మహిళల బాధ తెలిసిన మగాడు ..అరుణాచలం

మహిళల ఆరోగ్యంతోనే దేశ ప్రగతి దాగుందని నమ్మిన అరుణాచలంకేవలం 12 శాతం మంది మహిళలే రుతుక్రమ సమయంలో నాప్‌కిన్ల వాడకంభారతీయ మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ వాడకంపై అవగాహననాప్‌కిన్ల వినియోగాన్ని సామాజిక విప్లవంలా మార్చి ప్రసంగాలుపదిమందికీ ఆరోగ్యకరమైన ఉపాధిని అందిస్తున్న మురుగానంతమ్

మహిళల బాధ తెలిసిన మగాడు ..అరుణాచలం

Wednesday June 24, 2015,

5 min Read

కేవలం 12 శాతం మంది భారతీయ స్త్రీలు మాత్రమే రుతుక్రమం సమయంలో ఆరోగ్యకరమైన నాప్ కిన్లను వాడుతున్నారు. అరుణాచలం మురుగానంతమ్ దీన్ని మార్చేయబోతున్నాడు. ఓ సామాజిక విప్లవాన్ని మొదలు పెట్టిన ఆయన.. ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి ప్రదాత. ఇంతకీ అరుణాచలం మురుగానంతమ్ చేసిన ఆ వ్యాపారమేంటి..? దాన్ని వ్యాపారమనాలా..? లేక సామాజిక చైతన్యమనాలా..? ఈ కథ విని మీరే చెప్పండి.

వాడటమంటే అది ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వైద్య విద్యార్థులను సంప్రదించి వెదురు, పేపర్, దూది వంటి వాటితో ప్రయోగాలు చేశాడు. ఫలితాన్ని సాధించాడు. తక్కువ ధరకే నాప్ కిన్ తయారు చేసే యంత్రాలను రూపొందించారు. ఇదే ఇప్పుడు చాలామందికి ఉపాధి మార్గంగా మారింది. నిజాయితీ, నిబద్ధతలతో కూడిన ప్రయత్నం ఎప్పుడూ గొప్ప ఫలితాలనే ఇస్తుంది. ప్రతి ఇంట్లో ఆడవాళ్లుంటారు. పెళ్లి కావాల్సిన యువతులుంటారు. నెలసరి సమయంలో వాళ్లు పడే బాధను ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల మహిళలు రుతుక్రమం సమయంలో పాతబట్టలు వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత అనారోగ్యకరం, హానికరం కూడా. పల్లెటూరి వాళ్లకి, పేద మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ కొనే స్థోమతెక్కడిది..? 

ఈ ఆలోచనలోంచి పుట్టింది అరుణాచలం మురుగానంతమ్‌కి ఓ గొప్ప లక్ష్యం. ఎలాగైనా దేశంలోని మహిళలకు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తొలగించాలని అనుకున్నాడు. శానిటరీ న్యాప్‌కిన్స్ మీద పరిశోధనలు చేశాడు. ఎలా తయారు చేయాలి..? ఏమేం వాడాలి..? ఎంత ఖర్చవుతుంది..? ఏ మేరకు ధర వుంటుంది..? ఇలాంటి వాటిపై సమగ్రమైన పరిశీలన చేశాడు. కానీ.. మన దేశంలో న్యాప్‌కిన్స్ వాడటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వైద్య విద్యార్థులను సంప్రదించి వెదురు, పేపర్, దూది వంటి వాటితో ప్రయోగాలు చేశాడు. ఫలితాన్ని సాధించాడు. తక్కువ ధరకే న్యాప్‌కిన్స్ తయారు చేసే యంత్రాలను రూపొందించారు. ఇదే ఇప్పుడు చాలామందికి ఉపాధి మార్గంగా మారింది.

