నీలి తిమింగలాల 'ఆశా' కిరణం

సముద్రంపై ఉన్న మక్కువతో తిమింగిలాలపై పరిశోధనఅందరిలా కాకుండా, నా కంటూ ప్రత్యేకం అంటూ అడుగులుకృషి, పట్టుదల ఉంటే విజయం మీ వెంటే అనే సందేశంమెరైన్ బయాలజిస్ట్ ఆషా మనోగతం

నీలి తిమింగలాల 'ఆశా' కిరణం

Tuesday May 05, 2015,

5 min Read

సముద్రంలోతు చెప్పగలం కానీ అమ్మాయి మనసు లోతును కనుక్కోలేమంటారు. అంటే అతిశయోక్తి కోసం అలా చెప్పారు కానీ నిజానికి సముద్రం లోతెంతో కూడా అంత కచ్చితంగా చెప్పలేం. అలాంటి సంద్రంలో ఉండే జీవుల జీవన విధానం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఇదే విషయం ఆశలో ఆసక్తిని రేకెత్తించింది. తెలుసుకోవాలనే కోరికను మరింత రెట్టింపు చేసింది.ఎప్పుడూ నలుగురితో పాటు... జీవితం కొనసాగించడం కంటే.. నలుగురిలో ఒకరిలా ఉండాలనే లక్ష్యం కారణంగానే... తానో ఓ శాస్త్రవేత్త గా ఎదిగానంటారు ఆశా డిఓస్.

నీలి తిమింగలం, ఇతర మహాసముద్ర జీవులు గురించి అధ్యయనం చేయడమే కాదు. వాటిని మంచి ఆదాయ వనరులుగా మార్చడంలో ఆశా చూపిన బాట అందరికీ ఆదర్శం అయింది. సముద్ర జీవశాస్త్రం, ముఖ్యంగా నీలి తిమింగలం ప్రాణానికి డిమాండ్ ఎలా వచ్చిందో ఆమె వివరిస్తారు. ఆరేళ్ల వయసు నుంచే ఆశా సముద్రం, నీటి జీవులు పట్ల ఆకర్షితులయ్యారు. చిన్న వయస్సు నుంచే సముద్ర జీవశాస్త్రవేత్త ఆర్థర్ వంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. తరుచుగా నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలు చదవడం హాబీగా మారింది. గంటల కొద్ది వాటిపై ఆసక్తి పెంచుకోవడంతో... ఆమెకు తెలియకుండానే జీవితంలో నీలి తిమింగలం ఓ భాగంగా మారిపోయింది. నీళ్లలో ఉండే నీలి తిమింగలాలను చూసి అద్భుతంగా ఫీలయ్యారు. ఉష్ణమండల జలాల్లో ఎక్కువగా లభించే వీటిపై స్టడీ చేశారు. సముద్రంపై అధ్యయనం చేస్తున్న క్లార్క్ ఫ్యామిలీలో ఆషా పెరిగారు. ఆమెను స్వతంత్రంగా జీవించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడంతో, కల సాకారమైందని చెబుతారు. ఆశాను సముద్ర జీవుల గురించి అధ్యయనం చేయటానికి ప్రోత్సహించడంతో ఆమె ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఆశ డీఓస్

ఆశ డీఓస్


చిన్నప్పుడే బీజం...

ఆశా శ్రీలంకలోని శ్రీ విద్యా లేడీస్ కాలేజీలో ప్రాధమిక విద్య పూర్తి చేశారు. చదువుతో పాటు అదనపు విద్యా విషయక కార్యక్రమాలు పాల్గొనే అలవాటు ఉన్న ఆషా ఈత నేర్చుకోవడం... తర్వాత నీటి పోలోలో ఆరితేరారు. యంగ్ ఏజ్ నుంచే నీటిపై ప్రేమ పెంచుకున్న ఆమె సముద్రంపై అధ్యయనం కోసం స్కాట్లాండ్ వెళ్లారు. అది ప్రపంచంలో టాప్ స్కూల్ అయిన సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం.

సముద్ర జీవశాస్త్ర రంగంలో కొనసాగాలన్న బలమైన కోరికతో వర్శిటీలో ఉన్న సముద్ర ప్రయోగశాల వద్ద ఎక్కువ సమయం గడిపేవారు. ఆశా అక్కడ అధ్యయనాలు పూర్తి చేసి... మాస్టర్స్ చేయడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శటిలో చేరారు. తర్వాత సముద్ర క్షీరదాల పరిశోధనలో PhD పూర్తి చేశారు. సముద్రాలపై అధ్యయనం చేసిన ఆశాకు తన కుటుంబం మద్దతు లేకుండా ఇంత కష్టతరమైన పనులు చేయడం సాధ్యమయ్యేది కాదు.

