే చోటుకి చేరుకున్నాను. బ్రెక్కీ లాంటి సేవలు ఎంతైనా అవసరం అంటారు నిఖిల్. ఈయన వేరే సంస్థలో పనిచేస్తూ.. బ్రెక్కీస్ వృద్ధి కోసమూ కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు.

మొత్తానికి బ్రెక్కీస్ ఆలోచనను అమలు చేసిన రెండు నెలల కాలంలోనే రోజుకి వంద మందికి పైగా వినియోగదారులు వీరి సేవలను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. వీరిలో సగం మందికి పైగా శాశ్వత చందాదారులుగా చేరిపోయారు. “ మేము ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశామనే భావిస్తున్నాను. ఇక దీన్ని ముందుకు తీసుకు వెళ్ళేందుకు రోజువారీగా శ్రమించాల్సి ఉంది” అంటారు అశ్విన్.

ఇందిరానగర్, ఉల్సూరు, ఎంజీ రోడ్డు పరిధిల్లోని వినియోగదారులకు.. ప్రత్యేక బ్రెక్కీ బ్యాగ్ లలో టిఫిన్ ను అందిస్తున్నారు. “ ఉదయాన్ని నిద్ర లేచీ లేవగానే.. కాలకృత్యాలను తీర్చుకోగానే.. ఎలాంటి హడావుడీ, శ్రమా లేకుండా.. వేడి వేడి టిఫిన్ ను ఇంట్లోనే ఆస్వాదిస్తూ తినగలిగేలా చేయాలన్న ఆలోచన మమ్మల్ని క్షణం ఆగనివ్వదు. అంటారు హరిప్రియ. అడ్వర్టయిజింగ్ సంస్థల్లోని వ్యూహాలు, బ్రాండ్ రూపకల్పన విభాగాల్లో ఈమెకు మూడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది.

ప్రజలు నేరుగా వచ్చి మా పదార్థాలను కొనేందుకు తోపుడు బండి ఎంతో ఉపయోగపడుతోంది. మా వినియోగదారులు కాకపోయినా.. తోపుడు బండి వద్దకు వచ్చే ప్రజలతో నిత్యం సంభాషిస్తూ ఉంటాము అని హరిప్రియ వివరించారు. మా బండి దాకా వచ్చే ప్రజలనుంచి కొన్ని కీలకమైన సూచనలు అందుతుంటాయి. వేకువనే పోలీసులు కానీ, క్లీనర్లు కానీ, ఉదయపు నడకకోసం వచ్చే వారు కానీ.. ఎవరైనా సరే.. మా బండి దాకా వస్తే.. వారికి ఉచితంగా టీని అందిస్తున్నాము.” అనితెలిపారు. ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరు తోపుడు బండి వద్ద వ్యాపారం చూసుకుంటే.. మిగిలిన ఇద్దరు, టిఫిన్ బ్యాగ్ లను వినియోగదారులకు చేర్చడంలో తలమునకలవుతారు.

ఉదయం ఐదుగంటలకు పదార్థాల తయారీ ద్వారా వారి జీవితం మొదలవుతుంది. ఏరోజు ఏ పదార్థాలను వండాలనే మెనూను వారం రోజుల ముందే సిద్ధం చేసుకుంటారు. తద్వారా, అయోమయాన్ని నివారించే వీలుంటుందన్నది వారి భావన.

ఫేస్ బుక్, వెబ్ సైట్లు, వాట్సాప్ గ్రూపులతో సంభాషణల ద్వారానే వీరి వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. ఈ బృందం ఎప్పటికప్పుడు నూతనమైన ఆలోచనా విధానాలతో అబ్బురపరుస్తుంటుంది. ఈమధ్యనే, స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ కర్ణాటక సంస్థ ద్వారా, టిఫిన్ పార్సిల్ కొసం బ్రెక్కీ బ్యాగ్స్ సంచులను తయారు చేయించారు.

వివిధ రకాల సందర్భాలకు తగిన ప్రత్యేక వంటకాలను వీరు తయారు చేస్తున్నారు. తాజాగా క్రిస్మస్, నూతన సంవత్సరాది నాటికి ఎలాంటి వంటకాలను తయారు చేయాలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

చిరునామా : కార్నర్ స్టోన్ పార్క్, 9వ మెయిన్, 100 ఫీట్ రోడ్ (కె.ఎఫ్.సి. జంక్షన్ వద్దనున్న పీటర్ ఇంగ్లండ్ షోరూమ్ కుడిపక్కన), ఇందిరానగర్

https://www.facebook.com/brekkieblr/timeline

http://www.brekkie.in

+91-9008504094

ఉదయాన్నే లేచి వెబ్ సైట్ లో... ఫేస్ బుక్ పేజీలో అందంగా ఉంచిన మెనూ కార్డును పరిశీలిస్తే ఆరోజుటి నోరూరించే వంటకాల వివరాలు తెలుస్తాయి.

ధరలు :

బ్రెక్ బ్యాగ్ (విడిగా): రూ 80, బ్రెక్కీ బ్యాగ్ (వారానికి) : రూ 400, బ్రెక్కీ బ్యాగ్ (నెలకు) : రూ 1500 చొప్పున ప్రస్తుతం ఇందిరానగర్, ఉల్సూర్, ఎంజీ రోడ్ ప్రాంతాల్లో ఎలాంటి అదనపు డెలివరీ రుసుమూ తీసుకోకుండా సరఫరా చేస్తున్నారు.

వివరాలు :

సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 7.45 గంటల నుంచి 10*30 గంటల వరకు పనిచేస్తుంది. బ్రెక్కీ బ్యాగ్ కోసం డబ్బులు మాత్రమే చెల్లించాలి. బండి వద్దనే టిఫిన్ తీసుకునే వారికి ఒక టీ ఉచితంగా అందిస్తారు.