ఇంక్ టాక్స్ లో అరుణాచలం

ఇంక్ టాక్స్ లో అరుణాచలం


అరుణాచలం మురుగానంతమ్. ఈ పేరు వ్యాపార ప్రపంచంలో చాలాసార్లు వినిపించేదే. మన దేశంలోని పలు సంఘాలు, కాలేజీలు, సంస్థలు ఆయన చేత ఆతిథ్య ప్రసంగాలను ఇప్పిస్తుంటాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశకత్వం చేస్తుంటాయి. ఆయన తను నడిపే జయశ్రీ ఎంటర్‌ప్రైజెస్ గురించి దేశ వ్యాప్తంగా చాలా పేరుంది. ఇదేదో అత్యంత గొప్ప సంస్థ అనుకుంటే పొరపాటే. కానీ.. ఓ సామాజిక స్ఫూర్తిని అందిస్తూ ముందుకు సాగుతున్న పరిశ్రమ. అందుకే ఆయన తన వ్యాపార సంస్థను ‘కంపెనీ’ అని పిలవొద్దంటారు. అది ఓ చైతన్యవంతమైన ఉద్యమమని చెబుతారు.

నిజానికి ఓ వ్యాపారవేత్త అలా చెప్పడం గొప్ప విషయమే. ఎందుకంటే వ్యాపారమనేది కేవలం లాభాలకోసమే కాకుండా దాని వెనక ఏదో ఒక సామాజిక సేవా కారణనేది ఉండాలి. అరుణాచలం మురుగానంతమ్ జయశ్రీ ఇండస్ట్రీస్‌ను కూడా అలా నెలకొల్పిందే. ప్రతి ఏడాది మిలియన్ డాలర్ల వ్యాపారంతో నడుస్తున్న కంపెనీ ఇది. 

‘‘ఇప్పుడంటే నా దగ్గర బొలెరో కారు, కోయంబత్తూరులో ఇల్లు వున్నాయి. చిన్న నగరంలో కూడా పెద్ద షాపింగ్ మాల్‌నే కట్టానని చాలామంది చెబుతుంటారు. 5 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అవకాశం కూడా వచ్చింది. దానిపైనే గనక పెట్టుబడి పెట్టుంటే... ఇప్పటికే బొలెరో వదిలేసి ప్రైవేట్ జెట్ విమానంలో తిరిగే వాడిని ’’ అంటూ ఆయన వ్యాపార ప్రస్థానాన్ని గుర్తు చేసుకుని చెప్పారు.

ఎన్నో చిన్న కంపెనీల్లాగే జయశ్రీ ఇండస్ట్రీస్ కూడా తన పరిశ్రమను మొదలు పెట్టింది. మహిళలు రుతుక్రమం సమయంలో వినియోగించే శానిటరీ న్యాప్‌కిన్ అనే ఓ ప్రత్యేకమైన ఉత్పత్తిని తయారు చేయడం, దాన్ని మార్కెటింగ్ చేయడంతో ఊహించని విధంగా పురోగతి సాధించింది. దేశంలోని 25 రాష్ట్రాల్లో , వేల గ్రామాల్లో ఈ ఉత్పత్తిని వినియోగిస్తున్నారు. కానీ మురుగానంతమ్ ఇవన్నీ ఎలాంటి ఉద్యోగులను లేకుండానే చేశారు. నిజం, అతని వ్యాపారంలో ఇప్పటివరకు ఉద్యోగులే లేరు. కానీ వేల సంఖ్యలో ప్రజలు ఆయన కోసం పనిచేస్తున్నారు. ‘‘మీరు నాకు ఓ గంట సమయం మాట్లాడేందుకు కేటాయిస్తే చాలు... మా బృందంలో సభ్యుడివైపోతావు’’ అంటారు అరుణాచలం.

image


ఈ ఉద్యోగులే లేని కంపెనీ .. ఎంతోమందికి ఉపాధి ద్వారా ఉద్యోగాలను సృష్టించింది. వ్యాపారవేత్తలను చేసింది. వినియోగదారులు కేవలం ఉపాధికే పరిమితమైపోలేదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగానూ ఎదిగారు. ఈ తొమ్మిదేళ్లలో జయశ్రీ ఇండస్ట్రీస్ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాటిని సృష్టించిందంతే. మెల్లగా అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగింది. ఇలా జనం బాగుండాలని, మరీ ముఖ్యంగా మహిళల నెలసరి సమయంలో సంతోషంగా వుండాలని కోరుకుంటూ సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్న అతికొద్ది మందిలో అరుణాచలం మురుగానంతమ్ ఒకరు.