కుటుంబంలో ఎల్లప్పుడూ ఆమె అభిరుచిని గౌరవించే పేరంట్స్ ఎప్పుడూ సంప్రదాయబద్దమైన డాక్టర్, లాయర్, ఇంజనీర్ అనే కోర్సులు పూర్తి చేయాలని తనపై ఎలాంటి వత్తిడి చేయకపోవడం వల్లనే , అనుకున్నది సాధించగలిగానని నమ్ముతారు. ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకోవాలని సూచించే వారని, దాంట్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మాత్రమే చెప్పేవారని ఆశా చెబుతారు. దీంతో " సముద్ర జీవశాస్త్రవేత్త" గా ఎదిగేందుకు దోహదపడిందని ఆమె సునిశిత అభిప్రాయం. 

అలాగని.. ఆషా జీవితం అంతా పూలపాన్పు కాలేదు. పురుషాధిక్య సమాజంలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడా మహిళలు లేకపోవడంతో సమస్యలు వచ్చినప్పటికి నీలం తిమింగలాల స్టడీలో ఉన్న ఉత్సాహాం వాటిని పక్కన పెట్టింది. లింగ వివక్ష ఎదుర్కొన్న ఆషాకు ఈ విషయంలో మార్గదర్శకుడు, సముద్ర జీవశాస్త్రవేత్త బీయింగ్ "రీచ్ అవుట్'' ద్వారా శ్రీలంక మహిళలపై డాక్యుమెంటరీ తయారీకి..ప్రోత్సహించడంతో వడివడిగా అడుగులు ముందుకు వేశారు. సాధారణంగా, మహిళలు సముద్రంలో పరిశోధనలకు రాత్రుళ్లు నిరీక్షించడం ఇబ్బంది కరమే. అటువంటి పరిస్థితుల్లోనూ ఆశా మహిళా ట్రైనింగ్ పొందేందుకు చాలా కష్ట పడాల్సి వచ్చింది. అయితే ఆమెకు ఉన్న నిబద్ధత, పట్టుదలతో ఆ రంగంలోనూ.... గౌరవం పెంచుకోగలిగారు. దీంతో ఆమెకు ఖచ్చితంగా ఇక్కడ ఎదుగుదల కనిపించింది. మీరు కలిసి పని చేస్తే అందరూ ముందుకు సాగుతాం అంటూ చేసిన ప్రచారం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వరుసగా దూసుకెళ్తున్న ఆమెకు 2011 లో Zonta అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. అంతే కాదు సముద్రానికి సంబంధించిన ప్రాజెక్టులు సమన్వయం చేసే స్థాయికి ఎదిగారు. శ్రీలంక తీర వనరుల్లో స్థానికులను చందాదారులు, భాగస్వామ్యులను చేశారు. దీంతో సముద్ర జీవశాస్త్రవేత్తగా ఉన్న ఆమె ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్‌కు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.

image


నేషనల్ ఆక్వాటిక్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రాజెక్టులకు సలహాదారురాలిగా ఉన్న ఆశా డి వోస్ అనేక కథనాలు, ప్రచురణలు వ్రాశారు. ఆస్ట్రేలియా, మాల్దీవులు, శ్రీలంక సహా అనేక దేశాలలో ఆమె ప్రాజెక్టులు సమర్పించారు. ప్రస్తుతం ఆమె వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో పి హెచ్ డీ విద్యార్థి. ఆమె 'దక్షిణ శ్రీలంకలో ఉన్న నీలి తిమింగలం- ప్రభావితం కారకాలు' అనే విషయంపై అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆషా TEDలో సీనియర్ ఫెలోగా ఉండడం అద్భుతమైన గౌరవంగా చెబుతారు. సముద్రం మధ్య శ్రీలంక ఉండటం వల్ల నీలం తిమింగలాలు ఎక్కువ ఉండడం, పరిశోధన చేసినప్పుడు ధ్రువాల వద్దకు నిదానంగా పైకి వెళ్లడం... మిగిలిన సమయాల్లో సుదూర ప్రాంతాల్లోకు వెళ్లడం వంటివి జరుగుతాయని ఆషా చెప్పారు.