జయశ్రీ కంపెనీని.. సారీ... సారీ...ఉద్యమాన్ని .. ఎలా మొదలు పెట్టారని అరుణాచలం మురుగానంతమ్‌ను అడగాల్సిన పనిలేదు. ఆయన దాని గురించి అదేపనిగా నొక్కి వక్కాణించాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్‌గా చెప్పాలంటే.. దానిగురించి తెలుసుకుని తీరితేనే మంచిది. ఓ సమస్యకు సులభమైన పరిష్కారమే తమ సంస్థ అని చెబుతారు.


కళ్లు చెదిరే వాస్తవాలు

నీల్సన్ సర్వే రిపోర్టులో 12 శాతం మంది భారతీయ స్త్రీలు మాత్రమే వైద్యసంబంధమైన, ఆరోగ్యకరమైన శానిటరీ న్యాప్‌కిన్స్ వినియోగిస్తున్నారని తెలిపింది. ‘‘ఈ విషయంపై నేను చాలా అరిచి గీపెట్టాను. కానీ.. ప్రభుత్వం విదేశీ కంపెనీలకే పట్టం కట్టింది. మాకేం అవసరమో, మా సొంత భావాలను అర్థం చేసుకోకుండా అంతా విదేశీమయాన్ని ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలీదు. ఏదేమైనా 12 శాతం మంది భారతీయ మహిళలు మాత్రమే ఆరోగ్యకరమైన న్యాప్‌కిన్లను వాడుతున్నారంటే ఆ సంఖ్య నాకు చాలా తక్కువనిపించింది. మెట్రో నగరాలను పక్కన పెడితే అది ఇంకా తగ్గుతుంది’’ అంటున్నారు అరుణాచలం మురుగానంతమ్.

శానిటరీ న్యాప్‌కిన్స్ ఇప్పుడు చాలా చౌకగా మారాయి. వాటిపై ప్రకటనలు కూడా చాలానే వున్నాయి. అవన్నీ కూడా మార్కెటింగ్ సౌలభ్యం కోసమే. కానీ చాలామంది ఆరోగ్య రక్షణ అంశాన్ని ప్రస్తావించరు. ఎందుకంటే.. ఇది చాలా తేలికైన విషయమనుకుంటారు. ‘‘కానీ మీరు ఆరోగ్య రక్షణ గురించి మాట్లాడకుంటే.. ఇలాంటివి కూడా వున్నాయని తెలియని చాలామంది సంగతేంటి..?’’ అని ప్రశ్నిస్తున్నారు అరుణాచలం.

రెండోది... మన దేశంలో చాలా ఆంక్షలుంటాయి. కొన్ని దక్షిణ భారత సంస్కృతుల్లో మహిళలు శానిటరీ న్యాప్‌కిన్స్ వాడితే దేవుడు తమను గుడ్డివారిని చేసేస్తారని నమ్మే వాళ్లూ వున్నారు. ఉత్తర భారతదేశంలోని ఆచారాల ప్రకారం న్యాప్‌కిన్స్ వాడే మహిళలు, పెళ్లికాని యువతులు ఎక్కువే. ఇలాంటివారిని కూడా మురుగానంతమ్ తన చైతన్యవంతమైన ప్రసంగాల ద్వారా మెల్లగా మార్చగలుగుతున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుతున్నారాయన.

మురుగానంతమ్ తాను ఉత్పత్తి చేస్తున్న వైద్యరక్షణ గల న్యాప్‌కిన్స్ ఎలా వాడొచ్చో, ఎలా విక్రయించవచ్చో చెబుతున్నాడు. ‘‘ కొన్ని గ్రామాల్లో ఈ న్యాప్‌కిన్స్ టమోటాలు, ఉల్లిగడ్డలు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారు. కొందరైతే వాయిదాల పద్ధతిలో అమ్ముతున్నారు. ఈ న్యాప్‌కిన్స్ తయారు చేసే యంత్రాలను తక్కువ ధరకే అందిస్తున్నా. నాప్ కిన్లను ఎలా తయారు చేయాలో నేర్పుతున్నాను. ఎమ్మెన్సీ కంపెనీలు కూడా తోడ్పడుతున్నాయి. బ్యాంకులు కూడా ముందుకొచ్చి ఇలాంటి పరిశ్రమలకు చేయూతను అందిస్తున్నాయి’’ అంటూ జనంలో వచ్చిన మార్పును, వ్యాపారాభివృద్ధిని తెలిపారు అరుణాచలం

యాంత్ర సాధక విద్య- ఓ స్వప్నం ( Engineering – A vision ... )

మురుగానంతమ్ చేసే ఓ గంట సుదీర్ఘ సంభాషణ తర్వాత మా ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. అరుణాచలం ఎన్నో తరాలకు ఆదర్శం. ఏదేమైనప్పటికీ..ఆయనకు ఆదర్శమెవరని అడిగితే.. ''నాకెవరూ స్ఫూర్తిదాయకం కాదు. నీకు కూడా. నిజం చెప్పు... నీలాగే అచ్చంగా ఆలోచించే వేరే ఎవరైనా వున్నారా..? ఈ లోకంలో... ఎవరూ వుండరు. వందల కోట్ల ప్రపంచ జనాభాలో నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తివి. ఎవరితోనో పోల్చుకోవడం, స్ఫూర్తిని తీసుకోవడమెందుకు..? ’’ అంటూ వాస్తవాలను కళ్లకు కట్టారు.

image


ఓ వెల్డింగ్ షాప్ లో మురుగానంతమ్ ఇంజినీర్ గా పనిచేశారని తెలిస్తే ఆశ్చర్యమేసింది. ఆయన తండ్రి మరణించేనాటికి చాలా చిన్నవాడు. తనున్న గ్రామంలోనే వెల్డింగ్ పని నేర్చుకోవడం మొదలు పెట్టారు. ‘‘ ఆ వెల్డింగ్ షాపు యజమాని తాగుబోతు. రోజూ తాగి మురికి కాలువల పక్కన పడిపోయేవాడు. పనిపైన శ్రద్ధపెట్టేవాడు కాదు. ఆయన్ను చూస్తే అసహ్యమనిపించింది. ఆయనలా నా జీవితం కాకూడదని అనుకున్నా. 17 ఏళ్ల వయసులోనే 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మా యజమాని నుంచే షాపును కొనుగోలు చేశా. అలాగే మొదలైంది నా మొదటి సంపాదన’’ అంటూ గర్వంగా చెబుతారు మురుగానంతమ్.

తర్వాత కొన్ని నెలల్లోనే తన నూతన ఉత్పత్తిని తయారు చేయడం ప్రారంభించారు. ‘‘ఈ వ్యాపారం దానంతట అదే సొంతంగా విస్తరించి నడుస్తోంది. నా పనులు ఎప్పుడూ మరో పనిని సృష్టించేవిగా వుంటాయి. ఒక పని పూర్తి చేశానంటే.. ఆ తర్వాత వేరే పని చేసేందుకు వెళ్తా. అదే నేను చేస్తున్నా.. నేనో ఇంజినీర్ ను ఇంతకంటే నేనింక ఏమీ చెప్పలేను ’’ అంటూ తను నడిపే జయశ్రీ ఇండస్ట్రీస్ , న్యాప్ కిన్ల వాడకం , వ్యాపార ప్రయాణంపై క్లుప్తంగా చెప్పి ముగించారు అరుణాచలం మురుగానంతమ్ . ఆనాడు ఆయన నేర్చుకున్న పని, చేసిన ప్రయత్నాలే.. ఇవాళ గ్రామీణ మహిళలకు ఉపాధి మార్గాన్ని, ఆరోగ్యకర జీవన విధానాన్ని అందిస్తున్నాయి. మనం బతకడమే కాదు.. మన ప్రమేయం లేకుండానే పదిమందిని బతికేలా చేయాలి. అదీ ఆరోగ్యకరంగా. ఇదే అరుణాచలం నమ్మిన, అనుసరిస్తున్న సిద్ధాంతం.