మా జలాల్లో తిమింగలాలు నిజానికి సంవత్సరం పొడవునా ఉత్తర హిందూ మహాసముద్ర చుట్టూ ఉంటాయి - కాబట్టి ప్రాథమికంగా అవి వెచ్చని జలాల్లో ఉండేందుకు ఏడాది పొడవునా ఆసక్తి చూపుతాయి. మాకు నీలి తిమింగళాలు తక్కువగా ఉన్నా...వాటి గురించి తెలుసుకున్నామంటారు మెరైన్ బయాలజిస్ట్ ఆషా. అయితే బ్లూ వేల్స్ మేకింగ్, ఒక గొప్ప సముద్రపు దిగ్గజమని అర్ధం చేసుకున్నాం. శ్రీ లంక బ్లూ వేల్ నమూనా అంటార్కిటిక్ లో ఉండే వాటి కంటే ఎక్కువ 5 m, తక్కువ 25 మీటర్లు బ్లూస్, శ్రీలంక నీలం తిమింగలాలు ధ్రువ జలాలకు వలస వచ్చినట్లు కనిపిస్తాయి. అవి ఆహారం కోసం శ్రీలంక యొక్క వెచ్చని ఉష్ణ జలాల కోసం వస్తుంటాయి. ఇవో విభిన్న రకం కావడంతో.. నీలి తిమింగలాలు శబ్దాన్ని గుర్తించ లేని వాతావరణం కారణంగా శ్రీలంక వేల్స్ సాధారణంగా నీలం తిమింగలాలు ఎదుర్కొంటున్న గొప్ప సవాళ్లు అని ఆశా చెప్పారు:

image


షిప్ సమ్మెలు, చిక్కులప్పుడు నీలం తిమింగలాలు పెద్ద ప్రమాదాలలో చిక్కుకొనేవి. గతంలో ఉన్న వాటిని క్షీణింపచేయడం.. వాటికి కారణమైన తిమింగలాల వేట ఉండేది. నేడు, శ్రీలంక లో నీలం తిమింగలాలకు ఇప్పుడు ఓడ ట్రాఫిక్ గొప్ప సవాలు . శ్రీలంక యొక్క దక్షిణ తీరం ప్రపంచంలో అత్యంత రద్దీగల షిప్పింగ్ మార్గాలలో ఒకటి. మా జలాల ద్వారా హిందూ మహాసముద్రం యాత్ర తూర్పు నుండి పడమరకు ఉంటుంది. షిప్పింగ్ తో ఇక్కడ సమస్య నీలి తిమింగలాల జనాభా మీద ప్రభావం చూపుతుందని చెప్పడంతో మాకు బెదిరింపులు వచ్చాయి.

image


'' శ్రీలంక చుట్టూ సముద్ర జీవితం యొక్క గొప్ప వైవిధ్యం గురించి మరింత తెలుసుకోవడానికి పిల్లలు మరియు యువతను ప్రోత్సహించడం అవసరం'' దీని గురించి అవగాహన సృష్టించడం అవసరమంటారు. సముద్ర జీవితం పై ఛానల్ 7 ఆస్ట్రేలియా మినీ ఫీచర్ తయారు చేసి.. YouTube అప్ లౌడ్ చేశారు. దీంతో ఆమె ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నుంచి వస్తున్న ఇమెయిల్స్ తో ఉత్సాహాం మరింత పెరిగిందంటారు. ప్రపంచంలో శ్రీలంక గురించి పూర్తిగా తెలుసుకోవటం మొదలైందని సంతోషిస్తున్నామంటారు. అలాగే నాణ్యతతో కూడిన సముద్ర పరిశోధనలతో తమ దేశపు ఖ్యాతి పెరిగిందని భావిస్తుంటారు. శ్రీ లంకకు ఉత్పాదకత, పరిశోధనలు ఎంత అవసరమో వివరించే పని కొనసాగిస్తున్నారు ఆషా... ఎవరైనా జూనియర్ శాస్త్రవేత్త సలహా అడిగితే.. ఐదు విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తారు.. 

ముందు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో...దానిపై ప్రేమ పెంచుకోండి.. అది సక్సెస్ అయినా కాకపోయినా ఏమి పట్టింపు లేదంటారు. ఇక రెండవది మీరు చేస్తున్న పనిని ఎందుకని ఎక్కువ మంది అడిగితే... దాని గురించి మక్కువ పెరుగుతుంది. ఒక్కొక్కప్పుడు విషయాలు విషాదకరమైన అనుభూతి మిగులుస్తాయి..ఈ ప్రక్రియలో ఏన్నో ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని చెబుతారు. ప్రతి మబ్బుకు ఖచ్చితంగా వెండి పూత ఉంటుంది. 

మూడోది, ప్రేమ, గౌరవంతో మనకు మనం ఓ బేస్ నిర్మించడానికి శ్రమ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎదుర్కొనే పనికి సహాయపడడం నాలుగోది. చాలా విలాసమైన ఈ ప్రపంచంలో చాలా అవకాశాలు, వాటిని అధిగమించడమే ఐదోది. ఎల్లప్పుడూ ఓపెన్ మైండెడ్ గా ఉండి... నేర్చుకోవడానికి తపన ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతిదీ, నేర్చుకుంటూ ఉంటే.. అవకాశాలు పెరుగుతుంటాయి. కష్టపడక పోతే..చివరకు, మూలాలు కోల్పతారంటున్న ఆషా.. వీలైనంతవరకు నిరాడంబరంగా ఉండడానికి ఆసక్తి చూపించాలంటూ అంటూ ముగించారు.